పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితికశ్యప సంవాదంబు

  •  
  •  
  •  

3-457-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కరుణామతిన్ దుహితృ త్సలతం దనరారు నట్టి మ
ద్గురుఁ డొకనాడు మమ్ముఁ దన కూతుల నందఱఁ బిల్చి మీ మనో
రునెఱిఁగింపుఁ డిత్తుఁ గమలాననలార! యటన్న నందులోఁ
బురుషవరేణ్య! యేము పదమువ్వుర మర్మిలినిన్ వరింపమే."

టీకా:

వర = మంచి; కరుణా = దయగల; మతిన్ = మనసుతో; దుహిత్రున్ = పుత్రికల ఎడలి; వత్సలతన్ = వాత్సల్యముతో; తనరారున్ = విలసిల్లు; అట్టి = అటువంటి; మత్ = మా యొక్క; గురుడు = తండ్రి {గురువులు - 1 కన్నతండ్రి 2 పెంచినతండ్రి 3 ఉపాధ్యాయుడు 4 బృహస్పతి 5 కులముపెద్ద 6 తండ్రితోడ పుట్టిన వాడు 7 తాత 8 అన్న 9 మామ 10 మేనమామ 11 రాజు 12 కాపాడినవాడు}; ఒక = ఒక; నాడు = రోజు; మమ్మున్ = మమ్మల్ని; తన = తన యొక్క; కూతులన్ = కూతుళ్లను; అందఱన్ = అందరిని; పిల్చి = పిలిచి; మీ = మీ యొక్క; మనోహరున్ = మనసుకు నచ్చిన వానిని; ఎఱింగింపుడు = తెలుపండి; ఇత్తున్ = ఇచ్చెదను; కమలాననలార = అమ్మాయిలూ {కమలాననలు - పద్మములవంటి అననము (ముఖము)లు కలవారు, స్త్రీలు}; అటన్ = అని; అన్నన్ = అనగా; అందులో = అందులకు; పురుష = పురుషులలో; వరేణ్య = శ్రేష్ఠుడా; ఏము = మేము; పదమువ్వురమున్ = పదముగ్గురమును (13); అర్మిలిన్ = కోరికతో; నిన్ = నిన్ను; వరింపమే = వరించితిమా లేదా.

భావము:

ఓ పురుషశ్రేష్ఠుడా! దయాశాలి అయిన మా తండ్రి దక్ష ప్రజాపతికి ఆడపిల్లలంటే ఎంతో అభిమానం. ఆయన ఒకనాడు కూతుళ్లను మమ్మల్ని అందరిని పిల్చి, “కమలాల వంటి కన్నులు గల మా అందాల పుత్రికలూ! మీ మనస్సుకు నచ్చిన భర్తలను తెలియజేయండి ఇచ్చి పెండ్లి చేస్తాను” అని అడిగాడు. అప్పుడు మేము పదమూడు మందిమి నీ పేరు చెప్పి నిన్నే వరించాం కదా.”