పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : స్వాయంభువు జన్మంబు

  •  
  •  
  •  

3-393-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని విదురుండు పల్కిన దయాన్వితుఁ డై మునినాథచంద్రుఁ డి
ట్లను ”శ్రుతిశాస్త్రపాఠకలితాత్మకుఁ డైన నరుండు పద్మలో
చరణారవిందయుగ సంగము గల్గిన సజ్జనుండు వొం
దిఫల మొందు భాగవతదివ్యకథాశ్రవణానురక్తిచేన్.”

టీకా:

అని = అని; విదురుండు = విదురుడు; పల్కినన్ = అనగా; దయా = దయతో; ఆన్వితుడు = కూడినవాడు; ఐ = అయి; ముని = మునుల; నాథ = నాయకులలో; చంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగా; అను = అనెను; శ్రుతి = వేద; శాస్త్ర = శాస్త్రములను; పాఠ = పఠించుటతో; కలిత = కూడిన; ఆత్మకుడు = మనసు కలవాడు; ఐన = అయిన; నరుండున్ = మానవుడును; పద్మలోచన = విష్ణుని {పద్మలోచనుడు - పద్మముల వంటి లోచనములు కలవాడు, విష్ణువు}; చరణ = పాదములు అను; అరవింద = పద్మముల; యుగ = జంట తో; సంగము = సంబంధము; కల్గిన = కలిగిన; సత్ = మంచి; జనుండు = వాడు; పొందిన = పొందిన; ఫలము = ఫలితమును; ఒందున్ = పొందును; భాగవత = భాగవతము అను; దివ్య = దివ్యమైన; కథా = కథను; శ్రవణ = వినుట యందు; అనురక్తిన్ = కూరిమి; చేన్ = వలన.

భావము:

ఇలా పలుకుతున్న విదురునితో దయాహృదయు డైన మైత్రేయ మహాముని ఇలా అన్నాడు “నాయనా! వేదశాస్త్రం చదువుకునే మానవులూ, శ్రీహరి పాదాలు అనే కమలాల మీద అనురాగం గల సజ్జనులూ ఏ ఫలాన్ని పొందుతారో భగవద్భక్తుల దివ్యమైన కథలను ఆసక్తితో వినడంవల్ల అటువంటి ఫలమే లభిస్తుంది.”