పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : చతుర్యుగ పరిమాణంబు

  •  
  •  
  •  

3-349.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రెండునూఱేఁడులును నిల్చి యుండుఁ జువ్వె,
నఘ! సంధ్యాంశ మధ్యంబు నందు ధర్మ
తిశయించును సంధ్యాంశ మందు ధర్మ
ల్ప మై కానఁబడుచుండు నఘచరిత!

కాలము - కొలత 8వ పట్టిక చూడండి

టీకా:

జన = జనులచే; నుత = స్తుతింపబడువాడ; కృతయుగ = కృతయుగము; సంఖ్య = పరిమితి; నాలుగువేలు = నాలుగువేలు (4000); దివ్యవత్సరములు = దేవతల సంవత్సరములు; తదీయ = దానియొక్క; సంధ్యలు = సంధికాలము; ఎనిమిదినూఱు = ఎనిమిదివందల (800); ఏండ్లు = సంవత్సరములు; విను = వినుము; త్రేత = త్రేతాయుగము; వత్సర = సంవత్సరములు; త్రిసహస్రములు = మూడువేలు (3000); అగున్ = అగును; తదీయ = దానియొక్క; సంధ్యలు = సంధికాలము; ఆఱునూఱు = ఆరొందలు (600); ఏడులు = సంవత్సరములు; అగు = అగును; ద్వాపరము = ద్వాపరయుగము; రెండువేల = రెండువేల (2000); వత్సరములన్ = సంవత్సరములు; వెలయున్ = ప్రకాశించును; సంధ్యలు = సంధికాలము; ఓలిన్ = పరిమాణములో; నన్నూఱు = నాలుగువందల (400); ఏడులున్ = వత్సరములు; ఒగిన్ = క్రమముగా; కలియుగమున్ = కలియుగము; సహస్ర = వెయ్యి (1000); వర్షములు = సంవత్సరములు; సంధ్య = సంధ్యయొక్క; అంశము = భాగము; అరయన్ = చూడగా; రెండునూఱు = రెడొందలు (200); ఏడులునున్ = సంవత్సరములు; నిల్చి = కలిగి; ఉండున్ = ఉండును; చువ్వె = సుమా; అనఘ = పుణ్యుడ; సంధ్య = (2) సంధ్యా; అంశ = భాగముల; మధ్యంబున్ = నడుమ; అందున్ = లో; ధర్మము = (యుగ) ధర్మము; అతిశయించును = అధికమగును; సంధ్య = సంధ్యయొక్క (2 యుగముల మధ్య); అంశము = భాగము; అందున్ = లో; ధర్మము = (యుగ) ధర్మము; అల్పము = తక్కువ; ఐ = అయ్యి; కానంబడుచున్ = కనబడుతూ; ఉండున్ = ఉండును; అనఘచరిత = పుణ్యవర్తన.

భావము:

జనుల అభిమానం అందుకున్నవాడా! పవిత్ర చరితా! విదురా! విను, కృతయుగం నాలుగువేల దివ్యసంవత్సరాలు ప్రమాణం కలది. దాని సంధ్యాకాలం ఎనిమిదివందల ఏళ్ళు. ఒక యుగానికి మరొక యుగానికి మధ్య కాలాన్ని, సంధ్య అంటారు. త్రేతాయుగ ప్రమాణం మూడువేలదివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం ఆరువందల ఏళ్ళు. ద్వాపరయుగ ప్రమాణం రెండువేల దివ్యసంవత్సరాలు. సంధ్యాకాలం నాలుగువందల సంవత్సరాలు. కలియుగ ప్రమాణం వెయ్యి దివ్యసంవత్సరాలు. సంధ్యాకాలం రెండువందల సంవత్సరాలు. ఈ సంధ్యాకాలం మధ్య కాలంలో ధర్మం అధికంగా ఉంటుంది. సంధ్యాంకంలో ధర్మం అల్పమై ఉంటుంది.