పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సృష్టి భేదనంబు

  •  
  •  
  •  

3-378.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పంచశరబాణనిర్భిన్నభావుఁ డగుచుఁ
గూఁతు రని పాపమునకు సంకోచపడక
వయఁ గోరిన జనకునిఁ ని మరీచి
మొదలుగాఁ గల యమ్మునిముఖ్యు లెఱిఁగి.

టీకా:

భ్రూయుగళంబునన్ = కనుబొమలజంట వలన; క్రోధంబున్ = క్రోధమును; అధరంబునన్ = పెదవి; అందున్ = అందు; లోభంబున్ = లోభము, పిసినారితనము; ఆస్యమున = నోటినుండి; వాణియును = సరస్వతియును; మేఢ్రంబు = పురుషావయవము; అందున్ = లో; పయోధులు = సముద్రములు; అపానంబునన్ = గుదము; అందున్ = అందు; అఘ = పాపములకు; ఆశ్రయుడు = ఆశ్రయమైన వాడు; ఐన = అయినట్టి; నిరృతి = నిరృతియును {నిరృతి - అష్టదిక్పాలకులలో ఒకడు, నైరృతి మూల (దక్షిణపశ్చిమ)ను ఏలెడి దిక్పాలకుడు}; లాలితఛాయ = క్రీనీడ; వలనన్ = వలన; దేవహూతి = దేవహూతి యొక్క; విభుండు = భర్త; కర్దముడున్ = కర్దముడును; పుట్టిరి = జన్మించిరి; అంతన్ = అంతట; అబ్జజుడు = బ్రహ్మదేవుడు {అబ్జజుడు - అబ్జము (పద్మము) న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; ఆత్మ = తన; దేహమునన్ = శరీరమువ; జనించిన = పుట్టిన; భారతిన్ = సరస్వతిని; చూచి = చూసి; విభ్రాంతి = విమోహము; పొరసి = పొంది; పంచశర = మన్మథుని {పంచశరుడు - అయిదు (పుష్ప) బాణములు కలవాడు, మన్మథుడు}; బాణ = బాణములకు; నిర్భిన్న = చెదరిన; భావుండు = మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; కూతురు = పుత్రిక; అని = అని; పాపమున = పాపమున; కున్ = కు; సంకోచపడక = సంకోచించక; కవయన్ = కలవవలెనని; కోరినన్ = అనుకొనుచున్న; జనకుని = తండ్రిని; కని = చూసి; మరీచి = మరీచి; మొదలుగాగల = మొదలగు; ఆ = ఆ; ముని = మునులలో; ముఖ్యులు = శ్రేష్ఠులు; ఎఱిగి = తెలిసికొని.

భావము:

బ్రహ్మదేవుని కనుబొమ్మలనుండి “క్రోధం” , పెదవులనుండి, “లోభం” పుట్టింది; ముఖమునుండి “సరస్వతి”; పురుషాంగం నుండి “సముద్రాలు”; మలద్వారం నుండి పాపాశ్రయుడైన “నిరృతి”, నీడనుండి దేవహుతి భర్త యగు “కర్దముడు” జన్మించారు. అంత బ్రహ్మదేవుడు తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి ఆమె సౌందర్యానికి మోహపరవశుడు అయ్యాడు. మన్మథుని పుష్పబాణాలు ఆయన హృదయాన్ని భేదించాయి. కన్నకూతురు అనే సంకోచం లేకుండా పాపానికి వెనుకాడక వ్యామోహంతో ఆమె వెంటపడ్డాడు. తమ తండ్రి దుశ్చర్యను మరీచి మొదలుగాగల మునివర్యులకు తెలిసింది.