పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరాహావతారంబు

  •  
  •  
  •  

3-411-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రళయజీమూతసంఘాత యద భూరి
ర్జనాటోపభిన్న దిగ్ఘన గభీర
రా మడరింప నపుడు రాజీభవుఁడు
మునులు నానందమును బొంది ఘచరిత!

టీకా:

ప్రళయ = ప్రళయకాల మందలి; జీమూత = మేఘముల; సంఘాత = ఘర్షణ వలన పుట్టిన; భయద = భయంకరమైన; భూరి = అత్యంత బిగ్గరగా ఉండు; గర్జనా = గర్ఝనల; ఆటోప = సన్నాహములను; భిన్న = ఓడిస్తున్న; దిక్ = దిక్కులు దద్దరిల్లు; ఘన = పెద్ద; గభీర = గంభీర; రావము = ధ్వని; అడరింపన్ = చేయగా; అపుడు = అప్పుడు; రాజీవభవుడు = బ్రహ్మదేవుడు {రాజీవభవుడు - రాజీవము (ఎఱ్ఱకలువ) యందు భవ (పుట్టిన) వాడు, బ్రహ్మదేవుడు}; మునులున్ = మునులును; ఆనందమును = సంతోషమును; పొందిరి = పొందిరి; అనఘచరిత = పుణ్యవర్తనుడా.

భావము:

వరహావతారుడు అయిన హరి ప్రళయకాలంలోని మేఘాల సమూహాలు భయంకరంగా గర్జించినట్లు విజృంభించి దిక్కులు పిక్కటిల్లేలా గంభీరంగా ఘుర్ ఘుర్ అని గర్జించాడు (వరాహం అరుపు ఘుర్). నాయనా పుణ్యవర్తనుడవైన విదురా! ఆ ఘన గంభీర ధ్వని విని బ్రహ్మదేవుడూ, మునులూ అపారమైన ఆనందాన్ని పొందారు.