పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చతుర్యుగ పరిమాణంబు

  •  
  •  
  •  

3-352-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూర్భువస్స్వర్లోకములకంటెఁ బొడువునఁ-
డు నొప్పు సత్యలోకంబు నందు
నుండు బ్రహ్మకుఁ జతుర్యుగ సహస్రము లేగ-
దిన మొక్కటి యగు, రాత్రియును నిట్ల
న ధాత నిద్రవో గము లడంగు, మే-
ల్కని చూడ మరల లోములు పుట్టుఁ
ద్దినమ్మునఁ జతుర్దశ మను లగుదు రం-
దొక్కొక్క మనువున కొనర దివ్య

3-352.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యుగము లోలిని డెబ్బదియొక్క మాఱు
నిన మనుకాల మయ్యె, నమ్మనుకులంబు
సులు మునులును సప్తర్షు య భగవ
దంశమునఁ బుట్టి పాలింతు ఖిల జగము.\

టీకా:

భూ = భూలోకము; భువర్ = భవర్లోకము; సువర్ = సువర్లోకము; లోకముల = లోకముల; కంటెన్ = కంటె; పొడువునన్ = పరిమాణములో పెద్దగ; కడున్ = మిక్కిలి; ఒప్పు = ఒప్పియుండు; సత్యలోకంబున్ = సత్యలోకమున; అందున్ = అందు; ఉండున్ = ఉండు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; చతుర్యుగ = నాలుగు యుగములు, మహాయుగములు; సహస్రముల్ = వెయ్యి (1000); ఏగన్ = జరుగగా; దినమున్ = పగలు; ఒక్కటి = ఒకటి; అగున్ = అగును; రాత్రియున్ = రాత్రికూడ; ఇట్ల = ఈవిధముగా; చనన్ = జరుగగా; ధాత = బ్రహ్మదేవుడు {ధాత - ధరించు వాడు, బ్రహ్మదేవుడు}; నిద్రన్ = నిద్రలోకి; పోన్ = వెళ్ళగా; జగములు = భువనములు; అడంగు = అణగును; మేల్కొని = నిద్రలోంచిమేలుకొని లేచి; చూడన్ = చూడగా; మరల = మళ్లీ; లోకములు = లోకములు; పుట్టున్ = పుట్టును; తత్ = అతని; దినమునన్ = పగలుకాలములో; చతుర్దశ = పద్నాలుగు (14); మనులు = మనువులు; అగుదురు = కలుగుదురు; అందున్ = అందులో; ఒక్కొక్క = ఒక్కొక్క; మనువున్ = మనువున; కున్ = కు; ఒనరన్ = చక్కగా; దివ్యయుగముల్ = మహాయుగము; ఓలిన్ = వరుసగా; డెబ్బదియొక్క = డెబ్బైయొక; మాఱున్ = సార్లు; చనినన్ = జరుగగా; మనుకాలము = మన్వంతరము; అయ్యన్ = అయ్యెను; ఆ = ఆ; మను = మనువు యొక్క; కులంబున్ = కులములో; సురలు = దేవతలు; మునులును = మునులూ; సప్తర్షులున్ = సప్తఋషులు; అరయన్ = తరచి చూసి; భగవత్ = భగవంతుని; అంశమునన్ = అంశలో; పుట్టి = పుట్టి; పాలింతురు = పరిపాలింతురు, ఏలెదరు; అఖిల = సమస్తమైన; జగమున్ = లోకమును.

భావము:

భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం కంటె పైన సత్యలోకం అని ఒకటుంది. ఆ సత్యలోకంలో ఉండే బ్రహ్మదేవునికి, కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలు నాలుగు కలిపిన మహాయుగాలు వేయి గడిస్తే, ఒక్క దినం అవుతుంది. రాత్రి కూడా అంతే పరిమాణం కలిగి ఉంటుంది. బ్రహ్మ నిద్రపోతే, లోకాలకు ప్రళయం వస్తుంది. నిద్ర మేల్కొని చూస్తే మళ్లి లోకాలు పుడతాయి. బ్రహ్మదేవుని ఆ ఒక్క దినంలో పద్నాలుగు మంది మనువులు ఉద్భవిస్తారు. అంటే పద్నాలుగు మన్వంతరాలు గడుస్తాయి అన్నమాట. వారిలో ఒక్కొక్క మనువు కాలం (మన్వంతరం) డెబ్బది ఒక్క దివ్యయుగాలు. అట్టి మనువు కాలాన్నే మన్వంతరం అంటారు. మనువులు, దేవతలు, మునులు, సప్తర్షులు, భగవంతుని అంశతో ఆయా మన్వంతరాలలో పుట్టి లోకాలను పాలిస్తారు.