పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-28-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీపుత్రుల శౌర్యంబునుఁ
జాపాచార్యాపగాత్మజాత కృపభుజా
టోపంబునుఁ గర్ణు దురా
లాపంబులు నిజముగాఁ దలంతె మనమునన్.

టీకా:

నీ = నీ; పుత్రుల = కొడుకుల; శౌర్యంబును = శౌర్యమును; చాపాచార్య = ద్రోణుని {చాపాచార్యుడు - విలువిద్యకొరకైన గురువు, ద్రోణుడు}; అపగాత్మజాత = భీష్ముని {అపగాత్మజాత - అపగా (నది) ఆత్మజాత (పుత్రుడు), భీష్ముడు}; కృప = కృపాచార్యుని; భుజ = బాహు; ఆటోపంబున్ = బలమును; కర్ణు = కర్ణుని; దురాలాపంబులున్ = చెడ్డవాగుడును; నిజము = నిజము; కాన్ = అని; తలంతె = అనుకొనినావా; మనమునన్ = నీ మనసులో.

భావము:

మహారాజా! నీ కన్న కొడుకుల ప్రతాపాలూ, ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్యుల పటాటోపాలూ అంగరాజు కర్ణుడి అసందర్భ ప్రలాపాలూ ఇవన్నీ నిజమే అని నీ మనస్సులో కాని నమ్ముతున్నావా.