పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-14-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రూరాత్ము లగుచు లాక్షా
గారంబున వారు నిద్ర గైకొని యుండన్
దారుణ శిఖిఁ దరికొలిపిరి
మాణకర్మముల కప్రత్తులు నగుచున్.

టీకా:

క్రూర = క్రూరమైన; ఆత్ములు = స్వభావము కలవారు; అగుచున్ = అవుతూ; లాక్ష = లక్క; ఆగారంబునన్ = ఇంటిలో; వారు = వారు; నిద్రగైకొని = నిద్రపోవుచు; ఉండగన్ = ఉండగా; దారుణ = దారుణమైన; శిఖిన్ = మంటలను; తరికొలిపిరి = ముట్టించిరి; మారణ = ప్రాణములను తీయు; కర్మములకున్ = పనులకు; అప్రమత్తులు = సిద్ధపడువారు; అగుచున్ = అవుతూ.

భావము:

పాండవులు లక్క ఇంట్లో మైమరిచి నిద్రపోతూ ఉండగా క్రూరహృదయులైన కౌరవులు ఇంటికి నిప్పంటించారు. వారిని రూపు మాపటానికి ఎన్నో పన్నాగాలు ఏమరుపాటు లేకుండా పన్నారు.