పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

  •  
  •  
  •  

3-292-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కనుఁగొని చతురాననుండు.

టీకా:

కనుగొని = దర్శించి; చతురాననుండు = బ్రహ్మదేవుడు {చతురాననుడు - నాలుగు ఆననములు (ముఖములు) కలవాడు, బ్రహ్మదేవుడు}.

భావము:

అలా నాలుగు ముఖములు గల బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని చూసాడు.

3-293-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘ! సర్వేశ్వరు నాద్యంతశూన్యుని-
న్యుని జగదేకమాన్యచరితుఁ
న్నాభిసరసిజోద్భవసరోజంబును-
ప్పుల ననిలుని నంబరమును
మానిత భువననిర్మాణదృష్టినిఁ బొడ-
నెఁ గాని యితరముఁ గానలేక
యాత్మీయకర్మబీజాంకురంబును రజో-
గుణయుక్తుఁ డగుచు నకుంఠితప్ర

3-293.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జాభిసర్గాభిముఖత నవ్యక్తమార్గుఁ
డైన హరి యందుఁ దన హృదయంబుఁ జేర్చి
మ్మహాత్మునిఁ బరము ననంతు నభవు
జు నమేయుని నిట్లని భినుతించె.

టీకా:

అనఘ = పుణ్యుడా; సర్వేశ్వరున్ = విష్ణుని {సర్వేశ్వరుడు - అన్నిటికిని పై అధికారి, విష్ణువు}; ఆద్యంతశూన్యుని = విష్ణుని {ఆద్యంతశూన్యుడు - మొదలుతుది అన్నవి లేనివాడు, విష్ణువు}; ధన్యుని = విష్ణుని {ధన్యుడు - ధన్యమైన (సార్థకమైన) తత్త్వము కలవాడు, విష్ణువు}; జగదేకమాన్యచరితున్ = విష్ణుని {జగదేకమాన్యచరితుడు - భువనము లంతకును గౌరవింప దగినవాడు, విష్ణువు}; తత్ = అతని; నాభి = బొడ్డు అను; సరసిజ = పద్మమున; ఉద్భవ = పుట్టిన; సరోజంబునున్ = పద్మమును; అప్పులన్ = నీటిని; అనిలునిన్ = అగ్నిని; అంబరమున్ = ఆకాశమును; మానిత = మన్నింపదగిన; భువన = లోకమలను; నిర్మాణ = నిర్మించునట్టి; దృష్టిన్ = చూపును; పొడగనెన్ = చూచెను; కాని = కాని; ఇతరము = మరింకేమియును; కానలేక = చూడలేక; ఆత్మీయ = తనయొక్క; కర్మ = పనికి, బాధ్యతకు; బీజ = విత్తనపు; అంకురంబును = మొలకయును; రజోగుణ = రజోగుణముతో; యుక్తుండు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; అకుంఠిత = కుంటుపడని; ప్రజా = ప్రజలను; అభిసర్గ = చక్కగా సృష్టంచవలెనను; అభిముఖతన్ = ప్రయత్నములో, కోరికతో; అవ్యక్త = అంతుపట్టని; మార్గుండు = పద్ధతి కలవాడు; ఐన = అయిన; హరి = విష్ణుని; అందున్ = అందు; తన = తనయొక్క; హృదయంబున్ = హృదయమును; చేర్చి = చేర్చి; ఆ = ఆ; మహాత్మునిన్ = విష్ణుని {మహాత్ముడు - గొప్పవాడు, విష్ణువు}; పరమున్ = విష్ణుని {పరము - సర్వమునకు పరమైనవాడు (బయట ఉండువాడు), విష్ణువు}; అనంతున్ = విష్ణుని {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; అభవున్ = విష్ణుని {అభవుడు - పుట్టుక లేనివాడు, విష్ణువు}; అజున్ = విష్ణుని {అజుడు - జన్మము లేనివాడు, విష్ణువు}; అమేయునిన్ = విష్ణుని {అమేయుడు - మేర లేనివాడు, కొలతలకు అందని వాడు, విష్ణువు}; ఇట్లు = ఈవిధముగ; అని = పలుకుతూ; అభినుతించెన్ = స్తోత్రములు చేసెను.

భావము:

పుణ్యాత్ముడా! విదురా! అలా బ్రహ్మదేవుడు సృష్టి అంతటికి ప్రభువూ, ఆది అంతమూ లేనివాడూ ధన్యుడూ, సకల భువనాలకూ మాన్యుడూ అయిన ఆ మహానుభావుని దర్శించాడు; అంతేకాదు ఆయన బొడ్డునుంచి పుట్టిన కమలాన్ని, జలాన్ని, అగ్నిని ఆకాశాన్ని మహాజగత్తు సృష్టించాలనే దృష్టినీ దర్శించాడు; ఆయనకు ఇంక ఇతరమైనవి ఏవి కనపడ లేదు; తనదైన సృష్టికార్యానికి బీజాంకురం అయిన రజోగుణం అతనిలో జనించింది; అమోఘమైన ప్రజా సృష్టికి సుముఖుడు అయినాడు; అంతుపట్టని వాడూ, అర్థం చేసికొనుటకు వీలు కాని వాడూ అయిన ఆ హరి యందు తన హృదయాన్ని కేంద్రీకరించాడు; అంతట మహాత్ముడూ, పురుషోత్తముడూ, అనంతుడూ, అభవుడూ, అమేయుడూ అయిన, పరాత్పరుణ్ణి బ్రహ్మదేవుడు ఈవిధంగా స్తుతించాడు.

3-294-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"లినాక్ష మాయాగువ్యతికరమునఁ-
జేసి కార్యంబైన సృష్టిరూప
మునఁ బ్రకాశించు నీ రూపవిభవంబు-
రూపింప దేహధారులకు దుర్వి
భావ్యంబుఁదలపోయ గవంతుఁడవునైన-
ద్మాక్ష నీ స్వరూపంబుకంటె
న్యమొక్కటి సత్యమై బోధకంబైన-
ది లేదుగాన నీ తులదివ్య

3-294.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మైన రూపంబు నాకుఁ బ్రత్యక్ష మయ్యె
దియుఁగాక వివేకోదమునఁ జేసి
ద! నీ రూప మజ్ఞాన గురుతమో ని
వారకం బయ్యె నాకు శశ్వత్ప్రదీప!

టీకా:

