పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితికశ్యప సంవాదంబు

  •  
  •  
  •  

3-452-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"విభుఁ డుద్ధతిన్ననఁటికంబములన్ విదళించు లీలఁ జి
త్తజుఁడు ప్రసూనసాయకవితానముచేత మదీయచిత్తమున్
జిబిజి సేసి నెవ్వగలఁ గాఱియవెట్టఁగ నాథ! నీ పదాం
బుములఁ గానవచ్చితి బ్రభుత్వమెలర్పఁగ నన్నుఁ గావవే!

టీకా:

గజ = ఏనుగుల; విభుడు = రాజు; ఉద్దతిన్ = దుడుకుతనముతో; అనటి = అరటి; కంబములన్ = స్తంభములను; విదళించు = తెగవేయు, తురుమివేయు; లీలన్ = విధముగా; చిత్తజుడు = మన్మథుడు {చిత్తజుడు - మనసున పుట్టువాడు, మన్మథుడు}; ప్రసూన = పుష్పముల; సాయక = బాణముల; వితానమున్ = సమూహము, విరివి; చేతన్ = చేత; మదీయ = నా యొక్క; చిత్తమున్ = మనసును; గజిబిజిచేసి = కలతపరచి; నెవ్వగలన్ = నిండుమాయలతో; కాఱియన్ = యాతన; పెట్టగన్ = పెట్టగా; నాథ = భర్తా; నీ = నీ యొక్క; పద = పాదములు అను; అంబుజములన్ = పద్మములను; కానగన్ = వెతుక్కుంటూ; వచ్చితిన్ = వచ్చితిని; ప్రభుత్వము = సామర్థ్యము చూపుట; ఎలర్పగన్ = అతిశయించునట్లు; నన్నున్ = నన్ను; కావవే = కాపాడుము.

భావము:

“ప్రాణేశా! అరటిచెట్టును పట్టి గజరాజు గజిబిజి చేసినట్లు, రతిరాజు మన్మథుడు తన పదునైన పూలబాణాలతో నా హృదయాన్ని కదిలించి వేస్తున్నాడు. ఆ బాధ భరించలేక నీ పాదపద్మాల దగ్గరకు వచ్చాను. నీ ఆధిపత్యం పటుత్వం ప్రదర్శించి నన్ను కాపాడు.