పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చతుర్యుగ పరిమాణంబు

  •  
  •  
  •  

3-359-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కైకొని బహువిధ కాలగత్యుపలక్షి-
ము లై యహోరాత్ర తులు జరగ
తవత్సరంబులు నులకుఁ బరమాయు-
వైన రీతిని బంకజాసనునకుఁ
రమాయు వగు శతాబ్దంబు లందుల సగ-
రిగిన నదియ పరార్ధ మండ్రు
గాన పూర్వార్ధంబు డచుటఁ జేసి ద్వి-
తీయపరార్ధంబు దీని పేరు

3-359.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డఁగి పూర్వపరార్ధాది కాల మందు
బ్రహ్మకల్పాఖ్య నెంతయుఁ రఁగు నందు
బ్రహ్మ యుదయించుటం జేసి బ్రహ్మకల్ప
నియు శబ్దాత్మకబ్రహ్మ నియు నెగడె.

టీకా:

కైకొని = పూనుకొని; బహు = అనేక; విధ = విధములైన; కాల = కాలముయొక్క; గతిన్ = గమనమును; ఉపలక్షితములు = ఎదురుచూచునవి; ఐ = అయ్యి; అహోరాత్ర = రాత్రింబవళ్ళ; తతులు = అనేకము; జరగన్ = జరగగా; శత = నూరు (100); వత్సరంబులు = సంవత్సరములు; జనుల = మానవుల; కున్ = కు; పరమాయువు = జీవితకాలము; ఐన = అయిన; రీతిన్ = విధముగను; పంకజాసనున్ = బ్రహ్మదేవుని {పంకజాసనుడు - పంకజము (పద్మము)న ఆసీనుడు (ఉన్నవాడు), బ్రహ్మదేవుడు}; కున్ = కును; పరమాయువు = జీవితకాలము; అగు = అయిన; శత = నూరు (100); అబ్దంబులన్ = (బ్రహ్మ) సంవత్సరములు; అందులన్ = అందులో; సగము = సగము (1/2); అరిగినన్ = జరిగిన; అదియ = అదే; పరార్ధము = పరార్ధము; అండ్రున్ = అందురు; కాన = కావున; పూర్వ = మొదటి; అర్ధము = సగము (1/2); కడచుటన్ = గడచిపోవుట; చేసి = వలన; ద్వితీయపరార్ధంబున్ = ద్వితీయపరార్ధము; దీని = దీని; పేరు = పేరు;
కడగి = విజృంభించి; పూర్వపరార్ధ = పూర్వపరార్ధ ముతో; ఆది = మొదలగు; కాలము = కాలము; అందున్ = అందు; బ్రహ్మకల్ప = బ్రహ్మకల్పము; ఆఖ్యాతన్ = పేరుతో; ఎంతయున్ = ఎంతో; పరగున్ = ప్రసిద్ధమగును; అందున్ = అందులో; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఉదయించుటన్ = పుట్టుట; చేసి = వలన; బ్రహ్మకల్పము = బ్రహ్మకల్పము; అనియున్ = అనియును; శబ్దాత్మకబ్రహ్మము = శబ్దాత్మకబ్రహ్మము; అనియన్ = అనియును; నెగడెన్ = వర్థిల్లెను.

భావము:

ఈవిధంగా అనేక విధాలైన కాలగమనాలతో కూడిన, పగళ్ళు రాత్రులు గడిచిపోతుంటాయి. మానవుల ఆయుఃప్రమాణం వంద సంవత్సరాలు. అలాగే బ్రహ్మదేవుని ఆయుఃప్రమాణం కూడా నూరు బ్రహ్మ సంవత్సరాలే. ఆ నూరు సంవత్సరాల మొదటి సగాన్ని పూర్వపరార్ధం అని; రెండవ సగాన్ని ద్వితీయపరార్ధ మని అంటారు. ఇలాంటి పూర్వపరార్ధం కాలం బ్రహ్మకల్పం అన్నారు. దీనినే శబ్ధబ్రహ్మం అని కూడా అంటారు.