నలినాక్ష = విష్ణుమూర్తీ {నలినాక్షుడు - పద్మములవంటి కన్నులు ఉన్న వాడు, విష్ణువు}; మాయా = మాయ యొక్క; గుణ = గుణముల; వ్యతికరమునన్ = పరస్పర మేళనము; చేసి = వలని; కార్యంబు = ఫలితము; ఐన = అయిన; సృష్టి = సృష్టి మొత్తము యొక్క; రూపమునన్ = స్వరూపములో; ప్రకాశించు = ప్రకాశించే; నీ = నీయొక్క; ఘన = గొప్ప; రూప = రూపముయొక్క; విభవంబున్ = వైభవమును; రూపింపన్ = ఊహించుటకు; దేహధారుల = శరీరధారుల; కున్ = కు; దుర్విభావ్యంబున్ = చక్కగాభావించుటకు కష్టమైనది; తలపోయ = ఆలోచించి చూస్తే; భగవంతుడవున్ = పూజ్యుడవు; ఐన = అయిన; పద్మాక్ష = విష్ణుమూర్తీ {పద్మాక్షుడు - పద్మములవంటి కన్నులు కలవాడు. విష్ణువు}; నీ = నీయొక్క; స్వరూపంబున్ = స్వరూపము; కంటెన్ = కంటె; అన్యము = వేరైనది; ఒక్కటి = ఒక్కటైనా; సత్యమై = నిజముగ; బోధకము = తెలియునది; ఐనయది = అయినట్టిది; లేదు = లేదు; కాన = కావున; అతుల = సాటిలేనిదియును; దివ్య = దివ్యమైనదియును; ఐన = అయినట్టి; రూపంబున్ = రూపమున; నాకు = నాకు; ప్రత్యక్షము = ప్రత్యక్షము {ప్రత్యక్షము - ప్రతి (ఎదురుగ) అక్షము (కంటికి) ఐ ఉన్నది}; అయ్యెన్ = అయ్యెను; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; వివేక = వివేకమును; ఉదయమునన్ = కలిగించుట; చేసి = వలన; వరద = విష్ణుమూర్తీ {వరదః - వరములను ద (ప్రసాదించు) వాడు, విష్ణువు, విష్ణుసహస్రనామాలు 330వ నామం}; నీ = నీయొక్క; రూపము = స్వరూపము; అజ్ఞాన = అజ్ఞానము అను; గురు = దట్టమైన; తమస్ = చీకటిని; నివారకంబున్ = పోగొట్టునది; అయ్యెన్ = అయ్యెను; నాకున్ = నాకు; శశ్వత్ప్రదీప = విష్ణుమూర్తి {శశ్వత్ప్రదీప - శశ్వత్(శాశ్వతమైన) ప్రదీపుడు (వెలుగును ప్రసాదించువాడు), విష్ణుమూర్తి}.

భావము:

“తామర పూలవంటి కన్నులు గల స్వామీ! నారాయణా! ఈ సృష్టి మాయాగుణంతో సంపర్కంవల్ల ఏర్పడింది. మా వంటి దేహధారులకు ఈ సృష్టి రూపంలో ప్రకాశించే నీ యొక్క ఘనమైన స్వరూపాన్ని నిరూపించటం సాధ్యం కాదు. కమలాక్షా! నీ స్వరూపం కంటె మరొకటి సత్యమైనది, తెలియదగినది లేదు. ఓ వరదా! సాటిలేని నీ మనోహర రూపం నాకు సాక్షాత్కరించింది. నాలో వివేకం వికసించింది. జ్యోతిర్మయా! అటువంటి జ్ఞానం కలగడంచేత నీ రూపం నా అజ్ఞానం అనే పెనుచీకటిని పోగొట్టింది. అందువల్ల నీ రూపమే నా పాలిటికి శాశ్వతమైన జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేది.

3-295-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సత్పురుషానుగ్రహ
ముకై యమితావతార మూలం బగుచుం
రెడి నీ రూపము శో
మగు భవదీయ నాభిద్మమువలనన్.

టీకా:

ఘన = గొప్ప; సత్ = మంచి; పురుష = పురుషులను; అనుగ్రహమునన్ = అనుగ్రహించుట; కై = కొరకు; అమిత = అసంఖ్యాకములైన; అవతార = అవతారములకు; మూలంబున్ = మూలకారణము; అగుచున్ = అవుతూ; తనరెడి = విలసిల్లె; నీ = నీ యొక్క; రూపము = రూపము; శోభనము = శుభములు కలుగజేయునది; అగున్ = అయినది; భవదీయ = నీ యొక్క; నాభి = బొడ్డు అను; పద్మము = పద్మము; వలనన్ = వలన.

భావము:

నీ రూపం గొప్పవారు ఉత్తములు అయిన వారిని అనుగ్రహించటానికై ధరించిన ఎన్నో అవతారాలకు మూలమై వెలుగొందునది, శుభప్రదం అయినది. నీ యొక్క నాభికమలం నుంచి పుట్టిన నేను. . .

3-296-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నం బందిన నాచే
యము మొదలనె గృహీతయ్యె జగత్పా
నీదు సుస్వరూపము
రుచిరంబై స్వయంప్రకాశక మగుటన్.

టీకా:

జననంబున్ = పుట్టుటను; అందిన = పొందిన; నా = నా; చేన్ = చేత; అనయమున్ = నిరంతరము; మొదలనె = ముందుగనే; గృహీతము = గ్రహింపబడినది; అయ్యెన్ = అయ్యెను; జగత్ = లోకములను; పావన = పవిత్రముచేయువాడ; నీదు = నీ యొక్క; సు = మంచి; స్వరూపము = స్వరూపము; ఘన = గొప్ప; రుచిరంబున్ = కాంతివతమైనది; ఐ = అయి; స్వయం = తనంత తాను; ప్రకాశకము = ప్రకాశించునది; అగుటన్ = అవుటచేత.

భావము:

లోకముల కన్నింటికి పావనుడవైన దేవా! నీ నాభికమలం నుంచి పుట్టిన నేను నీ రూపాన్ని చక్కగా తెలుసుకున్నాను. నీ స్వరూపం ఎంతో సుందరమైనది. స్వయం ప్రకాశమైనది.

3-297-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు, జ్ఞానానంద పరిపూర్ణమాత్రంబును, ననావృత ప్రకాశంబును, భేదరహితంబునుఁ, బ్రపంచజనకంబును, ప్రపంచవిలక్షణంబును, భూతేంద్రియాత్మకంబును, నేకంబును నైన రూపంబు నొందియు నెందునుఁ బొడగాన నట్టి నిన్ను నాశ్రయించెద; అదియునుంగాక జగన్మంగళ స్వరూపధరుండవై నీ యుపాసకుల మైన మా మంగళంబుకొఱకు నిరంతర ధ్యానంబుచేత నీ దివ్యరూపంబునం గానంబడితివి; ఇట్టి నీవు నిరయభాక్కు లై నిరీశ్వరవాదంబునంజేసి కుతర్కంబులు ప్రసంగించు భాగ్యరహితులచేత నాదృతుండవు గావు; మఱియుం గొందఱు కృతార్థు లైన మహాత్ములచేత భవదీయ శ్రీచరణారవిందకోశగంధంబు వేదమారుతానీతం బగుటంజేసి తమతమ కర్ణకుహరంబులచేత నాఘ్రాణించుచుందురు వారల హృదయకమలంబుల యందు భక్తిపారతంత్ర్యంబున గృహీత పాదారవిందంబులు గలిగి ప్రకాశింతువు; అదియునుం గాక ప్రాణులకు ద్రవ్యాగార సుహృన్నిమిత్తం బయిన భయంబునుఁ దన్నాశనిమిత్తం బయిన శోకంబును ద్రవ్యాది స్పృహయునుఁ దన్నిమిత్తం బయిన పరిభవంబును, మఱియు నందుఁ దృష్ణయు, నది ప్రయాసంబున లబ్ధం బైన నార్తిమూలం బగు తదీయం బైన వృథాగ్రహంబును, నీ శ్రీపాదారవిందంబు లందు వైముఖ్యం బెంత కాలంబు గలుగు నంతకాలంబు ప్రాప్తంబు లగుం గాని, మానవాత్మనాయకుండ వగు నిన్ను నాశ్ర యించిన భయనివృత్తిహేతు వైన మోక్షంబు గలుగు; మఱియునుం గొందఱు సకలపాపనివర్తకం బయిన త్వదీయ నామస్మరణ కీర్తనంబు లందు విముఖులై కామ్యకర్మ ప్రావీణ్యంబునంజేసి నష్టమతు లై యింద్రియపరతంత్రు లై యమంగళంబు లైన కార్యంబులు సేయుచుందురు; దానంజేసి వాతాది త్రిధాతుమూలం బైన క్షుత్తృడాది దుఃఖంబులచేతను శీతోష్ణ వర్ష వాతాది దుఃఖంబులచేతను నతి దీర్ఘం బైన కామాగ్నిచేతను నవిచ్ఛన్నం బగు క్రోధంబుచేతనుం దప్యమానులగుదురు వారలఁ గనిన నా చిత్తంబు గలంకం బొందు; జీవుండు భవదీయ మాయాపరిభ్రామ్యమాణుం డై యాత్మ వేఱని యెప్పుడు దెలియు నంతకాలంబు నిరర్థకంబై దుస్తరంబైన సంసారసాగరంబుఁ దరియింపఁ జాలకుండు; సన్మునీంద్రు లైనను భవదీయ నామస్మరణంబు మఱచి యితర విషయాసక్తు లైరేని, వారలు దివంబు లందు వృథాప్రయత్ను లై సంచరించుచు రాత్రుల యందు నిద్రాసక్తు లై, స్వప్న గోచరంబు లయిన బహువిధ సంపదలకు నానందించుచు శరీరపరిణామాది పీడలకు దుఃఖించుచుం బ్రతిహతంబు లైన యుద్యోగంబుల భూలోకంబున సంసారులై వర్తింతురు; నిష్కాము లై నిన్ను భజియించు సత్పురుషుల కర్ణమార్గంబులం బ్రవేశించి భవదీయ భక్తియోగ పరిశోధితం బైన హృత్సరోజకర్ణికాపీఠంబున వసియింతువు; అదియునుంగాక.

