పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కశ్యపుని రుద్రస్తోత్రంబు

  •  
  •  
  •  

3-463-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల సుధాకర రవి లో
ముల వికసింపఁ జేసి మధికరోషం
బునఁ జూచుచున్నవాఁ డదె
నితా! బంధుత్వ మరయ లవదు సుమ్మీ.

టీకా:

అనల = అగ్ని; సుధాకర = చంద్రుడు; రవి = సూర్యుడు (అను మూడు); లోచనములన్ = కన్నులను; వికసింపన్ = పెద్దవి; చేసి = చేసి; సమధిక = మిక్కిలి; రోషంబునన్ = రోషముతో; చూచున్ = చూస్తూ; ఉన్నవాడు = ఉన్నాడు; అదె = అదిగో; వనితా = స్త్రీ; బంధుత్వము = బంధుత్వము ఉందని; అరయన్ = చూడ, తరచిచూచుట; వలవదు = వద్దు; సుమ్మీ = సుమా.

భావము:

అగ్ని, చంద్రుడు, సూర్యుడు, ఆ రుద్రుని నేత్రాలు. ఆ త్రినేత్రుడు ఆ కన్నులు పెద్దవి చేసి మన వైపు అధిక రోషంతో చూస్తున్నాడు. ఆయన మన బంధువే కదా ఫరవాలేదు అని అనుకో వద్దు సుమా.