పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కాల నిర్ణయంబు

  •  
  •  
  •  

3-348-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూనిన యోగసిద్ధి దగఁ బొందిన నేత్రయుగంబునన్ బహి
ర్జ్ఞాము గల్గి యుండి భువనంబులఁ జూచుచునుండు వారికి
న్మానుగఁ గల్గు కాలగతి నా కెఱిఁగింపు మునీంద్ర!" నావుడు
న్నా యశాలి యవ్విదురు నాదర మొప్పఁగ జూచి యిట్లనున్.

టీకా:

పూనిన = ధరించిన, సాధించిన; యోగ = యోగాభ్యాసము; సిద్ధిన్ = సిద్ధించుటవలన {సిద్ధి - పరిపక్వము}; తగన్ = చక్కగా; పొందిన = పొందిన; నేత్ర = కన్నుల; యుగంబునన్ = జంటతో; బహిః = బాహ్య; జ్ఞానము = జ్ఞానము; కల్గి = కలిగి; ఉండి = ఉండి; భువనంబులన్ = లోకములను; చూచుచున్ = చూస్తూ; ఉండు = ఉండు; వారి = వారి; కిన్ = కి; మానుగన్ = అవశ్యము; కల్గు = కలిగే; కాల = కాలము యొక్క; గతిన్ = గమనములు; నాకున్ = నాకు; ఎఱిగింపు = తెలుపుము; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా; నావుడున్ = అని పలుకగా; ఆ = ఆ; నయశాలి = నీతిమంతుడు; ఆ = ఆ; విదురున్ = విదురుని; ఆదరము = ఆదరము; ఒప్పన్ = ఒప్పునట్లు; చూచి = చూసి; ఇట్లు = ఈవిధముగా; అనున్ = పలికెను.

భావము:

ఋషీశ్వరా! మైత్రేయా! ధృఢమైన యోగసిద్ధి వల్ల ప్రాప్తించిన నేత్రాలతో బాహ్య జ్ఞానం కలిగి, లోకాలను ఆలోకించే వారికి కలిగే, కాలపరిమాణం ఎటువంటిదో నాకు తెలుపుము.” అనగా మహనీయుడైన మైత్రేయుడు విదురుని ఆదరపూర్వకంగా వీక్షించి ఈ విధంగా అన్నాడు.