టీకా:

మఱియు = ఇంకా; జ్ఞాన = జ్ఞానము; ఆనంద = ఆనందములతో; పరిపూర్ణ = పూర్తిగా నిండుట; మాత్రంబునున్ = మాత్రమే అయినది; అనావృత = ఆవృతములు లేని {ఆవృతములు - కప్పివేయునవి}; ప్రకాశంబునున్ = వెలుగు అయినది; భేద = భేదములు అనునవి; రహితంబునున్ = లేనిది; ప్రపంచ = ప్రపంచకములుచే {ప్రపంచకములు - పంచభూతములు పంచతన్మాత్రలు పంచేంద్రియములు మొదలగు పంచకములు}; జనకంబును = సృష్టింపబడినదియును; ప్రపంచ = పంచభూతములు మొదలగు; విలక్షణంబును = విశిష్టలక్షణములు కలదియును; భూత = పంచభూతములు; ఇంద్రియ = పంచేంద్రియములు; ఆత్మకంబును = తానే అయినదియును; ఏకంబును = ఇవన్నీ ఒక్కటే అయినది; ఐన = అయినట్టి; రూపంబున్ = రూపమును; ఒందియు = పొందికూడ; ఎందునున్ = ఎక్కడనూ; పొడన్ = ఆనమాలుకైనా; కానన్ = కనబడని; అట్టి = అటువంటి; నిన్నున్ = నిన్ను; ఆశ్రయించెదన్ = ఆశ్రయించెదను; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; జగత్ = లోకములకు; మంగళ = శుభకరమైన; స్వరూప = స్వరూపమును; ధరుండవు = ధరించినవాడవు; ఐ = అయి; నీ = నీ యొక్క; ఉపాసకులము = సేవించువారము; ఐన = అయిన; మా = మా; మంగళంబు = శుభములు; కొఱకున్ = కోసము; నిరంతర = ఎడతెగని; ధ్యానంబున్ = ధ్యానము; చేత = చేత; నీ = నీ యొక్క; దివ్య = దివ్యమైన; రూపంబునన్ = రూపములో; కానంబడితివి = దర్శనము ఇస్తివి; ఇట్టి = ఇటువంటి; నీవు = నీవు; నిరయ = నరకమును; భాక్కులు = అనుభవించువారు; ఐ = అయి; నిరీశ్వర = ఈశ్వరుడు లేడు అను; వాదంబునన్ = వాదముల; చేసి = వలన; కుతర్కంబులు = విపరీత తర్కములు; ప్రసంగించు = చేయు; భాగ్యరహితులు = దౌర్భాగ్యుల; చేతన్ = చేత; ఆదృతుండవు = తెలియబడువాడవు; కావు = కావు; మఱియున్ = ఇంకనూ; కొందఱు = కొందరు; కృతార్థులు = ధన్యులు; ఐన = అయిన; మహా = గొప్ప; ఆత్ములు = వారి; చేతన్ = చేత; భవదీయ = నీ యొక్క; శ్రీ = శుభకరమైన; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మముల; కోశ = మొగ్గల; గంధంబున్ = సువాసన; వేద = వేదములు అనెడి; మారుత = వాయువులచే; ఆనీతంబు = కొనిరాబడినది; అగుటన్ = అగుట; చేసి = వలన; తమతమ = తమతమ; కర్ణ = చెవుల; కుహరంబుల = గుహల; చేతన్ = ద్వారా; ఆఘ్రాణించుచు = ఆస్వాదిస్తూ; ఉందురు = ఉందురు; వారల = వారి యొక్క; హృదయ = హృదయములు అను; కమలంబులు = కమలములు; అందున్ = అందు; భక్తి = భక్తితో కూడిన; పారతంత్ర్యంబునన్ = అర్పణ కలవారు {పారతంత్రము - పరునిచే (భగవంతునిచే) నడుపబడుట}; గృహీత = గ్రహింపబడిన; పాద = పాదములు అనెడి; అరవిందంబులు = పద్మములు; కలిగి = ఉండి; ప్రకాశింతువు = ప్రకాశింతువు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ప్రాణుల = జీవుల; కున్ = కు; ద్రవ్య = ధనము, సిరి; ఆగార = ఇల్లు, సంపద; సుహృత్ = మిత్రులు; నిమిత్తంబున్ = కారణము; అయిన = అయిన; భయంబున్ = భయమును; తత్ = దాని; నాశ = నశించుట వలన; నిమిత్తంబున్ = కారణముగా; అయిన = కల; శోకంబును = శోకమును; ద్రవ్య = ధనము; ఆది = మొదలగునవి; స్పృహయును = ఉన్న దనుభావమును; తత్ = దాని; నిమిత్తంబున్ = కారణము; అయిన = వలన; పరిభవంబును = అవమానమును; మఱియున్ = మరల; అందున్ = వాని అందు; తృష్ణయును = తీవ్రమైన కోరికయును, లాలసయును; అది = అది; ప్రయాసంబునన్ = ప్రయత్నము వలన; అలబ్ధంబు = దొరకనిది; ఐన = అయిన; ఆర్తి = ఆర్తికి; మూలంబు = కారణము; అగు = అయిన; తదీయంబు = దానికి సంబంధించినది; ఐన = అయిన; వృథా = వ్యర్థమైన; ఆగ్రహంబునున్ = కోపములును; నీ = నీ యొక్క; శ్రీ = శుభకరమైన; పాద = పాదములు అనెడి; అరవిందంబులు = పద్మములు; అందున్ = అందు; వైముఖ్యంబు = అయిష్టము, విముఖత్వము; ఎంత = ఎంత; కాలంబున్ = కాలము; కలుగు = కలుగుతుందో; అంత = అంత; కాలంబున్ = కాలమును; ప్రాప్తంబులు = ప్రాప్తించినవి; అగున్ = అగును; కాని = కాని; మానవ = మానవుల; ఆత్మన్ = ఆత్మలకు; నాయకుండవు = నడపువాడవు; అగు = అయిన; నిన్నున్ = నిన్ను; ఆశ్రయించినన్ = ఆశ్రయించినఎడల; భయ = భయమును; నివృత్తి = పోగొట్టుటకు; హేతువు = కారణము; ఐన = అయిన; మోక్షంబున్ = మోక్షము; కలుగున్ = కలుగును; మఱియునున్ = ఇంకనూ; కొందఱు = కొందరు; సకల = సమస్తమైన; పాప = పాపములను; నివర్తకంబు = పోగొట్టునది; అయిన = అయిన; త్వదీయ = నీయొక్క; నామ = పేరును; స్మరణ = స్మరించుట; కీర్తనంబులు = కీర్తించుటలు; అందున్ = అందు; విముఖులు = అయిష్టులు; ఐ = అయి; కామ్య = కోరికలతో కూడిన; కర్మ = కర్మములందు; ప్రావీణ్యమునన్ = నేర్పు; చేసి = వలన; నష్ట = పోయిన; మతులు = మతికలవారు; ఐ = అయి; ఇంద్రియ = ఇంద్రియములచేత; పరతంత్రులు = నడపపబడువారు; ఐ = అయి; అమంగళంబులు = అశుభకరములు; ఐన = అయిన; కార్యంబులున్ = పనులను; చేయుచున్ = చేస్తూ; ఉందురు = ఉందురు; దానన్ = దాని; చేసి = వలన; వాత = వాతము {వాతాది - త్రిధాతువులు - వాతము పిత్తము శ్లేష్మము}; ఆది = మొదలగు; త్రి = మూడు; ధాతు = ధాతువుల; మూలంబు = కారణమైన; ఐన = అయిన; క్షుత్ = ఆకలి; తృట్ = దప్పిక; ఆది = మొదలగు; దుఃఖంబులు = దుఃఖములు; చేతను = వలనను; శీత = చలి; ఉష్ణ = వేడి; వర్ష = వాన; వాత = గాలి; ఆది = మొదలగు; దుఃఖంబుల = దుఃఖముల; చేతను = చేతను; అతి = మిక్కిలి; దీర్ఘంబు = పెద్దది, పొడుగుది; ఐన = అయిన; కామ = కామము అను; అగ్ని = నిప్పు; చేతను = చేత; అవిచ్ఛన్నంబు = తెంపులేని; అగు = అయిన; క్రోధంబు = కోపము; చేతనున్ = చేతను; తప్యమానులు = తపింపబడువారు; అగుదురు = అగుదురు; వారలన్ = వారిని; కనినన్ = చూసిన; నా = నా; చిత్తంబున్ = మనసు; కలంకన్ = కలవరమును; పొందున్ = పొందును; జీవుండు = జీవుడు; భవదీయ = నీయొక్క; మాయా = మాయచేత; పరిభ్రామ్యమాణుండు = మిక్కిలి తిప్పబడినవాడు; ఐ = అయి; ఆత్మన్ = ఆత్మను; వేఱు = పరమాత్మకంటె వేరు; అని = అని; ఎప్పుడు = ఎప్పటివరకు; తెలియున్ = అనుకుంటాడో; అంత = అంత; కాలంబున్ = కాలము; నిరర్థకంబున్ = ప్రయోజనము లేనిది; ఐ = అయి; దుస్తరంబు = దాటుటకు కష్టము; ఐన = అయిన; సంసార = సంసారము అను; సాగరంబున్ = సముద్రమును; తరియింవన్ = దాటుటకు; చాలక = సామర్థ్యము లేక; ఉండు = ఉండును; సత్ = మంచి; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; ఐనను = అయినను; భవదీయ = నీ యొక్క; నామ = పేరును; స్మరణంబున్ = స్మరించుటను; మరచి = మరచిపోయి; ఇతర = ఇతర; విషయ = విషయములందు; ఆసక్తులు = ఆసక్తికలవారు; ఐరి = అయినవారు; ఏని = అయినట్లైతే; వారలు = వారు; దివంబులు = పగళ్లు; అందున్ = అందు; వృథా = వృథా; ప్రయత్నులు = ప్రయత్నములుచేయువారు; ఐ = అయి; సంచరించుచు = తిరుగుతూ; రాత్రులు = రాత్రులు; అందున్ = అందు; నిద్రా = నిద్రయందు; ఆసక్తులు = ఆసక్తి కలవారు; ఐ = అయి; స్వప్న = కలలయందు; గోచరంబులు = కనిపించునవి; అయిన = అయిన; బహు = అనేక; విధ = రకముల; సంపదల = సంపదల; కున్ = కు; ఆనందించుచు = సంతోషించుచుచు; శరీర = శరీరమునవచ్చు; పరిణామ = పరిణామము; ఆది = మొదలగు; పీడలకు = బాధలకు; దుఃఖించుచున్ = దుఃఖించుతూ; ప్రతిహతంబులు = ఎదురుదెబ్బలు కలిగించునవి; ఐన = అయిన; ఉద్యోగంబులన్ = ప్రయత్నములలో; భూలోకంబులన్ = భూలోకములో; సంసారులు = సంసారములు చేయువారు; ఐ = అయి; వర్తింతురు = తిరుగుదురు; నిష్కాములు = నిష్కాములు {నిష్కాములు - కోరికలు లేకుండుటయే ధర్మముగా కలవారు}; ఐ = అయి; నిన్నున్ = నిన్ను; భజియించు = సేవించు; సత్ = మంచి; పురుషుల = పురుషుల; కర్ణ = చెవుల; మార్గంబులన్ = ద్వారా; ప్రవేశించి = ప్రవేశించి; భవదీయ = నీ యొక్క; భక్తి = భక్తితో కూడిన; యోగ = యోగముచే; పరిశోధితంబున్ = పరిశోధింపబడినది; ఐన = అయిన; హృత్ = హృదయము అను; సరోజ = పద్మము యొక్క; కర్ణికా = బొడ్డు; పీఠంబునన్ = పీఠము నందు; వసింతువు = నివసించెదవు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

