పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : స్వాయంభువు జన్మంబు

  •  
  •  
  •  

3-394-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని చెప్పి మునికులాగ్రణి
నుజారి కథాసుధాప్లుస్వాతుం డై
నువునఁ బులకాంకురములు
మొయఁగ నానందబాష్పములు జడి గురియన్.

టీకా:

అని = అని; చెప్పి = చెప్పి; మునికులాగ్రణి = మైత్రేయుడు {మునికులాగ్రణి - ముని జనములలో అగ్రమైన (పెద్ద) వాడు}; దనుజారి = విష్ణుని {దనుజారి - రాక్షసుల శత్రువు, విష్ణువు}; కథా = కథలు అను; సుధా = అమృతముచే; ప్లుత = తడసి; స్వాంతుడు = మనసు కలవాడు; ఐ = అయి; తనవునన్ = శరీరము; పులకాంకురములు = పులకింతలు; మొనయగన్ = పుట్టగా; ఆనంద = ఆనందము వలన; భాష్పములున్ = కన్నీటి బిందువులు అను; జడిన్ = వాన జడి; కురియన్ = కురియగా.

భావము:

ఇలా చెప్తున్న మైత్రేయ మహాముని హృదయం దానవాంతకుడైన శ్రీహరి కధలు అనే అమృతంలో తేలియాడింది. ఆయన శరీరం సంతోషంతో పొంగి పులకించింది. ఆయన నయనాలు ఆనందభాష్పాలు వర్షించాయి.