పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సృష్టి భేదనంబు

  •  
  •  
  •  

3-371-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుద్రునిచేత నీగతి నిరూఢమతిన్ సృజియింపఁ బడ్డ యా
రుద్రగణంబు లోలి నవరుద్ధత విశ్వము మ్రింగె నమ్మహో
ద్రవశాంతి కై యజుఁడు ర్గులఁ జూచి "కుమారులార! మీ
రౌద్ర విలోక నానల భరంబునఁ గ్రాఁగె సమస్త లోకముల్.

టీకా:

రుద్రుని = అగ్నిదేవుని; చేతన్ = చేత; ఈ = ఈ; గతిన్ = విధముగ; నిరూఢ = నిశ్చయించుకొనిన; మతిన్ = మనసుతో; సృజియింపబడ్డ = సృష్టింపబడిన; ఆ = ఆ; రుద్రగణంబులు = రుద్రగణములు {రుద్రగణములు - రౌద్రస్వభావము కల సమూహములు}; ఓలిన్ = క్రమముగా; అవరుద్ధతన్ = అడ్డము కలుగుట వలన; విశ్వమున్ = విశ్వమును; మ్రింగెన్ = మింగెను; ఆ = ఆ; మహా = గొప్ప; ఉపద్రవ = ఆపద; శాంతి = శాంతింపజేయుట; కై = కొరకు; అజుడు = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మములేని వాడు, బ్రహ్మదేవుడు}; భర్గులను = వేగునట్లు చేయుచున్న వారిని; చూచి = చూసి; కుమారులార = పిల్లలూ; మీ = మీ యొక్క; రౌద్ర = రౌద్రమైన {రౌద్రము - భయంకరమైన కోపము వంటి నవరసములలోని ఒక రసము}; విలోకన్ = తీక్షణమైన చూపుల నుండి పుట్టిన; అనల = మంటల; భరంబునన్ = బాధతో; క్రాగెన్ = కాగిపోయినవి; సమస్త = సమస్తమైన; లోకముల్ = లోకములును.

భావము:

రుద్రుడు ఈ విధంగా రుద్రుడు సృష్టించిన రుద్రగణాలు ఈ విశ్వాన్నంతా అనాయాసంగా, అమాంతం మ్రింగేశాయి. ఆ మహా ప్రమాదాన్ని శాంతింపచేయటానికై బ్రహ్మదేవుడు వారిని చేరపిలిచి “కుమారులారా! చూసారా! మీ చూపుల అగ్నిజ్వాలలలో సమస్తలోకాలూ మండిపోయాయి.