జ్ఞానం చేతా ఆనందం చేతా పరిపూర్ణమైనదీ; ఆవరణలు లేని కాంతి కలదీ; తనకు వేరైనది ఏదీ లేనిదీ; ప్రపంచాన్ని సృష్టించేది; ప్రపంచం కంటె భిన్నమైనది; పంచభూతాలకూ; ఇంద్రియాలకూ ఆత్మవంటిది; అనన్యమైనదీ అయిన రూపాన్ని ధరించి కూడా ఎక్కడా ఆనమాలు కూడా దొరకకుండా ఉండే నిన్ను ఆశ్రయిస్తాను. నీవు లోకాలకంతకు శుభాన్ని చేకూర్చే రూపం ధరించిన వాడవు; నిరంతరం నిన్ను ధ్యానించే మాకు శుభాలను కల్గించడానికై ఈ దివ్యమైన రూపంతో కనపడ్డావు; నరకం అనుభవించేవారు అయి ఈశ్వరుడు లేడని వాదిస్తూ కుతర్కాలతో కాలం గడిపే దురదృష్టవంతులు నిన్ను గుర్తించ లేరు; ధన్యజీవులు అయిన కొందరు మహాత్ములు వేదాలనే మలయమారుతాలు తీసుకొని వచ్చిన మీ పాదపద్మాల సుగంధాన్ని వీనులవిందుగా ఆఘ్రాణిస్తారు. వారు భక్తితో పరవశించిన తమ హృదయకమలాలతో నీ పాదపద్మాలను అందుకుంటారు. నీవు ఆ భక్తుల మనస్సులలో ప్రకాశిస్తావు. అంతేకాక ప్రాణులకు ధనం, ఇల్లు అందలి ఆపేక్షవల్ల కలిగే భయం, అవి నాశనం కావడంచేత కలిగే దుఃఖం, దానిమీద ఆశ, దాని సంపాదనలో ఎదురయ్యే అవమానం ఇన్ని శ్రమలు పడి పొందే శోకానికి మూలమైన తృష్ణ. అవన్నీ నీ మంగళకరమైన చరణాబ్జాలను తలంచకుండా ఎంతకాలం ఉంటామో అంతకాలమూ ఉంటాయి. కాని మానవుల ఆత్మలకు అధినాయకుడైన నిన్ను ఆశ్రయిస్తే భయాన్ని పోగొట్టుకోవడానికి కారణమైన మోక్షం కలుగుతుంది. కొందరు అన్ని పాపాలూ పోగట్టగలిగే నీ నామ ధ్యాన సంకీర్తనలకు విముఖులై, మోహ సంబంధ మైన పనుల్లో మతి కోల్పోయి, ఇంద్రియాలకు దాసులై, అశుభాలైన కార్యాలు చేస్తూ ఉంటారు. ఇందువల్ల వాత పిత్త శ్లేష్మాలు అనే త్రిధాతువులకు మూలమైన ఆకలిదప్పుల బాధల చేతా శీతల ఉష్ణ వర్షం వాతం మొదలైన వానివల్ల ప్రాప్తించే దుఃఖం చేతా, అవధిలేని కామాగ్ని చేతా, ఎడతెగని కోపం చేతా తపించి పరితపిస్తారు. అటువంటి వారిని చూచి నా మనస్సు చాలా కలతపడుతుంది. జీవుడు నీ మాయ కల్పించే భ్రమలలో కీలుబొమ్మ అయి దేహం కంటె ఆత్మ వేరని ఎప్పటి వరకు తెలుసుకోలేడో, అంతవరకు సారం లేని సంసారసాగరాన్ని దాటలేడు. శ్రేష్ఠులైన మునీంద్రులు కూడా, నీ నామ స్మరణాన్ని మరచి అన్య విషయాలపై ఆసక్తి కలవారయితే వారు పగలంతా పనికిమాలిన పనులలో పడి తిరుగుతూ, రాత్రిళ్లు నిద్రలో పడి, స్వప్నంలో కనిపించే అనేకమైన సంపదలకు సంతోషపడుతూ శరీరం అందలి రోగాది వికారాలకు విచారపడుతూ, ప్రయత్నాలన్నీ భగ్నంకాగా భూలోకంలో సంసారభంధాలలో చిక్కుకుని తిరుగుతారు. కోరికలు లేకుండా ధర్మమార్గంలొ నిన్ను సేవించే పుణ్యపురుషుల చెవులగుండా నీవు వారిలో ప్రవేశిస్తావు. నీపై భక్తి ప్రపత్తుల వల్ల పరిశుధ్ధమైన వారి హృదయ కమల పీఠం మీద స్థిరంగా ఉంటావు.

3-298-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యోగీంద్రులు యోగమార్గముల భావంబందు నే నీ మనో
రూపంబుఁ దలంచి యే గుణగణధ్యానంబు గావింతు ర
ప్పురుషశ్రేష్ఠ పరిగ్రహంబునకునై పొల్పారఁ దద్ధ్యాన గో
మూర్తిన్ ధరియింతుఁ గాదె పరమోత్సాహుండవై మాధవా!

టీకా:

వర = పూజ్యులైన; యోగ = యోగులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; యోగ = యోగ; మార్గంబులన్ = మార్గములలో; భావంబు = మనసు; అందున్ = లో; ఏ = ఏలాంటి; నీ = నీయొక్క; మనోహర = మనోహరమైన; రూపంబున్ = రూపములను; తలంచి = తలచుకొని; ఏ = ఏలాంటి; గుణ = గుణముల; గణ = సమూహములను; ధ్యానంబున్ = ధ్యానములను; కావింతురు = చేయుదురో; ఆ = ఆ; పురుష = పురుషులలో; శ్రేష్ఠ = శ్రేష్ఠులను; పరిగ్రహంబున్ = అనుగ్రహించుట; కున్ = కును; ఐ = అయి; పొల్పారన్ = చక్కగాఒప్పునట్లు; తత్ = ఆయా; ధ్యాన = ధ్యానములలో; గోచర = కనిపించు; మూర్తిన్ = స్వరూపములలో; ధరియింతు = ధరించెదవు; కాదె = కదా; పరమ = అత్యంత; ఉత్సాహుండవు = ఉత్సాహము కలవాడవు; ఐ = అయి; మాధవా = విష్ణుమూర్తీ {మాధవుడు - మా (లక్ష్మీదేవికి) ధవుడు (ప్రభువు), విష్ణువు}.

భావము:

ఓ మాధవా! విష్ణుమూర్తీ! ఉత్తములైన యోగీంద్రులు తమ యోగ సంప్రదాయాలతో తమ భావనలతో ఏ నీ మనోహర రూపాన్ని భావిస్తారో ఆ రూపం ధరించీ, ఏ నీ గుణగుణాల్ని సంభావిస్తారో అటువంటి గుణగుణాల తోనూ వారిని అనుగ్రహించే నిమిత్తం వారి ధ్యానాలలో ఎంతో సంతోషంతో సాక్షాత్కరిస్తావు.

3-299-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రయ నిష్కామధర్ము లైట్టి భక్తు
లందు నీవు ప్రసన్నుండ వైనరీతి
హృదయముల బద్ధకాములై యెనయు దేవ
ణము లందుఁ బ్రసన్నతఁ లుగ వీవు.

టీకా:

అరయన్ = పరిశీలించి చూడగా; నిష్కామ = కోరికలు లేకుండుట అను; ధర్ములు = స్వభావముగా కలవారు; ఐనట్టి = అయినట్టి; భక్తులు = భక్తులు; అందున్ = అందు; నీవు = నీవు; ప్రసన్నుడవు = ప్రసన్నత కలవాడవు; ఐన = అయిన; రీతిన్ = విధముగ; హృదయంబులు = మనసులలో; బద్ధ = చిక్కుకొన్న; కాములు = కామములు కలవారు; ఐ = అయి; ఎనయు = మెలగు; దేవ = దేవతల; గణములు = సమూహములు; అందున్ = అందు; ప్రసన్నతన్ = ప్రసన్నతను; కలుగవు = కలిగి ఉండవు; ఈవు = నీవు.

భావము:

పరిశీలించి చూస్తే కోరికలు లేకుండా నిన్ను ఆరాధించే భక్తులను నీవు అనుగ్రహించినట్లు అంతులేని కోరికలతో నిండిన హృదయాలు గల దేవతలను కూడా అనుగ్రహించవు.

3-300-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

య సమస్త జీవహృదయంబుల యందు వసించి యేకమై
రఁగి సుహృత్క్రియానుగుణభాసిత ధర్ముఁడవుం బరాపరే
శ్వరుఁడవునై తనర్చుచు నజ్జన దుర్లభమైన యట్టి సు
స్థి మగు సర్వభూతదయచేఁ బొడగానఁగవత్తు వచ్యుతా!

