పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సృష్టి భేదనంబు

  •  
  •  
  •  

3-368-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నం బందిన నీలలోహితుఁడు గంజాతాసనుం జూచి యి
ట్లను నో దేవ! మదాఖ్య లెట్టివి మదీ యావాసముల్ వీఁక నా
యంబున్నెఱిఁగింపవే యనుడు నయ్యంభోజగర్భుండు లా
ముం దోఁపఁ గుమార! నీ జననవేళన్ రోదనం బిచ్చుటన్.

టీకా:

జననంబున్ = పుట్టుక; అందినన్ = పొందగా; నీలలోహితుడు = శివుడు {నీలలోహితుడు - నీలము ఎరుపు రంగులు కలసి ఉన్నవాడు, శివుడు, రుద్రుడు}; కంజాసనున్ = బ్రహ్మదేవుని {కంజాసనుడు - కంజము (పద్మము) ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు}; ఇట్లు = ఈవిధముగా; అనున్ = అనెను; ఓ = ఓ; దేవా = బ్రహ్మదేవుడా; మత్ = నా యొక్క; ఆఖ్యాతలు = బోధనలు; ఎట్టివి = ఎలాంటివి; మదీయ = నా యొక్క; ఆవాసముల్ = నివాసములు; వీకన్ = ఔదార్యముతో; నాకున్ = నాకు; అనయంబున్ = తప్పక; ఎఱిగింపవే = తెలుపుము; అనుడున్ = అనగా; ఆ = ఆ; అంభోజగర్భుండు = బ్రహ్మదేవుడు {అంభోజగర్భుడు - అంభోజము (పద్మము) న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; లాలనమున్ = బుజ్జగింపు; తోపన్ = ధోరణితో; కుమార = పుత్రుడా; నీ = నీ యొక్క; జననము = పుట్టిన; వేళన్ = సమయములో; రోదనంబున్ = ఏడ్చుటను; ఇచ్చుటన్ = చేయుటచేత.

భావము:

ఆవిధంగా జన్మించిన నీలలోహితుడు బ్రహ్మదేవుని “ఓ దేవా! నేను ఎవరిని? నా పేరు ఏమిటి? నా నివాస స్థలం ఏమిటి?” అంటూ ప్రశ్నించాడు. అప్పుడు పద్మం లో పుట్టిన ఆ చతుర్ముఖుడు అతనిని లాలిస్తూ ఇలా అన్నాడు “పుత్రా! నువ్వు పుట్టగానే గట్టిగా ఏడ్చావు కదా!