పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరాహావతారంబు

  •  
  •  
  •  

3-409-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నా నమునఁ గల దుఃఖవి
రాము గావించుకొఱకు రాజీవాక్షుం
డీమేర యజ్ఞపోత్రి
శ్రీమూర్తి వహించె నిది విచిత్రము దలఁపన్."

టీకా:

నా = నా యొక్క; మనంబునన్ = మనసులో; కల = కలిగిన; దుఃఖ = దుఖమును; విరామము = పోవునట్లు; కావించున్ = చేయుట; కొఱకున్ = కోసము; రాజీవాక్షుండు = విష్ణుమూర్తి {రాజీవాక్షుడు - రాజీవముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; ఈ = ఈ; మేర = పరిమాణము కల; యజ్ఞ = యాగపు; పోత్రి = వరాహము యొక్క; శ్రీ = శుభకరమైన; మూర్తిన్ = స్వరూపమును; వహించెన్ = ధరించెను; ఇది = ఇది; విచిత్రము = విచిత్రమైనది; తలపన్ = ఆలోచించుటకైనా.

భావము:

“నా మనస్సులోగల, దుఃఖభారాన్ని, దూరం చేయటంకోసం, దేవాధిదేవుడైన రాజీవముల వంటి కన్నులు గల శ్రీహరి, ఈ విధంగా యజ్ఞవరాహరూపం ధరించాడు. ఎంతో వింత అయిన విషయం ఇది.”