టీకా:

అరయన్ = పరిశీలించిచూడగా; సమస్త = సమస్తమైన; జీవ = జీవుల; హృదయంబుల = హృదయముల; అందున్ = లోను; వసించి = ఉండి; ఏకము = ఒకే విధముగా; ఐ = అయి; పరగి = వ్యాపించి; సు = మంచి; హృత్ = హృదయము కలవారి; క్రియా = పనులకు; అనుగుణ = అనుగుణముగా; భాసిత = ప్రకాశించు; ధర్ముండవు = ధర్మములు కలవాడవు; పరా = పరమునకును {పరము - పరలోకము}; అపర = ఇహమునకు {అపర - పరముకానిది, ఇహము, ఈలోకము}; ఈశ్వరుడవున్ = అధిపతివివి; ఐ = అయి; తనర్చుచున్ = అతిశయించుచూ; అసత్ = మంచివారు కాని; జన = జనములకు; దుర్లభము = లభింపనిది; ఐనట్టి = అయినటువంటి; సుస్థిరము = సుస్థిరము; అగు = అయిన; సర్వ = సమస్తమైన; భూత = జీవరాశు లందును; దయ = దయ; చేన్ = చేత; పొడగానగ = దర్శించుటకు; వత్తువు = వీలగుదవు; అచ్యుతా = విష్ణుమూర్తీ {అచ్యుతుడు – పతనము లేనివాడు, విష్ణువు}.

భావము:

ఓ విష్ణుమూర్తీ! అచ్యుతా! నీవు సకల జీవుల హృదయాలలో అంతర్యామిగా ఉంటావు. అందరిలో అనితరుడవు అయి వెలుగొందుతావు. ఆప్యాయతకు అనుగుణంగా ప్రకాశించే ధర్మస్వరూపుడవు. ఇహపరాలకు నీవే అధీశ్వరుడవు. సజ్జనులకు సులభమూ, అసజ్జనులకు దుర్లభమూ అయిన సర్వ జీవ కారుణ్యం వల్ల మాత్రమే జనులకు దర్శనం ఇస్తావు.

3-301-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రతు దానోగ్రత పస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల
వ్రచర్యాదుల నాదరింప వఖిలవ్యాపారపారాయణ
స్థితి నొప్పారెడి పాదపద్మయుగళీసేవాభి పూజా సమ
ర్పి ధర్ముండగు వాని భంగి నసురారీ! దేవచూడామణీ!\

టీకా:

క్రతు = యజ్ఞములు; దాన = దానములు; ఉగ్ర = తీక్షణమైన; తపస్ = తపస్సు; సమాధి = సమాధి; సత్ = మంచి; కర్మ = కర్మములు; అగ్నిహోత్ర = అగ్నిహోత్రము; అఖిల = సమస్తమైన; వ్రతచర్య = వ్రతములు చేయుట; ఆదులన్ = మొదలగువానిని; ఆదరింపవు = ఆదరింపవు; అఖిల = సమస్తమైన; వ్యాపార = (పై) పనులు; పారాయణ = చేసిన; స్థితిన్ = విధముగ; ఒప్పారెడి = ఒప్పి ఉండే; పాద = (నీ) పాదములు అను; పద్మ = పద్మముల; యుగళీ = జంటను; సేవా = సేవించుటను; అభిపూజా = చక్కటి పూజలను; సమర్పిత = సమర్పించు; ధర్ముండు = స్వభావము కలవారు; అగు = అయిన; వానిన్ = వారిని; భంగిన్ = వలె; అసురారి = విష్ణుమూర్తీ {అసురారి - అసురులు (రాక్షసులు)కి శత్రువు, విష్ణువు}; దేవచూడామణీ = విష్ణుమూర్తీ {దేవచూడామణి - దేవుళ్ళలో శిరోమణి (అత్యుత్తముడు), విష్ణువు}.

భావము:

ఓ రాక్షస సంహారా! దేవతా సార్వభౌమా! శ్రీమహావిష్ణూ! చేసే పనులు అన్నీ నీకే సమర్పించి, నీ యందే మనస్సు లగ్నంచేసి నీ పాదపద్మ ద్వయాన్నే నిరంతరం ఆరాధించే భక్తులను నీవు ఎంతో ఆప్యాయంగా ఆదరించి ఆదుకుంటావు. యజ్ఞాలు, దానాలు, కఠోర తపస్సులూ, జపాలూ, అగ్నిహోత్రాలూ, వ్రతాలూ, మొదలైన సత్కర్మలు ఆచరించేవారిని కూడా ఇంత ప్రేమగా ఆదరించవు.

3-302-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలి శశ్వత్స్వరూప చైన్య భూరి
హిమచేత నపాస్త సస్త భేద
మోహుఁడ వఖిల విజ్ఞానమునకు నాశ్ర
యుండ వగు నీకు మ్రొక్కెదనో రమేశ!

టీకా:

తవిలి = పూనుకొని; శశ్వత్స్వరూప = విష్ణుమూర్తీ {శశ్వత్స్వరూపుడు - శాశ్వతమైన స్వరూపము కలవాడు, విష్ణువు}; చైతన్య = చైతన్యపూరితమైన; భూరి = బహుమిక్కిలి; మహిమ = మహిమ; చేతన్ = చేత; అపాస్త = పోగొట్టబడిన; సమస్త = సమస్తమైన; భేద = భేదములు; మోహుడవు = మోహము కలిగించు వాడవు; అఖిల = సమస్తమైన; విజ్ఞానమున్ = విజ్ఞానమున; కున్ = కును; ఆశ్రయుండవు = ఆశ్రయము ఐనవాడవు; అగు = అయిన; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; ఓ = ఓ; రమేశ = విష్ణుమూర్తీ {రమేశుడు - రమ (లక్ష్మీదేవి)కి భర్త, విష్ణువు}.

భావము:

ఓ లక్ష్మీపతీ! నీ స్వరూపం శాశ్వతమైనది. నీ అందలి చైతన్య మహా ప్రభావంవల్ల సమస్తమైన భేద భావాలనూ వ్యామోహాలనూ రూపుమాపుతావు. అఖండమైన విజ్ఞానానికి ఆశ్రయమైన నీకు నమస్కరిస్తున్నాను.

3-303-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నస్థితివిలయంబుల
యంబును హేతుభూతగు మాయాలీ
ను జెంది నటన సలిపెడు
ఘాత్మక! నీకొనర్తు భివందనముల్

టీకా:

జనన = సృష్టి; స్థితి = స్థితి; విలయంబులన్ = లయములకు; అనయంబునున్ = సతతము; హేతుభూతము = కారణాంశమైనది; అగు = అయిన; మాయా = మాయ వలని; లీలను = లీలను; చెంది = చెందినట్లు; నటన = నటనలు; సలిపెడు = చేసే; అనఘాత్మ = విష్ణుమూర్తీ {అనఘాత్మ - పాపముకానిది అయినవాడ, విష్ణువు}; నీకున్ = నీకు; ఒనర్తున్ = చేయుదును; అభివందనముల్ = మిక్కిలి నమస్కారములు.

భావము:

పుట్టుట, వృద్ధిపొందుట, చనిపోవుట, అనే మూడింటికి మూలకారణమైనది నీ మాయ. అటువంటి మాయా నటనలతో, లీలావిలాసంతో, నిరంతరము క్రీడించే ఓ పవిత్ర స్వరూపా! హరీ! నీకివే నా కైమోడ్పులు.

