పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరాహావతారంబు

  •  
  •  
  •  

3-408-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతఁ బ్రజాసర్గ మందు నియుక్తులై-
ట్టి మరీచ్యాదు లైన మునులు
నుకుమారకులు నమ్మను సహితంబుగ-
జ్ఞవరాహంబు ర్థిఁ జూచి
"యిట్టి యాశ్చర్య మెట్లెందేని గలదె నా-
సారంధ్రనిర్గత స్తబ్ధరోమ
తోకంబు మనము విలోకింప నంగుష్ఠ-
మాత్రమై యీ క్షణమాత్రలోన

3-408.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హిమ దీపింప దంతి ప్రమాణమున మ
హోన్నతంబైన గండశైలోపమంబు
య్యె" ననుచు వితర్కించి బ్జభవుఁడు
ర్ష మిగులొత్త నిట్లని పుడు దలఁచె.

టీకా:

అంతన్ = అంతట; ప్రజా = ప్రజలను; సర్గము = సృష్టించుట; అందున్ = అందు; నియుక్తులు = నియమింపబడినవారు; ఐనట్టి = అయినట్టి; మరీచి = మరీచి; ఆదులు = మొదలగువారు; ఐన = అయినట్టి; మునులున్ = మునులును; మనుకుమారులున్ = మనువు యొక్క కుమారులును; ఆ = ఆ; మను = మనువుతో; సహితంబుగన్ = కూడినవారై; యజ్ఞవరాహంబున్ = యజ్ఞవరాహమూర్తిని; అర్థిన్ = కోరి; చూచి = చూసి; ఇట్టి = ఇటువంటి; ఆశ్చర్యము = అద్భుతము; ఎట్లు = ఏవిధముగా; ఎందున్ = ఎక్కడ; ఏని = అయినా; కలదె = ఉందా ఏమి; నాసా = ముక్కు యొక్క; రంధ్ర = కన్నము నుండి; నిర్గత = వెలువడిన; స్తబ్ధరోమము = పంది, వరాహము {స్తబ్ధ రోమము - వ్యు. స్తబ్ధాని రోమాణి - అవ్య., బ.వ్రీ,, నిక్కబొడిచిన రోమములు కలది, పంది.}; తోకము = పిల్ల; మనమున్ = మనము; విలోకింపన్ = చూస్తుండగా; అంగుష్ట = బొటకనవేలు; మాత్రము = అంత మాత్రమే; ఐ = అయిన; ఈ = ఈ; క్షణ = క్షణము; మాత్ర = మాత్రపు సమయము; లోనన్ = లోపల; మహిమ = మహిమ; దీపింపన్ = ప్రకాశమగునట్లు; దంతి = ఏనుగు; ప్రమాణమునన్ = అంత పరిమాణమున; మహా = మిక్కిలి; ఉన్నతంబు = ఎత్తైనది; ఐనన్ = అయిన; గండ = పెద్ద; శైల = పర్వతమును; ఉపమంబున్ = పోలునది; అయ్యెన్ = ఆయెను; అనుచు = అని; వితర్కించిరి = మిక్కిలి తర్కించిరి; అబ్జభవుడు = బ్రహ్మదేవుడు; హర్షము = సంతోషము; ఇగురొత్తన్ = చిగురించగా; ఇట్లు = ఈవిధముగా; అని = అని; అపుడు = అప్పుడు; తలంచెన్ = తలచెను.

భావము:

అప్పుడు, ప్రజల్ని సృష్టించడంకోసం నియమించబడిన మరీచి మొదలైన మునులూ, మనువూ, మనువు కుమారులూ, యజ్ఞవరాహాన్ని చూశారు. “ఎంత ఆశ్చర్యం ముక్కురంధ్రంనుండి, వెలువడ్డ వేలంత బాలవరాహం క్షణంలోనే, పెద్ద ఏనుగంత అయి మహాపర్వతం అంత అయింది. ఇలాంటి విచిత్రం ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా.” అని తమలో తాము తర్కించుకున్నారు. బ్రహ్మదేవుడు ఎంతో సంతోషంతో ఇలా అనుకున్నాడు.