పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : స్వాయంభువు జన్మంబు

  •  
  •  
  •  

3-401-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుటిల భక్తిఁ గేశవ సర్పణబుద్ధిఁ గ్రతుక్రియల్ వొన
ర్ప విపరీతు లై యుముకురాసులు దంచి ఫలంబు నందఁ గా
చెడురీతి నూరక ధవ్యయ మౌటయ కాని మోక్షదా
మగుచున్నఁ దత్ఫలము నందరు విష్ణుపరాఙ్ముఖక్రియుల్.

టీకా:

అకుటిల = అకల్మష; భక్తిన్ = భక్తితో; కేశవ = భగవంతునికి {కేశవుడు - కేవలము ఈశుడు అయిన వాడు, విష్ణువు}; సమర్పణ = సమర్పించు; బుద్ధిన్ = భావముతో; క్రతు = యజ్ఞ; క్రియల్ = క్రియలు; పొనర్పక = చేయకుండగ; విపరీతులు = వ్యతిరేక విధముగ చేయువారు; ఐ = అయి; ఉముకు = ఊక; రాసులు = గుట్టలు; దంచి = దంచి {దంచు -బియ్యము మొదలగువాని కొరకు వడ్లు ఆదులను రోకళ్ళతో దంచుట}; ఫలంబున్ = ధాన్యమును {ఫలము - ఫలితము}; అందన్ = పొందుటను; కానక = చూడలేక; చెడున్ = చెడిపోవు; రీతిన్ = విధముగ; ఊరక = ఉట్టినే; ధన = ధనము; వ్యయంబున్ = ఖర్చు; ఔటయున్ = అగుటయే; కాని = కాని; మోక్ష = ముక్తిని; దాయకము = ఇచ్చునది; అగుచున్ = అవుతూ; ఉన్న = ఉన్నట్టి; తత్ = దాని; ఫలమున్ = ఫలితమును; అందరు = పొందరు; విష్ణున్ = విష్ణునికి; పరాన్ముఖ = ఇతరమైన దృక్కులతో; క్రియుల్ = పనులు చేయువారు.

భావము:

పవిత్రమైన చిత్తశుద్ధితో పరమేశ్వరార్పణ బుద్ధితో యజ్ఞకార్యాలు చేయాలి. అలాకాకుండా స్వార్ధబుద్ధితో పనులు చేయడం అంటే, వరిపొట్టును దంచి బియ్యం రాలేదని బాధపడటం లాంటిది. అందుచేత ధననాశమే గాని లవలేశం కూడా లాభం ఉండదు. హరి భక్తులు కాని వారు తాము ఆశించిన మోక్షాన్ని అందుకోలేరు.