పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-26-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; నృపాల నా పలుకు వేయును నేల సమీరసూతి నీ
యుల పేరు విన్నఁ బదతాడిత దుష్టభుజంగమంబు చా
డ్పునఁ గనలొందు; నింతయును మున్నునుఁ జెప్పితిఁ గాదె వానిచే
భవదీయ పుత్రులకుఁ ప్పదు మృత్యు వదెన్ని భంగులన్.

టీకా:

వినుము = వినుము; నృపాల = రాజా {నృపాలుడు - నరులను పాలించువాడు, రాజు}; నా = నా; పలుకు = మాట; వేయున్ = వేలకొలది మాటలు; ఏల = ఎందులకు; సమీరసూతి = భీముడు {సమీరసూతి - వాయుదేవుని కొడుకు, భీముడు}; నీ = నీ యొక్క; తనయులన్ = కొడుకుల; పేరు = పేరు; విన్నన్ = విన్నంతనే; పద = కాలిచే; తాడిత = తొక్కబడిన; దుష్ట = చెడ్డ; భుజంగంబున్ = పాము; చాడ్పునన్ = వలె; కనలొందున్ = కోపించును; ఇంతయున్ = ఇది అంతయును; మున్నునున్ = ఇంతకు ముందే; చెప్పితిన్ = చెప్పాను; కాదె = కదా; వానిచేతన = వాటి వలన; భవదీయ = నీ యొక్క; పుత్రుల = కొడుకుల; కున్ = కు; తప్పదు = తప్పదు; మృత్యువు = చావు; అది = అది; ఎన్నిభంగులన్ = ఏమైనా సరే.

భావము:

రాజా! ధృతరాష్ట్రా! నా మాట పాటించు. నీకొడుకు దుడుకుతనం విన్నప్పుడల్లా ఆ భీమసేనుడు కాలుతో తొక్కిన కాలసర్పం లాగా మండిపడతాడు. ఇదంతా నీకు ముందే చెప్పాను గదా; ఎలాగైనా సరే ఆ వాయుదేవుని కుమారుడు భీముడి చేతిలో నీ కుమారులకు చావు తప్పదు.