పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-7-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఁగ నొల్లక మద్గృహంబునకు భక్త
త్సలుం డగు కృష్ణుండు చ్చు టేమి
తము? నా కది యెఱిఁగింపు రుణతోడ"
నుచు విదురుండు మైత్రేయు డిగె" ననిన.

టీకా:

చనగన్ = వెళ్ళుటకు; ఒల్లక = ఒప్పుకొనక; మత్ = మాయొక్క; గృహంబున్ = ఇంటి; కున్ = కి; భక్త = భక్తులందు; వత్సలుండు = వాత్సల్యము కలవాడు; అగు = అయిన; కృష్ణుండు = కృష్ణుడు; వచ్చుటన్ = వచ్చుటకు; ఏమి = ఏమి; కతము = కారణము; నాకున్ = నాకు; అది = దానిని; ఎఱిగింపుము = తెలుపుము; కరుణ = దయ; తోడఁ = తో; అనుచున్ = అని; విదురుండు = విదురుడు; మైత్రేయున్ = మైత్రేయుని; అడిగెన్ = అడిగెను; అనిన = అనగా.

భావము:

భక్తుల ఎడ వాత్సల్య పూరితుడు కృష్ణుడు దుర్యోధనుని ధామమునకు వెళ్ళకుండా, ప్రత్యేకంగా నా ఇంటికి దయచేసాడు. ఇట్లా రావడానికి కారణం ఏమిటి దయచేసి ఇందులో ఉన్న రహస్యం నాకు విప్పి చెప్పు” అని విదురుడు మైత్రేయుణ్ణి అడిగాడు.