పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరాహావతారంబు

 •  
 •  
 •  

3-407-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఖిల జగత్కల్పనాటోపములకుఁ బా-
ల్పడిన నాచేత నెబ్బంగి నిపుడు
గిలి విశ్వంభరోద్ధరణంబుఁ గావింప-
గు నని సర్వభూతాంతరాత్ముఁ
బురుషోత్తముని నవపుండరీకాక్షు ల-
క్ష్మీపతిఁ దన మనస్థితునిఁ జేసి
లపోయుచున్నఁ బద్మజు నాసికా వివ-
మ్మున యజ్ఞవరాహమూర్తి

3-407.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ర్థి నంగుష్ఠమాత్ర దేహంబుతోడ
నన మంది వియత్తల స్థాయి యగుచు
క్షణము లోపల భూరి గప్రమాణ
య్యె నచ్చటి జనముల ద్భుతముగ.

టీకా:

అఖిల = సమస్తమైన; జగత్ = లోకములను; కల్పన = సృష్టించు; ఆటోపములు = సన్నాహముల; కున్ = కి; పాల్పడిన = పూనుకొన్న; నాచేత = నాచేత; ఎబ్బంగిన్ = ఏవిధముగా; ఇపుడు = ఇప్పుడు; తగిలి = పూని; విశ్వంభర = భూమిని; ఉద్ధరణంబున్ = ఉద్ధరణము; కావింపన్ = చేయుట; అగును = అగును; అని = అని; సర్వభూతాంతరాత్మున్ = భగవంతుని {సర్వభూతాంతరాత్ముడు - సమస్తమైన జీవుల అంతరాత్మ అయినవాడు, విష్ణువు}; పురుషోత్తముని = భగవంతుని {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; నవపుండరీకాక్షు = భగవంతుని {నవపుండరీకాక్షుడు - కొత్త (తాజా) పుండరీకము (పద్మము) లవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; లక్ష్మీపతిన్ = భగవంతుని {లక్ష్మీపతి - లక్ష్మీ యొక్క పతి, విష్ణువు}; తన = తన యొక్క; మనస్ = మనసున; స్థితునిన్ = ఉన్నవానిగా; చేసి = చేసి; తలపోయుచున్ = ఆలోచించుతూ; ఉన్న = ఉన్నట్టి; పద్మజున్ = బ్రహ్మదేవుని; నాసికా = ముక్కు యొక్క; వివరమ్మునన్ = రంధ్రమునుండి; యజ్ఞవరాహమూర్తి = విష్ణుమూర్తి {యజ్ఞవరాహమూర్తి - యజ్ఞమే తానైన వరాహ స్వరూపము కలవాడు, విష్ణువు}; అర్థిన్ = కోరి; అంగుష్ట = బొటకనవేలు; మాత్ర = అంత; దేహంబున్ = శరీరము; తోడన్ = తో; జననము = అవతారము; అంది = ధరించి; వియత్తల = ఆకాశమున; స్థాయి = ఉన్నవాడు; అగుచున్ = అవుతూ; క్షణము = క్షణము; లోపలన్ = లోపలనే; భూరి = అత్యంతపెద్దది ఐన; గజ = ఏనుగు; ప్రమాణము = అంత సైజు; అయ్యెన్ = ఆయెను; అచటి = అక్కడి; జనులున్ = వారి; కున్ = కి; అద్భుతము = ఆశ్చర్యకరము; కన్ = అగునట్లు;

భావము:

లోకాలన్నిటినీ సృష్టించాలనే ఆతృతతో సన్నాహాలకు ఎంతో ప్రయాసపడుతున్నాను. కాని ఈ భూమిని ఉద్ధరించడం ఎలా? నాచేత ఈ పని ఎలా జరుగుతుంది?” అని బ్రహ్మ తన మనస్సులో తలపోసి సకల భూతాలలోనూ అంతర్యామిగా ఉండే సర్వాంతర్యామీ, పురుషోత్తముడూ, పద్మాక్షుడు, లక్ష్మీదేవి భర్తా అయిన శ్రీమహావిష్ణువును తలచాడు. వెంటనే ఆ పద్మభవుడు అయిన బ్రహ్మ ముక్కు నుండి యజ్ఞవరాహమూర్తి బొటనవ్రేలంత పరిమాణంతో జన్మించి, ఆకాశానికి ఎగిరి, ఒక్క క్షణంలోనే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యచకితులయ్యేలా పెద్ద ఏనుగంత అయ్యాడు.