పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితికశ్యప సంవాదంబు

  •  
  •  
  •  

3-456-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నీ యర్థమ యా
త్మావై పుత్ర యని వేద తులం దోలిన్
వావిరిఁ బలుకఁగ వినవే
ధీర! నను గావు మధికదీనన్ కరుణన్.

టీకా:

కావున = కనుక; ఈ = ఈ; అర్థమ = అర్థము లోనే; ఆత్మావై = నీవే పుట్టుదువు; పుత్ర = పుత్రునిగా; అని = అని; వేద = వేదముల; తతిన్ = సమూహములు; ఓలిన్ = చక్కగా; వావిరి = నొక్కి; పలుకగన్ = చెప్పుచుండుట; వినవే = వినలేదా; ధీ = బుద్ధిమంతులలో; వర = శ్రేష్ఠుడా; ననున్ = నన్ను; కావుము = కాపాడుము; అధిక = మిక్కిలి; దీనన్ = దీనురాలిని; కరుణన్ = దయతో.

భావము:

ఈ విషయాన్ని, ఆత్మస్వరూపుడైన తానే కుమారుడై జన్మిస్తాడు. ఆత్మావై పుత్రా. అని వేదాలు చెబుతున్నాయి. ఇది నీకు తెలియని విషయం కాదు. అతి దీనంగా ఉన్న నన్ను కరుణతో కాపాడు. పరమ బుద్ధిశాలీ!