పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-449-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దండధరుఁ బెల్చ డాకాలఁ న్ని ధ్రువుఁడు
నిందు నందును వాసికి నెక్కె నట్టి
విష్ణుసంకీర్తనం బరవిందభవుఁడు
దివిజులకుఁ జెప్పె నది నీకుఁ దేటపఱతు.

టీకా:

దండధరున్ = యముని {దండధరుడు - దండించు బాధ్యతను ధరించిన (స్వీకరించిన) వాడు, యముడు}; పెల్చ = అతిశయముతో; డాకాలన్ = ఎడమ కాలితో; తన్ని = తన్ని; ధ్రువుడు = ధ్రువుడు; ఇందున్ = ఇహము నందును; అందునన్ = పరము నందును; వాసి = ప్రసిద్ధ; కిన్ = కి; ఎక్కెన్ = ఎక్కెను; అట్టి = అటువంటి; విష్ణున్ = విష్ణుని; సంకీర్తనంబున్ = చక్కటిస్తుతిని; అరవిందభవుడు = బ్రహ్మదేవుడు {అరవిందభవుడు - అరవిందము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), విష్ణువు}; దివిజుల్ = దేవతల; కున్ = కు; చెప్పెన్ = చెప్పెను; అది = అది; నీకున్ = నీకు; తేటపఱతున్ = అర్థమగునట్లు తెలిపెదను.

భావము:

అటువంటి ప్రభావాన్ని సంపాదించిన ధ్రువుడు యమధర్మరాజును ఎడమకాలితో తన్ని ఈ లోకంలోనూ, పర లోకంలోనూ కూడా ప్రసిద్ధికెక్కి ఉన్నతపదాన్ని అందుకున్నాడు. అటువంటి వాసుదేవుని లీలావిశేషాలను బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పాడు. అదంతా నీకు విశదంగా చెప్తాను.