పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-12-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లువచ్చిన పాండవుల యెడ నసూయా నిమగ్నులై సుయోధనాదులు.

టీకా:

ఇట్లు = ఈవిధముగ; వచ్చినన్ = రాగా; పాండవుల = పాండవుల {పాండవులు - పాండురాజు పుత్రులు, ధర్మరాజాదులు}; ఎడన్ = యందు; అసూయా = అసూయలో; నిమగ్నులు = మునిగినవారు; ఐ = అయి; సుయోధన = దుర్యోధనుడు; ఆదులు = మొదలగువారు;

భావము:

ఇట్లు వచ్చిన పాండవుల యందు సుయోధనుడు మున్నగు కౌరవులు అసూయా నిమగ్నులు అయ్యారు;