పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చతుర్యుగ పరిమాణంబు

  •  
  •  
  •  

3-362.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మందిరార్థాది కర్మాభిమానశీలు
రైనవారికి నాశ్రయం గుటఁజేసి
రయ హరి తద్గుణవ్యతిరుఁడు గాన
కాల మమ్మేటి కెన్నఁడు ర్తగాదు.

టీకా:

దీపింపన్ = ప్రకాశిస్తున్నట్టి; కాల = కాలము యొక్క; స్వరూపుడు = స్వరూపము కలవాడు; ఐనట్టి = అయినట్టి; పద్మాక్షుడు = విష్ణుమూర్తి {పద్మాక్షుడు - పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; అనంతుడు = విష్ణుమూర్తి {అనంతుడు - అనంతమే స్వరూపమైన వాడు, విష్ణువు}; అనాదిపురుషుడు = విష్ణుమూర్తి {అనాదిపురుషుడు - అనాది (అత్యంతఆది) నుండి ఉన్న పురుషుడు, విష్ణువు}; అఖిలవిశ్వాత్మకుడు = విష్ణుమూర్తి {అఖిలవిశ్వాత్మకుడు - సమస్తమైన భువనములకు ఆత్మయైనవాడు, విష్ణువు}; అగున్ = అయిన; ఈశున్ = విష్ణుమూర్తి {ఈశుడు - ప్రభుత్వము కలవాడు, విష్ణువు}; కున్ = కి; పరమాణువు = పరమాణువు; ఆది = మొదలగు; యుగ = యుగములు; పరార్దమున్ = పరార్దములు; అగుచున్ = అవుతూ; జరుగు = జరిగే; ఈ = ఈ; కాలంబున్ = కాలమును; చర్చింపన్ = ఆలోచిస్తే; ఒక్క = ఒక; నిమేష = నిమేషము; కాలంబున్ = కాలము; అయి = అయ్యి; మెలగుచున్ = తిరుగుతూ; ఉండున్ = ఉండును; కాని = కాని; ఈశ్వరున్ = విష్ణుని; కున్ = కి; కర్త = కర్త; కాజాలదు = కాలేదు; ఈ = ఈ; కాలంబున్ = కాలము; వినుము = వినుము; అదిగాక = అంతేకాక; దేహ = దేహము; మందిర = గృహములు; అర్థ = ధనము; ఆది = మొదలగు;
కర్మ = కర్మము లందు; అభిమానశీలురు = అభిమాన స్వభావము కలవారు; ఐన = అయిన; వారికిన్ = వారికి; ఆశ్రయంబు = ఆశ్రయము; అగుటన్ = అగుట; చేసి = వలన; అరయన్ = తెలిసికొనిన; హరి = విష్ణువు; తత్ = ఆ; గుణ = గుణములకు; వ్యతికరుడు = వ్యతిరేకత కలవాడు; కాన = కనుక; కాలము = కాలము; ఆ = ఆ; మేటికిన్ = గొప్పవానికి; ఎన్నడున్ = ఎప్పడును; కర్త = కర్త; కాదు = కాదు.

భావము:

కాలస్వరూపుడు అయి ప్రకాశించేవాడూ, కమలాల వంటి కన్నులు గలవాడు, ఆద్యంతాలు లేని మహాపురుషుడు, పురాణపురుషుడు, అఖిల లోకాలకూ ఆత్మ అయినవాడు అయిన పరమేశ్వరునకు, పరమాణువు మొదలుకుని పరార్ధం పర్యంతం గల కాలం ఒక్క నిమేషంతో సమానం అవుతుంది. కనుకనే భగవంతుడే కాలానికి కర్త; కాని కాలం భగవంతునికి కర్త కాదు. అంతేకాక దేహాలూ, గృహాలూ, సంపదలూ, మొదలైన వాటియందు అభిమానం కలవారికి ఆశ్రయమైనది కాలం. భగవంతుడు ఆ గుణాలకు అతీతుడు. అందుకే ఆయన కర్త యై కాలాన్ని నడిపించుతాడు. కానీ ఆయన్ని కాలం నడిపించదు.