పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-443-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని మైత్రేయమునీంద్రుం
ఘుఁడు విదురునకుఁ జెప్పి ట్టి తెఱంగ
ర్జుపౌత్రునకున్ వ్యాసుని
యుఁడు వినిపించి మఱియుఁ గ నిట్లనియెన్.

టీకా:

అని = అని; మైత్రేయ = మైత్రేయుడు అను; ముని = మునులలో; ఇంద్రుండున్ = శ్రేష్ఠుడు; అనఘుడు = పుణ్యుడు; విదురున్ = విదురుని; కున్ = కి; చెప్పిన = చెప్పిన; అట్టి = అటువంటి; తెఱంగు = విధమును; అర్జున = అర్జునుని {అర్జునపౌత్రుడు - అర్జునుని మనుమడు, పరీక్షిత్తుమహారాజు}; పౌత్రునన్ = మనుమని; కున్ = కి; వ్యాసునిన్ = వేదవ్యాసుని {వ్యాసునితనయుడు - వేదవ్యాసుని పుత్రుడు, శుకమహర్షి}; తనయుడు = కొడుకు; వినిపించియున్ = చెప్పి; మఱియున్ = ఇంకనూ; తగన్ = తగినట్లు; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = పలికెను.

భావము:

అని మైత్రేయమహర్షి వికార విదూరుడైన విదురునకు వినిపించిన ఈ కథా విధానాన్ని వ్యాసమునీంద్రుని పుత్రుడైన శుకమహర్షి అర్జునుని మనుమడు అయిన పరిక్షన్నరేంద్రునికి వినిపించి ఇంకా ఇలా అన్నాడు.