పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-22-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని ధర్మ బోధమునఁ బలి
కి మాటలు చెవుల నిడమి గృష్ణుఁడు విదురున్
నీతిమంతుఁ బిలువం
నిచినఁ జనుదెంచెఁ గురుసభాస్థలమునకున్.

టీకా:

అని = అని; ధర్మ = ధర్మమార్గమును; భోదమునన్ = తెలుపుతూ; పలికిన = చెప్పిన; మాటలు = మాటలు; చెవులనిడమిన్ = వినిపించుకొనకపోవుటచే; కృష్ణుడు = కృష్ణుడు; విదురున్ = విదురుని; ఘన = మిక్కిలి; నీతిమంతున్ = నీతిమంతుని; పిలువన్ = పిలుచుటకై; పనిచిన = పంపగా; చనుదెంచె = వచ్చెను; కురు = కౌరవుల యొక్క; సభాస్థలమున్ = సభ; కున్ = కి;

భావము:

ఆవిధంగా శ్రీకృష్ణుడు ధర్మప్రబోధం చేసాడు. ఆ మాటలు వారు వినిపించుకోలేదు. అప్పుడు ఆయన నీతిశాస్త్రం బాగా తెలిసిన విదురుణ్ణి పిలిపించాడు. విదురుడు కౌరవుల కొలువుకూటానికి వచ్చాడు.