పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-24-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ణీనాయక! పాండుభూవిభుఁడు నీ మ్ముండు; దత్పుత్రులం
రిరక్షించిన ధర్మముం దగవునుం బాటిల్లు; వంశంబు సు
స్థిసౌఖ్యోన్నతిఁ జెందు శత్రుజయముం జేకూరు; గోపాల శే
రు చిత్తంబును వచ్చు నట్లగుట యౌఁ గౌరవ్యవంశాగ్రణీ!

టీకా:

ధరణీనాయక = రాజా {ధరణీనాయక - భూమికి నాయకుడు, రాజు}; పాండుభూవిభుడు = పాండురాజు; నీ = నీ యొక్క; తమ్ముండు = తమ్ముడు; తత్ = అతని; పుత్రులన్ = కొడుకులను; పరి = బాగుగ; రక్షించినన్ = రక్షించినచో; ధర్మమున్ = ధర్మమును; తగవునున్ = న్యాయము; పాటిల్లున్ = కలుగును, సిద్ధించును; వంశంబు = కులము; సు = చక్కని; స్థిర = స్థిరత్వమును; సౌఖ్య = సౌఖ్యమును; ఉన్నతిన్ = పెంపుదల; చెందున్ = పొందును; శత్రు = శత్రువులపై; జయమున్ = జయమును; చేకూరు = కలుగును; గోపాలశేఖరున్ = కృష్ణుని; చిత్తంబునున్ = అనుకొన్నదియు; వచ్చును = జరుగును; అట్లు = ఆవిధముగ; అగుటన్ = జరుగుట; ఔ = మంచిది; కౌరవ్యవంశాగ్రణీ = ధృతరాష్ట్రా {కౌరవ్యవంశాగ్రణి - కురువంశమునకు పెద్దవాడు, ధృతరాష్ట్రుడు}.

భావము:

. ఓ ధృతరాష్ట్ర మహారాజా! పాండురాజు నీ తమ్ముడు. కనుక ఆయన కుమారుల్ని సంరక్షించడం ధర్మమూ, న్యాయమూ. కురుకులచూడామణీ! మీరు ఇలా చేస్తే మీ వంశం శాశ్వత సుఖసంపదలతో వర్థిల్లుతుంది. మీకు శత్రు విజయం లభ్యం అవుతుంది. గోపాలశిరోమణి అయిన కృష్ణుని మనస్సుకు ప్రియం కలిగించినట్లు కూడా అవుతుంది.