పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-9-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యిట్లనె "మైత్రేయుని
ఘుండగు విదురుఁడే రస్యము లడిగెన్?
ముని యేమి చెప్పె? నే పగి
దినిఁ దీర్థములాడె? నెచటఁ దిరుగుచు నుండెన్?

టీకా:

కని = చూచి; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; మైత్రేయునిన్ = మైత్రేయుని; అనఘుండు = పుణ్యుని; అగు = అగు; విదురుడు = విదురుడు; ఏ = ఏ; రహస్యములన్ = రహస్యములను; అడిగెన్ = అడిగెను; ముని = మునీశ్వరుడు; ఏమి = ఏమి; చెప్పెన్ = చెప్పెను; ఏ = ఏ; పగిది = విధమున; తీర్థములు = తీర్థములలో స్నానములు; ఆడెన్ = చేసెను; ఎచటన్ = ఎక్కడెక్కడ; తిరుగుచున్ = విహరిస్తూ; ఉండెన్ = ఉండెను.

భావము:

అప్పుడు పరీక్షిత్తు శుకునితో ఇలా అన్నాడు “పుణ్యుడైన విదురుడు మాన్యుడైన మైత్రేయుని ఏ యే రహస్యాలు అడిగాడు; అందుకు ఆ మహాముని యేమేమి సమాధానాలు చెప్పాడు; విదురుడు ఏ యే తీర్థాలలో ఏ విధంగా స్నానం చేసాడు; ఎక్క డెక్కడ ఏ విధంగా సంచరించాడు;