పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

 •  
 •  
 •  

3-447-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శ్రీరి యజ్ఞవరా రూపముఁ దాల్చి-
మించి హిరణ్యాక్షుఁ ద్రుంచె ననుచు
ప్పుడు మునినాథ చెప్పితి నాతోడ-
వ్వరాహంబు దంష్ట్రాగ్రమునను
రణి నెబ్భంగిని రియించె హరికి హి-
ణ్యాక్షుతోడ వైమున కేమి
కారణ మసుర నే తి సంహరించెఁ దా-
నింతయు నెఱిఁగింపు మిద్ధచరిత!"

3-447.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నిన మైత్రేయముని విదురుకు ననియె
"రికథాకర్ణనమునఁ బెంపార నీకు
న్మఫలసిద్ధి యగుటకు సందియంబు
లదు హరిమాయ విధికైన శమె తెలియ?

టీకా:

శ్రీహరి = విష్ణుమూర్తి {శ్రీహరి - శోభనకరమైన హరి, విష్ణువు}; యజ్ఞవరాహ = యజ్ఞవరాహ; రూపము = అవతారము; తాల్చి = ధరించి; మించి = అతిశయించి; హిరణ్యాక్షున్ = హిరణ్యాక్షుని {హిరణ్యాక్షుడు - హిరణ్య (బంగారము) వంటి కన్నులు ఉన్నవాడు, హిరణ్యాక్షుడు అను రాక్షసుడు}; త్రుంచెన్ = సంహరించెను; అనుచున్ = అంటూ; అప్పుడు = అప్పుడు; ముని = మునులకు; నాథ = నాయకుడా; చెప్పితి = తెలియజేసితివి; నా = నా; తోడన్ = తోటి; ఆ = ఆ; వరాహంబున్ = ఆదివరాహమూర్తి; దంష్ట్తా = కోరల; అగ్రముననున్ = చివరలయందు; ధరణిన్ = భూమండలమును; ఎబ్బంగిన్ = ఏ విధముగా; ధరియించెన్ = ధరించెను; హరి = ఆదివరాహమూర్తి {హరి - భరించువాడు, విష్ణువు}; హిరణ్యాక్షున్ = హిరణ్యాక్షుని; తోడన్ = తోటి; వైరమున్ = శత్రుత్వమున; కున్ = కి; ఏమి = ఏమిటి; కారణము = కారణము; అసురున్ = రాక్షసుని; ఏ = ఏ; గతిన్ = విధముగా; సంహరించెన్ = సంహరించెను; తాన్ = అతను; ఇంతయున్ = ఇదంతా; ఎఱింగింపుము = తెలుపుము; ఇద్ద = ప్రసిద్దమైన; చరిత = వర్తనకలవాడ;
అనినన్ = అనగా; మైత్రేయ = మైత్రేయడు అను; ముని = ముని; విదురున్ = విదురుని; కున్ = కి; అనియెన్ = చెప్పెను; హరి = విష్ణుమూర్తి; కథా = కథలను; ఆకర్ణనమునన్ = వినుటచేత; పెంపార = అతిశయించిన; నీకున్ = నీకు; జన్మ = జననము; ఫలసిద్ధి = సార్థకము; అగుట = అగుట; కున్ = కి; సందియంబు = అనుమానము; వలదు = లేదు; హరి = విష్ణుమూర్తి; మాయన్ = మాయను; విధి = బ్రహ్మదేవుని {విధి - జీవుల విధిని నిర్ణయించువాడు (నుదుట వ్రాయువాడు), బ్రహ్మదేవుడు}; కిన్ = కి; ఐనన్ = అయినప్పటికిని; వశమే = సాధ్యమగునాఏమి; తెలియన్ = తెలిసికొనుట.

భావము:

శ్రీమహావిష్ణువు యజ్ఞవరాహ రూపం ధరించి విజృంభించి హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించాడని చెప్పావు కదా! ఓ మునీశ్వరా! ఓ పవిత్ర చరిత్రుడా! ఆ వరాహం తన కోర చివర ఈ ధరణీ మండలాన్ని ఎలా ధరించింది? హిరణ్యాక్షునికి, విష్ణువునకూ విరోధం రావడానికి కారణం ఏమిటి? ఆ రాక్షసుణ్ణి శ్రీహరి ఏవిధంగా సంహరించాడు? సవిస్తరంగా ఇదంతా నాకు చెప్పు” అనగా, మైత్రేయుడు విదురునితో ఇట్లా అన్నాడు. నాయనా, ఆ శ్రీహరి కధలు వినాలి అనే ఆసక్తి గల నీకు జన్మ సాఫల్యం సిద్ధించింది. ఇందుకు సందేహం లేదు. ఆ శ్రీమన్నారాయణుని మాయ తెలుసుకోవడానికి బ్రహ్మకైనా తరం కాదు.