పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : స్వాయంభువు జన్మంబు

  •  
  •  
  •  

3-395.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి కర్మంబు సేసిన నెసఁగు నీకు
వహితం బైన సంతోష మాత్మజుండు
నకునకు భక్తిఁ బరిచర్య లిపి కీర్తి
నంది నుతికెక్కి నర్తించు నందు నిందు.

టీకా:

వినిపింపన్ = వినిపించుట; తొడగెన్ = మొదలిడెను; ఆ = ఆ; ఘనుడు = గొప్పవాడు; స్వాయంభువుడు = స్వాయంభువుడు; అంగనా = భార్యతో; యుక్తుడు = కూడినవాడు; ఐ = అయ్యి; అబ్జగర్భున్ = అబ్జగర్భుని; కున్ = కి; మ్రొక్కి = నమస్కరించి; వినయ = వినయముతో; వినమిత = వంగిన; ఉత్తమాంగుడు = శిరస్సు కలవాడు {ఉత్తమాంగము - ఉత్తమమైన అంగము (అవయవము), తల}; ఐ = అయ్యి; హస్తముల్ = చేతులు; మొగిచి = జోడించి; ఇట్లు = ఈవిధముగా; అనియెన్ = పలికెను; ప్రీతిన్ = ఇష్టపూర్వకముగా; జీవ = ప్రాణుల; రాశులు = సమూహముల; కున్ = కి; రాజీవసంభవ = బ్రహ్మదేవుడా {రాజీవసంభవుడు - రాజీవము (పద్మము) న సంభవుడు (పుట్టిన వాడు), బ్రహ్మదేవుడు}; నీవ = నీవే; జనన = సృష్టి; రక్షణ = స్థితి; వినాశములన్ = లయముల; కున్ = కు; అరయన్ = పరిశీలించి చూసిన; హేతు = కారణము; భూతుడవు = వెలసినవాడవు; మాకు = మాకు; ఎద్ది = ఏది; ఆచరణీయము = ఆచరింపదగినది; ఐన = అయినట్టి; కర్మము = పని; దానిన్ = దానిని; ఆనతిమ్ము = తెలుపుము; అని = అని;
ఎట్టి = ఎటువంటి; కర్మంబున్ = కర్మములను; చేసిన = చేస్తే; ఎసగున్ = అతిశయించును; నీకు = నీకు; అవహితంబునన్ = మిక్కిలి ఇష్టముతో; ఐన = కూడిన; సంతోషము = సంతోషము; ఆత్మజుండు = పుత్రుడు {ఆత్మజుడు - ఆత్మన్ (తనకు) జన్మించిన వాడు, కొడుకు}; జనకున్ = తండ్రి; కున్ = కి; భక్తిన్ = భక్తితో; పరిచర్య = సేవలు; సలిపి = చేసి; కీర్తిన్ = కీర్తిని; అంది = పొంది; నుతికిన్ = స్తోత్రములలోనికి; ఎక్కి = ఎక్కి; వర్తించున్ = ప్రవర్తించును; అందున్ = పరమునందును; ఇందున్ = ఇహమునందును.

భావము:

మహానుభావుడైన మైత్రేయుడు విదురునితో ఇలా చెప్పసాగాడు “స్వాయంభువుడు తన భార్య శతరూపతో కూడా బ్రహ్మదేవునకు నమస్కారం చేసాడు. వినయంతో తల వంచుకొని, చేతులు జోడించి ప్రీతి పూర్వకంగా ఇలా అన్నాడు. “ఓ పద్మంలో జనించిన బ్రహ్మదేవా! ఈ విశ్వంలోని సకల ప్రాణులనూ పుట్టించుటకూ, పోషించుటకూ, సంహరించుటకూ, కారణభూత మైన వాడవు నీవే. మేము చేయవలసిన పని ఏమిటో, మాకు ఆజ్ఞాపించు. ఎలాంటి పని చేస్తే నీకు మిక్కిలి సంతోషం కలుగుతుందో, అది చేస్తాము. తండ్రికి భక్తితో సేవ చేసిన తనయుడు ఈ లోకంలో, ఆ లోకంలో అఖండ యశస్సు ఆర్జిస్తాడు. అందరి అభిమానానికి పాత్రుడవుతాడు.”