పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-31-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి జగన్నివాసుఁడు మురాసురభేది పరాపరుండు చే
ట్టి సఖుండు, వియ్యమును, బాంధవుఁడున్, గురుఁడున్, విభుండునై
యిట్టలమైన ప్రేమమున నెప్పుడుఁ దోడ్పడుచుండు వారలం
జుట్టన వ్రేల నెవ్వరికిఁ జూపఁగ వచ్చునె? పార్థివోత్తమా!

టీకా:

అట్టి = అటువంటి; జగన్నివాసుడు = కృష్ణుడు {జగన్నివాసుడు - లోకమే తన నివాసముగ ఉన్నవాడు, కృష్ణుడు}; మురాసురభేది = కృష్ణుడు {మురాసురభేది - ముర అనే రాక్షసుని సంహరించిన వాడు, కృష్ణుడు}; పరాపరుడు = కృష్ణుడు {పరాపరుడు - పరమునకే అపరమైనవాడు, కృష్ణుడు}; చేపట్టి = స్వీకరించి {చేపట్టు - చేయి పట్టు, స్వీకరించు}; సఖుండు = స్నేహితుడు; వియ్యము = పెళ్ళిద్వారా బంధువు; బాంధవుడున్ = చుట్టమును; గురుడున్ = కాపాడువాడు {గురువు - 1. ఉపాధ్యాయుడు 2. బృహస్పతి 3. కులముపెద్ద 4. తండ్రి 5. తండ్రితోడబుట్టినవాడు 6. తాత 7. అన్న 8. మామ 9. మేనమామ 10. రాజు 11. కాపాడువాడు}; విభుండు = ప్రభువు; ఐ = అయి; ఇట్టలమైన = మిక్కిలి; ప్రేమమున = ప్రేమతో; ఎప్పుడున్ = ఎప్పుడూ; తోడ్పడుచున్ = సహాయపడుతూ; ఉండు = ఉండును; వారలన్ = వారిని; చుట్టనవ్రేలన్ = చూపుడువేలితో; ఎవ్వరికిన్ = ఎవరికైనాసరే; చూపగన్ = చూప; వచ్చునే = తరమే; పార్థివోత్తమా = రాజోత్తమా.

భావము:

. ఓ ధృతరాష్ట్ర రాజోత్తమా! ఆ శ్రీకృష్ణుడు సామాన్యుడా, లోకాలు అన్ని తన లోనే ఉంచుకున్న వాడూ, మురుడు అనే రాక్షసుణ్ణి మట్టుపెట్టినవాడూ, సర్వశ్రేష్ఠుడూనూ. ఆయనే చెలికాడుగా, వియ్యంకుడిగా, చుట్టంగా, ప్రబోధకుడిగా, ప్రభువుగా అతిశయించిన అనురాగంతో ఎల్లప్పుడూ పాండవులకు అండగా తోడ్పడుతూ ఉంటాడు. అలాంటి పాండవులను వేలెత్తి చూపడానికి ఎవరికైనా సాధ్యం అవుతుందా?