పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భూమ్యుద్ధరణంబు

  •  
  •  
  •  

3-419-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సారించి యసహ్యవిక్రమ సమగ్రస్ఫూర్తిచే వేయఁగా
ది దప్పించి వరాహమూర్తి నిజదంష్ట్రాగ్రాహతిం ద్రుంచెఁ బెం
పొవం గ్రోధమదాతిరేక బలశౌర్యోదార విస్తార సం
దఁ బంచాస్యము సామజేంద్రుఁ జల మొప్పం ద్రుంచు చందంబునన్.

టీకా:

గదన్ = గదను; సారించి = సాచి; అసహ్య = సహింపరాని; విక్రమ = పరాక్రమముతో కూడిన; సమగ్ర = పూర్తి; స్ఫూర్తిన్ = బలము; చేన్ = తోటి; వేయగాన్ = దెబ్బవేయగా; అది = దానిని; తప్పించి = తప్పించి; వరాహమూర్తి = భగవంతుడు {వరాహమూర్తి - ఆదివరాహ రూపములో ఉన్నవాడు, విష్ణువు}; నిజ = తన; దంష్ట్రా = కోరల; అగ్రా = కొనలతో; ఆహతిన్ = పొడుచుటవలన; త్రుంచెన్ = సంహరించెను; పెంపొదవన్ = పెరిగిపోయిన; క్రోధ = క్రోధము; మద = మదములు; అతిరేక = అతిశయించిన; బల = బలము; శౌర్య = శౌర్యముల; ఉదార = మిక్కిలి; విస్తార = విజృంభించిన; సంపదన్ = సంపదలతో; పంచాస్యము = సింహము {పంచాస్యము - తెరచిననోరు గల మృగము, తెఱనోటిమెకము సింహము}; సామజ = ఏనుగులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని; చలము = ఊపు; ఒప్పన్ = ఒప్పునట్లు; త్రుంచు = చీల్చిచెండాడు; చందంబునన్ = విధముగా.

భావము:

ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడు సహింపరాని మహా శౌర్యంతో గిరగిరా గద త్రిప్పి వేశాడు. వరాహమూర్తి అది తప్పించుకున్నాడు. క్రోధంతో, గర్వంతో, అపారమైన పరాక్రమంతో విజృంభించిన మృగరాజు గజరాజును మట్టుపెట్టినట్లు ఆ వరాహమూర్తి తన వాడి కోరల అంచులతో వాడిని విదలించి తుదముట్టించాడు.