పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కశ్యపుని రుద్రస్తోత్రంబు

  •  
  •  
  •  

3-462-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విందానన! వీఁడె నీ మఱఁది లీలాటోపరుద్రక్షమా
ఝంఝానిలధూతపాంసుపటలచ్ఛన్నుండు ధూమ్రైకదు
ర్భవిద్యోతితకీర్ణభీషణజటాద్ధుండు భస్మావలి
ప్తరుచిస్ఫారసువర్ణవర్ణుఁ డగుచున్ భాసిల్లు నత్యుగ్రుఁ డై.

టీకా:

అరవిందానన = స్త్రీ {అరవిందానన - అరవిందము (పద్మము) వంటి ముఖము కలామె, స్త్రీ}; వీడె = ఇతడే; నీ = నీ యొక్క; మఱది = మరిది {కశ్యపుని సోదరుడు శివుడు - రుద్రులును ప్రజాపతులును బ్రహ్మదేవుని దేహమునుండే పుట్టిరి కనుక పరమశివుడు కశ్యపుడు అన్నదమ్ములు అనుటకు తగినది అందుచేత శివుడు దితికి మరిది అనుట చెల్లినది}; లీలా = విహారము నందలి; ఆటోప = సన్నాహమునన్; రుద్ర = స్మశాన; క్షమా = భూమిలో; చర = చలించుచున్న; ఝంఝా = పెను {ఝంఝా -ఝంఝం అని చప్పుడు చేస్తున్నది, ఝంఝామారుతము}; అనిల = గాలిచే; ధూత = ఎగురగొట్టబడిన; పాంసు = ధూళిరేణువుల; పటలిన్ = పొరలచేత; ఛన్నుండు = కప్పబడినవాడు; ధూమ్ర = బూడిదరంగుతో; ఏక = అసహాయ; దుర్భర = భరింపరాని; విద్యోతిత = మిక్కిలి ప్రకాశము కలిగి; కీర్ణ = చెదరిన; భీషణ = భయంకరమైన; జటా = జటల యొక్క; బద్దుడు = చుట్టలు ఉన్నవాడు; భస్మా = వీబూది; అవలిప్త = పూసుకొన్న; రుచిన్ = కాంతివలన; స్ఫార = అధికమైన; సువర్ణ = మంచిరంగుతో; వర్ణుడు = రంగు వేయబడినవాడు; అగుచున్ = అవుతూ; భాసిల్లున్ = ప్రకాశించుచున్నాడు; అతి = మిక్కిలి; ఉగ్రుడు = తీవ్రత కలవాడు; ఐ = అయి.

భావము:

కాంతా! అడుగో, అటు చూడు. నీ మరిది రుద్రుడు (రుద్రుడూ, కశ్యపుడూ బ్రహ్మదేవుని పుత్రులు, అందుచేత సోదరులు) రుద్రభూమినుండి సుడిగాలుల వల్ల చెలరేగిన ధూళితో నిండిన దేహంతో కలవాడై, కావిరంగుచే ప్రకాశిస్తూ భయంకరంగా చెదరి కదలుతున్న జటాజూటంతో, తెల్లని విభూతి పూతలతో, బంగారు కాంతులతో వెలిగిపోతున్నాడు.