పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చతుర్యుగ పరిమాణంబు

  •  
  •  
  •  

3-355.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలయసమయ సముత్కట విపుల చండ
వాతధూతోర్మిజాల దుర్వార వార్ధి
భువనములు ముంచు నమ్మూడు భువనములను
త్పయోరాశిమీఁదఁ బద్మావిభుండు.

టీకా:

ఆ = ఆ (బ్రహ్మయొక్క); రాత్రి = రాత్రి సమయమునన్; భువన = లోక {భువనత్రయము - ముల్లోకములు, భూర్భువస్సువ ర్లోకములు}; త్రయము = త్రయము, మూడు (3); తమస్ = చీకటిలో; పిహితము = కప్పబడినవి; ఐ = అయ్యి; భాను = సూర్యుడు; చంద్రులన్ = చంద్రుడుల; తోన్ = తో; విలీనము = కలిసిపోయినవి; ఐన = కాగా; సర్వాత్ముడు = సర్వాత్మకుడు {సర్వాత్ముడు - సర్వమునందును ఆత్మరూపమున ఉంచువాడు, సర్వాత్మకుడు}; అగు = అయిన; హరి = విష్ణుమూర్తి; శక్తి = శక్తి; రూపంబు = రూపము; అయి = అయ్యి; కడగి = విజృంభించి; వెలుంగు = ప్రకాశించు; సంకర్షణ = సంకర్షణ అను ప్రళయకాల; అగ్నిన్ = అగ్నిలో; భువనత్రయంబున్ = ముల్లోకములును; తవిలి = (మంటలు) అంటుకొని; దహింపన్ = కాలిపోగా; ఆ = ఆ; అనల = అగ్ని; కీలలన్ = మంటల వలన; పొడమినన్ = పొడచూపిన; మహా = గొప్ప; ఊష్మము = వేడిమి; అలమినన్ = వ్యాపించగా; కమిలి = కమిలిపోయి; మహర్లోక = మహర్లోకమున; వాసులు = వసించువారు; జనలోకమున్ = జనలోకమున; కున్ = కు; చనుదురు = వెళ్ళిపోతారు; అపుడు = అప్పుడు;
విలయ = ప్రళయ; సమయ = కాలమున; సమ = మిక్కిలి; ఉత్కటన్ = చెలరేగిన; విపుల = పెద్ద, విస్తారమైన; చండ = భయంకరమైన; వాత = పెనుగాలులచే; ధూత = ఎగురుతున్న; ఊర్మి = పెను అలల; జాల = సమూహములతో; దుర్వార = వారింపరాని; వార్థిన్ = మహాసముద్రమున; భువనములు = లోకములను; ముంచున్ = ముంచును; ఆ = ఆ; మూడు = మూడు (3); భువనములను = లోకములను; తత్ = ఆ; పయోరాశి = సముద్రము {పయోరాశి - పయస్(నీటి)ని రాశిపోసినది, మహాసముద్రము}; మీద = పైన; పద్మావిభుండు = విష్ణుమూర్తి {పద్మావిభుడు - పద్మ (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు}.

భావము:

ఆ బ్రహ్మదేవుని రాత్రి సమయంలో మూడు లోకాలూ సూర్యచంద్రులతోపాటు కటిక చీకటితో కప్పబడి ఉంటాయి. సర్వాత్ముడైన విష్ణుదేవుని శక్తిరూపమైన సంకర్షణాగ్ని విజృంభిస్తుంది. ఆ అగ్ని జ్వాలలు ముల్లోకాలను దహించివేస్తాయి. తీక్షణమైన ఆ మంటల వేడికి తట్టుకోలేక తపించి మహర్లోక వాసులు జన లోకానికి వెళతారు. అప్పుడు ఆ ప్రళయకాలంలో భయంకరంగా ప్రచండ వాయువులు వీస్తాయి. ఆ వాయువుల వేగానికి ఉత్తుంగతరంగాలతో ఉప్పొంగిన మహాసముద్ర జలాలు మూడు జగాలనూ ముంచి వేస్తాయి. ఆ మహాసముద్ర మధ్యంలో రమాపతి, శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటాడు.