పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సృష్టి భేదనంబు

  •  
  •  
  •  

3-376-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము, భగవద్బలాన్విత వినుత గుణులు
భువన సంతానహేతు విస్ఫురణ కరులు
ద్మసంభవ తుల్య ప్రభావ యుతులు
దురు గొడుకులు పుట్టిరి వ్యయశులు.

టీకా:

వినుము = వినుము; భగవత్ = భగవంతుని; బల = శక్తితో; ఆన్విత = కూడి; వినుత = స్తుతింపబడు; గుణులు = గుణములు కలవారు; భువన = ప్రపంచమును, సృష్టిని; సంతాన = విస్తరించుటకు; హేతు = కారణములను; విస్ఫురణ = ప్రకాశము; కరులు = చేయువారు; పద్మసంభవ = బ్రహ్మదేవునితో {పద్మసంభవుడు - పద్మమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; తుల్య = సమానముగా; ప్రభావ = ప్రభావము; యుతులు = కలవారు; పదురు = పదిమంది (10) {బ్రహ్మదేవుని పదుగురు కొడుకులు - 1 అంగుష్టమున, దక్షుడు 2 ఊరువుల, నారదుడు 3 నాభిన, పులహుడు 4 కర్ణముల, పులస్త్యుడు 5 త్వక్కున, భృగువు 6 హస్తమున, క్రతువు 7 నాస్యంబున, అంగిరసుడు 8 ప్రాణమున, వసిష్టుడు 9 మనమున, మరీచుడు 10 కన్నుల అత్రి -- పుట్టిరి}; కొడుకులన్ = పుత్రులు; పుట్టిరి = పుట్టిరి; భవ్య = శుభకరమైన; యశులు = కీర్తికలవారు.

భావము:

భగవంతుని అనుగ్రహ బలంతో కూడిన సద్గుణాలు కలవారు, జీవుల అభివృద్ధికి కారణభూతులు, బ్రహ్మతో సమానమైన ప్రభావం కలవారు, విశాలమైన యశస్సు కలవారు, అయిన పదిమంది కొడుకులు బ్రహ్మదేవుడుకు జనించారు.