పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-6-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మండితతేజోనిధి యై
పాంవ హితమతిని దూతభావంబున వే
దంపురి కేగి కురుకుల
మంనుఁ డగు ధార్తరాష్ట్రు మందిరమునకున్.

టీకా:

మండిత = అలంకరింపబడిన; తేజస్ = తేజస్సునకు; నిధి = గని వంటివాడు; ఐ = అయి; పాండవ = పాండవులకు; హిత = మేలు; మతిన్ = చేయు నుద్దేశ్యముతో; దూత = దూతగా; భావంబునన్ = పనిచేయుచు; వేదండపురి = హస్తినాపురము; కిన్ = కి; ఏగి = వెళ్ళి; కురు = కౌరవ; కుల = వంశమునకు; మండనుడు = అలంకారము; అగు = అయిన; ధార్తరాష్ట్రు = దుర్యోధనుని; మందిరమున్ = భవనము; కున్ = కు.

భావము:

తేజస్సు అనే నిధిని భూషణంగా కలిగినవాడై, ఆ గోవిందుడు పాండవుల మేలు కోరి, రాయబారి బాధ్యత స్వీకరించి హస్తినాపురానికి వెళ్ళాడు. కౌరవ వంశాన్ని అలంకరించి ఉన్న ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుని సౌధానికి .....