3-304-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘాత్మ! మఱి భవవతార గుణకర్మ-
న విడంబన హేతుకంబు లయిన
మణీయ మగు దాశథి వసుదేవకు-
మారాది దివ్యనామంబు లోలి
వెలయంగ మనుజులు వివశాత్ములై యవ-
సానకాలంబున సంస్మరించి
న్మజన్మాంతర సంచిత దురితంబుఁ-
బాసి కైవల్యసంప్రాప్తు లగుదు

3-304.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి దివ్యావతారంబు వతరించు
జుఁడ వగు నీకు మ్రొక్కెద నఘచరిత!
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార!
క్తమందార! దుర్భవయవిదూర!

టీకా:

అనఘాత్మ = విష్ణుమూర్తీ {అనఘాత్మ - పాపముకానిది అయినవాడ, విష్ణువు}; మఱి = మరి; భవత్ = నీయొక్క; అవతార = అవతారముల; గుణ = గుణములు; కర్మ = కర్మలకు; ఘన = గొప్ప; విడంబన = అనుకరణంబు; హేతుకంబులు = కారణముగాకలవి; అయిన = అయిన; రమణీయ = మనోహరము; అగు = అయిన; దాశరథి = శ్రీరాముడు {దాశరథి - దశరథుని పుత్రుడు, శ్రీరాముడు}; వసుదేవకుమార = శ్రీకృష్ణుడు {వసుదేవకుమారుడు - వసుదేవుని కుమారుడు, శ్రీకృష్ణుడు}; ఆది = మొదలగు; దివ్య = దివ్యమైన; నామంబులన్ = పేర్లతో; ఓలిన్ = క్రమముగా; వెలయంగా = అవతరించగా; మనుజులు = మానవులు; వివశాత్ములు = పరవశతచెందినవారు; ఐ = అయ్యి; అవసాన = మరణాసన్న; కాలంబునన్ = కాలములో; సంస్మరించి = చక్కగా స్మరించి; జన్మజన్మాతర = జన్మజన్మల; సంచిత = పేరుకొన్న; దురితంబున్ = పాపములను; పాసి = పోగొట్టుకొని; కైవల్య = ముక్తి {కైవల్యము - కేవలము భగవంతుని స్థితి, ముక్తి}; సంప్రాప్తులు = పొందినవారు; అగుదురు = అవుతారు; అట్టి = అటువంటి; దివ్య = దివ్యమైన; అవతారంబులన్ = అవతారములలో; అవతరించు = అవతరించే; అజుడవు = జన్మము లేనివాడు; అగు = అయిన; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = మొక్కెదను; అనఘచరిత = విష్ణుమూర్తీ {అనఘచరితుడు - పాపములుకాని వర్తనములు కలవాడు, విష్ణువు}; చిరశుభాకార = విష్ణుమూర్తీ {చిరశుభాకారుడు - చిరకాలపు శుభమే ఆకారముగ కలవాడ, విష్ణువు}; నిత్యలక్ష్మీవిహార = విష్ణుమూర్తీ {నిత్యలక్ష్మీవిహారుడు - శాశ్వతమైన సంపదలకు విహారమైన వాడు, విష్ణువు}; భక్తమందార = విష్ణుమూర్తీ {భక్తమందారము - భక్తులకు కల్పవృక్షము వంటివాడు, విష్ణువు}; దుర్భవభయవిదూర = విష్ణుమూర్తీ {దుర్భవభయవిదూరడు - భయంకరమైన భవము (సంసారము) వలని భయమును పూర్తిగా దూరము చేయువాడ, విష్ణువు}.

భావము:

శ్రీమన్నారాయాణా! నీవు పరమ పవిత్రుడవు. సచ్చరిత్రుడవు. శాశ్వతమైన దివ్య మంగళ స్వరూపం కల వాడవు. ఎల్లప్పుడూ లక్ష్మీదేవితో కూడి సంచరించే వాడవు, భక్తులకు కల్పవృక్షం వంటి వాడవు. దుర్భరమైన సంసార భయాన్ని దూరం చేసే వాడవు. నీ అవతారాలకు, సద్గుణాలకూ, సత్కార్యాలకూ, మహదాశయాలకూ కారణమైనవి, మనోహరమైనవీ అయిన , దాశరధీ, వాసుదేవ మున్నగు దివ్య నామాలను, మనుష్యులు తమ తుది గడియల్లో స్మరించి, అనేక జన్మములలో కూడబెట్టుకున్న పాపాలను పోగొట్టుకొని మోక్షం పొందుతారు. జన్మ లేని వాడవు అయి కూడా అటువంటి దివ్య అవతారాలతో జన్మించే నీకు మొక్కుతున్నాను.

3-305-త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నవృద్ధివినాశ హేతుక సంగతిం గల యేను నీ
వును హరుండు ద్రిశాఖలై మనువుల్ మరీచిముఖామరుల్
ర నందుపశాఖలై చెలువొంద నింతకు మూలమై
యమున్ భువనద్రుమాకృతివైన నీకిదె మ్రొక్కెదన్.

టీకా:

జనన = పుట్టుటను; వృద్ధి = పెరుగుటను; వినాశక = నశించుటలకును; హేతుక = కారణ మగువానితో; సంగతిన్ = కూడుట; కల = కలిగిన; ఏను = నేను; నీవును = నీవును; హరుండున్ = శివుడును; త్రి = మూడు; శాఖలు = విభాగములు; ఐ = అయి; మనువుల్ = మనువులు (14గురు ఉపశాఖలు) {మనువులు - పద్నాలుగురు, 1 స్వాయంభువుడు 2 స్వారోచిషుడు 3 ఉత్తముడు 4 తామసుడు 5 రైవతుడు 6 చాక్షుసుడు 7 వైవస్వతుడు 8 సూర్యసావర్ణి 9 దక్షసావర్ణి 10 బ్రహ్మసావర్ణి 11 ధర్మసావర్ణి 12 రుద్రసావర్ణి 13 రౌచ్యుడు 14 భౌచ్యుడు ( పాఠాంతరములు కూడ కలవు) ప్రస్తుతము వైవశ్వతమన్వంతరము జరుగుచున్నది}; మరీచి = మరీచి {మరీచ్యాదులు - నవబ్రహ్మలు, 1 మరీచి 2 అత్రి 3 అంగీరసుడు 4 పులస్త్యుడు 5 పులహుడు 6 క్రతువు 7 వసిష్టుడు - ఇంకోవిధముగ - నవబ్రహ్మలు, 1 మరీచి 2 భరద్వాజుడు 3 అత్రి 4 అంగీరసుడు 5 పులస్త్యుడు 6 పులహుడు 7 క్రతువు 8 వసిష్టుడు 9 వామదేవుడు}; ముఖ = మొదలగు (7, 9 గురు ఉపకి ఉప శాఖలు); అమరుల్ = దేవతలు; ఒనరన్ = చక్కగా; అందున్ = అందు; ఉపశాఖలు = చిలువలు పలవలు; ఐ = అయి; చెలువు = చక్కదనము; ఒందన్ = సంతరించుకొనగా; ఇంతకున్ = దీనంతకును; మూలము = మూలము; ఐ = అయి; అనయమున్ = అవశ్యము; భువన = విశ్వము అను; ద్రుమ = వృక్షము; ఆకృతివిన్ = ఆకృతిలోఉన్నవాడవు; ఐన = అయిన; నీకున్ = నీకు; ఇదె = ఇదె; మ్రొక్కెదన్ = నమస్కరించెదను.

