పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-30-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమేశుచే జగము లీ సచరాచరకోటితో సము
ద్దీపితమయ్యె; నే విభుని దివ్యకళాంశజు లబ్జగర్భ గౌ
రీతి ముఖ్య దేవ ముని బృందము; లెవ్వఁ డనంతుఁ డచ్యుతుం
డా పురుషోత్తముండు గరుణాంబుధి గృష్ణుఁడు పో నరేశ్వరా!

టీకా:

ఏ = ఏ; పరమేశు = దేవుని {పరమేశు - సమస్తమునకు పరమమైన ఈశ్వరుడు, కృష్ణుడు}; చేన్ = చేత; జగములు = లోకములు; ఈ = ఈ; సచరాచర = చరాచర జీవరాశులు; కోటి = అన్నింటి; తోన్ = తోటి; సమ = చక్కగా; ఉద్దీపితము = వెలుగునవి; అయ్యెన్ = అయినవో; ఏ = ఏ; విభుని = ప్రభువు యొక్క; దివ్య = దివ్యమైన; కళా = కళల; అంశజులు = అంశతో పుట్టినవారో; అబ్జగర్భ = బ్రహ్మ {అబ్జగర్భ - అబ్జము (పద్మము) నుండి గర్భ (పుట్టినవాడు), బ్రహ్మ}; గౌరీపతి = శివుడు {గౌరీపతి - గౌరీదేవి యొక్క భర్త, శివుడు}; ముఖ్య = మొదలగు; దేవ = దేవతల; ముని = మునుల; బృందములు = సమూహములు; ఎవ్వడు = ఎవడు; అనంతుడు = అంతము లేనివాడు; అచ్యుతుండు = నాశనము లేనివాడు; ఆ = ఆ; పురుషోత్తముండు = పురుషులలో ఉత్తముడు; కరుణాంబుది = కరుణకు సముద్రుడు; కృష్ణుడుపో = కృష్ణుడే సుమా; నరేశ్వరా = రాజా {నరేశ్వరుడు - నరులకు ప్రభువు, రాజు}.

భావము:

ఓ భూపాలా! దయాసముద్రుడు అయిన ఈ శ్రీకృష్ణుడే, పురుషోత్తముడు, ఈ పరమేశ్వరుని అనుగ్రహం వల్లే ఈ ప్రపంచం చరాచర జంతుజాలంతో సహా ప్రకాశిస్తూ ఉంది; బ్రహ్మదేవుడు, పరమశివుడు మొదలైన దేవతలూ, మునిగణమూ అందరూ ఈ దేవుని దివ్యమైన అంశాల నుండి జన్మించిన వారే; అనంతుడూ, అచ్యుతుడూ ఇతడే సుమా;