పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : స్వాయంభువు జన్మంబు

  •  
  •  
  •  

3-391-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని చరిత్రం బవ్యా
సుఖదము నిఖిల మంగళావహము సమం
చిముం గావున బుధసే
వి! నా కెఱుఁగంగఁ బలుకవే మునితిలకా!

టీకా:

అతని = అతని యొక్క; చరిత్రంబు = చరిత్ర; అవ్యాహత = అడ్డగింపబడనిది, విఘ్నము లేనిది; సుఖదము = సుఖమును ఇచ్చునది; నిఖిల = సమస్తమైన; మంగళ = శుభములను; ఆవహము = రానిచ్చునది; సమ = మిక్కిలి; అంచితమున్ = పూజనీయమైనది; కావున = కనుక; బుధ = జ్ఞానుల చేత; సేవిత = సేవింపబడువాడ; నాకున్ = నాకు; ఎఱుగంగన్ = తెలియునట్లు; పలుకవే = చెప్పుము; ముని = మునులలో; తిలకా = శ్రేష్ఠుడా {తిలక - తిలకము ఏలా శ్రేష్ఠమైనదో అట్లు శ్రేష్ఠమైన వాడు}.

భావము:

పండితులచే సేవించబడు ఓ మునులలో అగ్రగణ్యుడా! ఆ స్వాయంభువుని చరిత్ర అఖండమైన ఆనందాన్ని అందించేది. సమస్త సౌభాగ్యాలనూ సమకూర్చేది. మిక్కిలి యోగ్యమైనది. అందువల్ల ఆయన వృత్తాంతం దయచేసి నాకు తెలియజెప్పు.