పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-34-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యిట్లుఁ దఱిమి చెప్పిన
విని దుర్యోధనుఁడు రోషవివశుండై తా
నితనయ శకుని దుశ్శా
నుల నిరీక్షించి తామసంబునఁ బలికెన్.

టీకా:

అని = అని; ఇట్లు = ఈవిధముగ; తఱిమి = నొక్కి; చెప్పినన్ = చెప్పగా; విని = విని; దుర్యోధనుడు = దుర్యోధనుడు; రోష = రోషము వలన; వివశుండు = ఒడలు తెలియని వాడు; ఐ = అయి; తాన్ = తను; ఇనతనయ = కర్ణుని {ఇనతనయుడు - ఇన(సూర్యుని) తనయుడు(పుత్రుడు), కర్ణుడు}; శకుని = శకునిని {శకుని - దుర్యోధనుని మేనమామ}; దుశ్శాసనులన్ = దుశ్శాసనులను {దుశ్శా,నుడు - దుర్యోధనుని తమ్ముడు}; నిరీక్షించి = చూచి; తామసంబునన్ = దురహంకారముతో; పలికెన్ = అనెను.

భావము:

అని ఈ విధంగా విదురుడు నొక్కి చెప్పాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు రోషావేశంతో వశం తప్పిపోయాడు. తన మిత్రుడూ సూర్యుని కుమారుడూ అయిన కర్ణుణ్ణీ, మేనమామ శకునినీ, తమ్ముడైన దుశ్శాసనుణ్ణీ చూచి అహంకారంతో ఇలా అన్నాడు.