పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

  •  
  •  
  •  

3-317-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కొని నీ యొనర్చు పనిప్పి మదిం దలపోయు దుఃఖముం
లఁగుము నాదు లీలకుఁ బ్రధానగుణం బగు సృష్టికల్పనం
వడఁ జేయు బుద్ధి హృదయంబునఁ జొన్పి తపస్సమాధి ని
ష్ఠ నతిభక్తులన్ ననుఁ బ్రన్నునిఁ జేయుము చెందు కోరికల్.

టీకా:

తలకొని = శిరసావహించి; నీ = నీవు; ఒనర్చు = చేయు; పని = పనిని; తప్పి = వదలి; మదిన్ = మనసున; తలపోయు = అనుకొనుచున్న; దుఃఖమున్ = దుఃఖమునుండి; తలగుము = తొలగుము; నాదు = నా యొక్క; లీలన్ = లీలల; కున్ = కి; ప్రధాన = ముఖ్యమైన; గుణంబున్ = గుణము; అగు = అయిన; సృష్టిన్ = సృష్టిని; కల్పనంబున్ = చేయుటను; అలవడన్ = జరుగునట్లు; చేయు = చేసే; బుద్ధిన్ = బుద్ధిని; హృదయంబునన్ = హృదయములో; చొన్పి = ప్రవేశింపజేసి; తపస్ = తపస్సు; సమాధి = యోగసమాధి; నిష్ఠలన్ = నిష్ఠలతోను; అతి = మిక్కిలి; భక్తులన్ = భక్తితో (నవవిధ భక్తిమార్గాలలో ఏ భక్తితో అయినా సరే); ననున్ = నన్ను; ప్రసన్నునిన్ = ప్రసన్నమైన వానిగా; చేయుము = చేయుము; చెందున్ = నెరవేరును; కోరికల్ = కోరికలు.

భావము:

“నీవు పూనుకొని చేస్తున్న పని వదలవద్దు. అనవసరంగా మనస్సుకు తెచ్చి పెట్టుకున్న దుఃఖాన్నిమాను. సృష్టి నిర్మాణం నా లీలలలో, ప్రధానమైనది. ఈ సృష్టి నిర్మాణ కార్యం చేయాలనే బుద్ధి హృదయంలో ప్రతిష్ఠించుకొని, సమాధినిష్ఠుడవై భక్తితో తపస్సు చేసి నన్ను ప్రసన్నుని చేసుకో. నీ కోరికలు నెరవేరుతాయి.