పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చతుర్యుగ పరిమాణంబు

  •  
  •  
  •  

3-363-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు షోడశవికారయుక్తంబై పృథివ్యాది పంచభూత పరివృతం బయి దశావరణంబులుగలిగి పంచశత్కోటి విస్తీర్ణంబై బ్రహ్మాండకోశంబు దనర్చుచుండు.

టీకా:

మఱియున్ = ఇంకనూ; షోడశ = పదహారు (16) {షోడశవికారములు = ఏకాదశేంద్రియములు 11 [పంచ జ్ఞానేంద్రియములు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము), పంచ కర్మేంద్రియములు (కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము), బుద్ధి] మరియు పంచ భూతములు 5 (భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము) }; వికార = మార్పుల; యుక్తంబున్ = కూడినది; ఐ = అయి; పృథివి = పృథివి; ఆది = మొదలగు; పంచభూత = పంచభూతముల {పంచభూతములు - 1 పృథివి 2 వాయువు 3 అప్పు 4 తేజస్సు 5 ఆకాశము}; పరివృతంబు = ఆవరించినది; అయి = అయి; దశ = పది {దశావరణలు - 1 పృథివి 2 వాయువు 3 అప్పు 4 తేజస్సు 5 ఆకాశము 6 అహంకారము 7 మనోమయ 8 జ్ఞానమయ 9 మహత్త్వము 10 ప్రకృతి}; ఆవరణంబులు = ఆవరణలు; కలిగి = కలిగి; పంచశతకోటి = అయిదువందలకోట్ల (500 కోట్లు); విస్తీరణంబున్ = విస్తీర్ణము కలది; ఐ = అయి; బ్రహ్మాండ = బ్రహ్మాండముల; కోశంబున్ = కోశాగారము; తనర్చుచున్ = విలసిల్లుతూ; ఉండున్ = ఉండును.

భావము:

ఏకాదశేంద్రియములు 11 [పంచ జ్ఞానేంద్రియములు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము), పంచ కర్మేంద్రియములు (కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము), బుద్ధి] మరియు పంచ భూతములు 5 (భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము) అనే పదహారు వికారములతో కూడి; పృథ్వి జలం వాయువు తేజస్సు ఆకాశం అనే పంచభూతాలతో అవరించబడి; 1 పృథివి 2 వాయువు 3 అప్పు 4 తేజస్సు 5 ఆకాశము 6 అహంకారము 7 మనోమయము 8 జ్ఞానమయము 9 మహత్త్వము 10 ప్రకృతి అనే పది విధాలైన ఆవరణలు కలిగి; అయిదు వందల కోట్ల యోజనాల విస్తీర్ణం కలది అయి బ్రహ్మాండకోశం విరాజిల్లుతుంది.