పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చతుర్యుగ పరిమాణంబు

  •  
  •  
  •  

3-353-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి పితృ సుపర్వ తిర్య
ఙ్న రూపములన్ జనించి యమున మన్వం
ముల నిజ సత్త్వంబునఁ
రిపాలించును జగంబుఁ బౌరుష మొప్పన్.

టీకా:

హరి = విష్ణుమూర్తి; పితృ = పితృదేవతలు; సుపర్వ = సురలు; తిర్యక్ = జంతువులు {తిర్యక్ – చలనము కలవి, జంతువులు}; నర = నరుల; రూపములన్ = రూపములలో; జనించి = పుట్టి; నయమునన్ = చక్కగా; మన్వంతరములన్ = మన్వంతరములలో; నిజ = తన; సత్త్వంబునన్ = శక్తితో; పరిపాలించును = పరిపాలించును; జగంబున్ = లోకములను; పౌరుషము = పౌరుషము, మగతనము; ఒప్పన్ = ఒప్పునట్లు.

భావము:

ఈ మన్వంతరాలలో శ్రీహరి పితృ, దేవ, పశు, పక్షి, మానవ రూపాల్లో ఉద్భవించినవాడు అయి ఆత్మ శక్తితో పౌరుష ప్రతాపాలతో విశ్వాన్ని పరిపాలిస్తాడు.