పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కాల నిర్ణయంబు

  •  
  •  
  •  

3-347-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"న పితృ సుర పరమాయుః
రిమాణము లెఱుఁగ నాకుఁ లికితివి మునీ
శ్వ యెఱిగింపు త్రిలోకో
రిలోక విలోక నైక రులగు వారిన్.

టీకా:

నర = నరులు; పితృ = పితృదేవతలు; సుర = దేవతల; పరమాయుష్ = జీవితకాలము యొక్క; పరిణామంబున్ = పరిమితులు; ఎఱుగన్ = తెలియునట్లు; నాకున్ = నాకు; పలికితివి = చెప్పితివి; ముని = మునులలో; ఈశ్వర = శ్రేష్ఠుడ; ఎఱిగింపు = తెలుపుము; త్రిలోక = ముల్లోకములు {త్రిలోకములు - ముల్లోకములు, 1 భూ 2 భువర్ 3 సువర్ లోకములు}; ఉపరిలోక = పైనున్న లోకములను; విలోకన = చక్కగా చూచు, దర్శించు; ఏకపరులు = మంచి నేర్పురులు; అగు = అయిననట్టి; వారికిన్ = వారికి;

భావము:

“మహర్షీ! మైత్రేయా! మానవులు, పితృదేవతలు, దేవతలు, వీరి పరమాయువుల పరిమాణాలను తెలిపావు. ముల్లోకాలూ, పై లోకాలు దర్శించే వారి విశేషాలు వివరించు.