పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కాల నిర్ణయంబు

  •  
  •  
  •  

3-345.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సూక్ష్మకాలంబు విను మది సూర్యమండ
లంబు ద్వాదశరాశ్యాత్మకం బనంగఁ
లుగు జగమున నొక యేఁడు డచి చనినఁ
గాల మెం తగు నది మహత్కాల మనఘ!

కాలము కొలత వద్ద రెండవ పట్టిక నుండి చూడగలరు.

టీకా:

భువిన్ = సృష్టిలో {భువిఁదనకార్యాంశము - సృష్టికార్యములోని (ఒక) భాగము, కాలము}; తన = తనయొక్క; కార్య = పనిలో; అంశమున = భాగమున; కున్ = కు; అంతమున్ = అంతమును; అన్య = ఇతరమైన; వస్తు = వస్తువుల; యోగంబున్ = కలుపుటలు; ఏవలన = ఏమాత్రమూ; లేక = లేకుండగ; ఘట = కుండ {ఘటపటాదికన్యాయము అను తర్కశాస్త్ర విషయము ప్రకారము - త్రికరణములు (మూడు కారణములు) - 1 ఉపాదానము (ఇతర వస్తువు) 2 సమవాయము (చేసే నేర్పు) 3 నిమిత్త (పనివాడు)}; పట = బట్ట; ఆదిక = మొదలైన; జగత్ = లోకసామాన్య; కార్యంబున్ = పనుల; కున్ = కు; నిజ = వాని; సమవాయకారణత్వమునన్ = సమవాయకారణతత్త్వము వలె {సమవాయకారణము - సృష్టికి మూడు (3) కారణములు అవసరము అవి 1 ఉపాదానకారణము 2 సమవాయకారణము 3 నిమిత్తకారణము}; పరగి = తెలియబడి; జాలన్ = కిటికీ వలని; సూర్య = సూర్య; మరీచి = కిరణము; సంగత = లోనుండు; గగనస్థము = అవకాశముననుండేది, ఖాళీస్థలముననుండేది; అగు = అయిన; త్రస = ధూళి; రేణు = రేణువు లో; షట్అంశము = ఆరవ (1/6) వంతు; అరయన్ = చేసిచూసిన అది; పరమాణువు = పరమాణువు; అయ్యెన్ = అయెను; తత్ = ఆ; పరమాణువు = పరమాణువు; అందున్ = లో; అర్క = సూర్య కిరణము యొక్క; గతి = గమనమునకు; ఎంత = ఎంత; తడవు = కాలమో; తత్ = ఆ; కాలము = కాలము; అగును = అగును; సూక్ష్మకాలంబున్ = సూక్ష్మకాలము; వినుము = వినుము; అది = ఆ; సూర్య = సూర్య; మండలము = బింబము; ద్వాదశ = పన్నెండు (12); ఆత్మకంబున్ = కలిగినది; అనగన్ = అనబడి; కలుగు = ఉండు; జగమున్ = రేణువులు; ఒక = ఒక; ఏడు = ఏడు (7); కడచి = గడిచి; చనిన = పోయిన; కాలము = కాలము; ఎంత = ఏంతో అంత; అగున్ = అగును; అది = అది; మహత్కాలము = మహత్కాలము; అనఘ = వుణ్యుడా.

భావము:

భగవంతుని సృష్టి కార్యానికి అంతు అనేది లేదు. దానికి వేరే వస్తువులతో, సంయోగంకూడా అవసరం లేదు. జగత్తులో కుండలు, బట్టలు, తయారయ్యే తీరు వేరు; సృష్టి నిర్మాణ తీరు వేరు. కుండ ఈ లోకంలో తయారు కావాలంటే, 1. మట్టి (ఉపాదానకారణం), 2. మట్టిని కుండగా రూపొందించటం (సమవాయ కారణం), 3. కుండను చేసేవాడు (నిమిత్త కారణం) అవసరం. అలానే బట్ట నిర్మాణం కూడా 1. ప్రత్తి (ఉపాదానం), దారాలు నేత (సమవాయి), బట్ట నేసే వాడు (నిమిత్తం). లోకంలో, ఏ కార్యానికైనా పై మూడూ అవసరం. భగవంతుని సృష్టిలో భగవంతుడు సమవాయ కారణం అవుతాడు. సూర్యుని కాంతి కిటికీలో నుండి ప్రసరించేటప్పుడు మన కంటికి కనిపించే, చిన్నచిన్న రేణువులలో, ఆరవ భాగానికి పరమాణువు అని పేరు. ఆ పరమాణువుపై ఒక ప్రక్క నుండి మరియొక ప్రక్కకు సూర్యకిరణం పయనించే కాలానికి, సూక్ష్మకాలం అని పేరు. సూక్ష్మకాలాన్ని కేవలం ఊహించుకోవలసిందే. అది మిక్కిలి అత్యల్పమైన కాల పరిమాణం. సూర్యుడు మేషం మొదలైన పన్నెండు రాసులలో పయనించే కాల పరిమాణం పేరు మహత్కాలం. దీనికే, సంవత్సరం అని పేరు. (మహత్కాలానికి సూక్ష్మకాలానికి మధ్య నున్న వివిధ కాల పరిమాణాలు ఇకపై వివరించబడతాయి.)