పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సృష్టి భేదనంబు

  •  
  •  
  •  

3-373-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వంతుం బురుషోత్తమున్ హరిఁ గృపాపాథోధి లక్ష్మీశ్వరున్
సుగుణభ్రాజితు నచ్యుతుం బరుఁ బరంజ్యోతిం బ్రభున్ సర్వభూ
ణావాసు నధోక్షజున్ శ్రితజనత్రాణైకపారీణు నా
దాత్ముం గనుచుందు రార్యులు తపశ్శక్తిన్ స్ఫుటజ్ఞానులై."

టీకా:

భగవంతున్ = విష్ణుమూర్తిని {భగవంతుడు - పూజనీయుడు, విష్ణువు}; పురుషోత్తమున్ = విష్ణుమూర్తిని {పురుషోత్తముడు - పురుషు (కర్త, చేయువాడు) లలో ఉత్తముడు, విష్ణువు}; హరిన్ = విష్ణుమూర్తిని {హరి - దుఃఖములను హరించు వాడు, విష్ణువు}; కృపాపాథోధిన్ = విష్ణుమూర్తిని {కృపాపాథోధి - దయకు పాధోథి (సముద్రము) వంటి వాడు, విష్ణువు}; లక్ష్మీశ్వరున్ = విష్ణుమూర్తిని {లక్ష్మీశ్వరుడు - లక్ష్మీపతి, విష్ణువు}; సుగుణభ్రాజితున్ = విష్ణుమూర్తిని {సుగుణభ్రాజితుడు - సద్గుణములతో విలసిల్లు వాడు}; అచ్యుతున్ = విష్ణుమూర్తిని {అచ్యుతుడు - పతనము లేనివాడు, విష్ణువు}; పరున్ = విష్ణుమూర్తిని {పరుడు - సమస్తమునకు పరమై (పైన) ఉండు వాడు, విష్ణువు}; పరంజ్యోతిన్ = విష్ణుమూర్తిని {పరంజ్యోతి - అత్యుత్తమ ప్రకాశకము, విష్ణువు}; ప్రభున్ = విష్ణుమూర్తిని {ప్రభువు - ఏలిక, సమర్థుడు, విష్ణువు}; సర్వభూతగణావాసున్ = విష్ణుమూర్తిని {సర్వభూతగణావాసుడు - సమస్తమైన జీవరాశి యందును ఆత్మరూపమున ఉండువాడు, విష్ణువు}; అధోక్షజున్ = విష్ణుమూర్తిని {అధోక్షజుడు - ఇంద్రియములపై అధికారము కలవాడు, సమస్తమును తనకు దిగువుననే ఉండుటచే క్రిందికి మాత్రమే చూచువాడు, విష్ణువు}; శ్రితజనత్రాణైకపారీణున్ = విష్ణుమూర్తిని {శ్రితజనత్రాణైకపారీణుడు – ఆశ్రయించిన జనుల త్రాణము (రక్షించుట) అను మిక్కిలి నేర్పు కలవాడు, విష్ణువు}; ఆ = ఆ; జగదాత్మున్ = విష్ణుమూర్తిని {జగదాత్ముడు - జగత్తు (విశ్వము) తన స్వరూపము ఐనవాడు, విష్ణువు}; కనుచున్ = చూస్తూ; ఉందురు = ఉంటారు; ఆర్యులు = సత్ప్రవర్తన కలవారు; తపస్ = తపస్సువలన కలిగిన; శక్తిన్ = శక్తితో; స్ఫుట = స్పష్టమైన; ఙ్ఞానులు = ఙ్ఞానము కలవారు; ఐ = అయి.

భావము:

శ్రీమన్నారాయణుడు భగవంతుడు, పురుషోత్తముడు కరుణాసముద్రుడు, లక్ష్మీవల్లభుడు, సద్గుణసంపన్నుడు, అచ్యుతుడు, పరమాత్ముడు, పరంజ్యోతి, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, అధోక్షజుడు, జగన్నాధుడు, ఆర్త జన రక్షా పరాయణుడు; అయనను సుఙ్ఞానులు తమ తపశ్శక్తివల్ల దర్శించగలుగుతారు. మీరు కూడా తపస్సు చేసి ఆయనను దర్శించండి” అన్నాడు బ్రహ్మదేవుడు.