పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చతుర్యుగ పరిమాణంబు

  •  
  •  
  •  

3-360-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను మెన్నఁడు పంకజనా
భుని నాభీసరసి యందు భువనాశ్రయ మై
రిన పద్మము వొడవడు
ఘా యది పద్మకల్ప న విలసిల్లున్.

టీకా:

వినుము = వినుము; ఎన్నడున్ = ఎన్నడైతే; పంకజనాభుని = విష్ణుని {పంకజనాభుడు - పంకజము (పద్మము) నాభిన కలవాడు, విష్ణువు}; నాభీ = నాభి అను; సరసిన్ = సరస్సున; అందున్ = లో; భువన = సకల లోకములకు; ఆశ్రయము = ఆశ్రయుంచుటకు స్థానము; ఐ = అయి; తనరినన్ = విలసిల్లిన; పద్మము = పద్మము; పొడవడున్ = పుట్టుతుందో అప్పుడు; అనఘా = పుణ్యుడా; అది = అది; పద్మకల్పము = పద్మకల్పము; అనన్ = అనగా; విలసిల్లున్ = విలసిల్లును.

భావము:

విదురుడా! వినవయ్యా! లోకాలు అన్నింటికీ ఆశ్రయమై ఉండే పద్మం, పద్మనాభుడు నారాయణుని నాభి అనే సరస్సునుంచి, ఉద్భవించిన ఆ సమయం పద్మకల్పంగా ప్రసిద్ధికెక్కింది.