భావము:

ఈ విశ్వం ఒక మహావృక్షం; సృష్టి స్థితి లయ కారకుల మైన నేనూ నీవు శివుడు, ముగ్గురం ఈ వృక్షానికి మూడు శాఖలము; మనువులు, మరీచి మొదలైన ప్రజాపతులూ, దేవతలూ దాని ఉపశాఖలు; ఆ విశ్వవృక్షానికి ఆధారమైన కూకటివేరు నీవే. విశాలమైన దాని ఆకారం కూడా నీవే. అట్టి నీకిదే చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

3-306-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురుషాధీశ! భవత్పదాబ్జయుగళీపూజాది కర్మక్రియా
తం జెందని మూఢచిత్తునిఁ బశుప్రాయున్ మనుష్యాధమున్
యున్ నాశము నొందఁ జేయు నతి దక్షంబైన కాలంబు త
ద్గురు కాలాత్ముఁడ వైన నీకు మది సంతోషంబునన్ మ్రొక్కెదన్.

టీకా:

పురుషాధీశ = విష్ణుమూర్తీ {పురుషాధీశుడు - జీవులకు అధిపతి, విష్ణువు}; భవత్ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అబ్జ = పద్మముల {అబ్జము - అప్పు (నీరు) లో పుట్టినది, పద్మము}; యుగళీ = జంటను; పూజ = పూజించుట; ఆది = మొదలగు; కర్మ = కర్మములను; క్రియా = ఆచరించుటలో; పరతన్ = ఆసక్తిని; చెందని = చెంది ఉండని; మూఢ = మోహము చెందిన; చిత్తునిన్ = మనసు కలవానిని; పశు = పశువు, పాశముచే కట్టబడిన {పశువు - పాశముచే కట్టబడినది, ఆవులు మొదలగునవి}; ప్రాయున్ = వంటివానిని; మనుష్య = మనుషులలో; అధమున్ = నీచుని; జరయున్ = ముసలితనము; నాశమున్ = మరణమును; ఒందన్ = పొందునట్లు; చేయు = చేసెడి; అతి = మిక్కిలి; దక్షంబు = సమర్థమైన, శక్తివంతమైన; ఐన = అయిన; కాలంబున్ = కాలమును; తత్ = ఆ; గురు = మహా; కాల = కాల; ఆత్ముడవు = స్వరూపుడవు; ఐన = అయిన; నీకున్ = నీకు; మదిన్ = మనసున; సంతోషంబునన్ = సంతోషముతో; మ్రొక్కెదన్ = నమస్కరించెదను.

భావము:

పురుషోత్తమా! విష్ణుమూర్తీ! నీ పాదపద్మాలను పూజ చేయటం అనే మంచి పనిలో తన్మయత్వం చెందనివాడు పరమ మూఢుడు; పశువులాంటి వాడు; అధముడు. అలాంటి మానవులకు సర్వ సమర్ధమైన కాలం త్వరగా ముసలితనాన్ని కలిగించి, వాడి వినాశనానికి దారితీస్తుంది. అలాంటి అనంతకాలానికి ఆత్మస్వరూపుడవు అయిన నీకు ఆనందంగా నమస్కరిస్తున్నాను.

3-307-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్వేశ! కల్పాంతసంస్థిత మగు జల-
జాత మం దేను సంనన మంది
వదీయ సుస్వరూముఁ జూడ నర్థించి-
హువత్సరములు దపంబుఁ జేసి
క్రతుకర్మములు పెక్కు గావించియును నినుఁ-
బొడగానఁగాలేక బుద్ధి భీతిఁ
బొందిన నాకు నిప్పుడును నిర్హేతుక-
రుణచే నఖిలలోకైకవంద్య

3-307.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాన సతత ప్రసన్న కోల ముఖాబ్జ
లిత భవదీయ దివ్యమంళవిలాస
మూర్తి దర్శింపఁ గలిగె భక్తార్తిహరణ
రణ! తుభ్యంనమో విశ్వరణ! దేవ!

టీకా:

సర్వేశ = విష్ణుమూర్తీ {సర్వేశుడు - సర్వమునకును ప్రభువు, విష్ణువు}; కల్ప = కల్పము; అంత = అంతమున; సంస్థితము = ఏర్పడునది; అగు = అయిన; జలజాతము = పద్మము {జలజాతము - జలమున పుట్టినది, పద్మము}; అందున్ = లో; ఏను = నేను; సంజననమున్ = చక్కగా పుట్టుకను; అంది = పొంది; భవదీయ = నీయొక్క; సుస్వరూపమున్ = చక్కటి స్వరూపమును; చూడన్ = చూడవలెనని; అర్థించి = కోరి; బహు = అనేకమైన; వత్సరములు = సంవత్సరములు; తపంబున్ = తపస్సు; చేసి = చేసి; క్రతు = యజ్ఞములు కొరకు చేయు; కర్మములు = కర్మములు; పెక్కు = అనేకము; కావించియును = ఆచరించియు; నిన్నున్ = నిన్ను; పొడగానగ = కనుగొన; లేక = లేక; బుద్ధిన్ = మనసున; భీతిన్ = భయమును; పొందిన = పొందినట్టి; నాకున్ = నాకు; ఇప్పుడును = ఇప్పుడూ; నిర్హేతుక = కారణములేని; కరుణ = దయ; చేన్ = తో; అఖిలలోకైకవంద్యమాన = విష్ణుమూర్తీ {అఖిలలోకైకవంద్యమానుడు - సమస్తమైన లోకములకును వందనము చేయతగ్గ వాడైన ఒక్కడు, విష్ణువు}; సతత = ఎల్లప్పుడు; ప్రసన్న = ప్రసన్నమైన; కోమల = కోమలమైన; ముఖ = ముఖము అను; అబ్జము = పద్మము; కలిత = కలిగిన; భవదీయ = నీయొక్క; దివ్య = దివ్యమైన; మంగళ = శుభములకు; విలాస = నివాసమైన; మూర్తిన్ = స్వరూపమును; దర్శింపన్ = చూచుట; కలిగెన్ = అయినది; భక్తార్తిహరణకరణ = విష్ణుమూర్తీ {భక్తార్తిహరణకరణుడు - భక్తుల ఆర్తిని పోగొట్టుటను చేయువాడు, విష్ణువు}; తుభ్యం = నీకు; నమో = నమస్కారము; విశ్వభరణ = విష్ణుమూర్తీ {విశ్వభరణుడు - విశ్వమును భరించువాడు, విష్ణువు}; దేవ = దేవుడా.

భావము:

ఓ దేవతలు అందరికి ప్రభువైన విష్ణుమూర్తీ! భక్తుల వేదనలను పోగొట్టే పరమేశా! ఈ విశాల విశ్వాన్ని భరించే విశ్వేశ్వరా! నీకు నమస్కారం. కల్పాంత సమయంలో చక్కగా ఉన్న తామరపువ్వు నందు నేను పుట్టాను. నీ సుందరమైన ఆకారాన్ని చూడగోరి చాలా సంవత్సరాలు తపస్సు చేశాను. యజ్ఞాలు కూడా ఎన్నో చేసాను. కానీ నీ జాడ అంతుచిక్కలేదు. మనసు బెదిరిపోయింది. ఇప్పుడు నీవు నాపై అకారణ అపార కరుణ కల వాడవు అయి సాక్షాత్కరించావు. అఖిల లోకాలకూ ఆరాధనీయమై, ఎల్లప్పుడూ ప్రసన్న కోమలమైన, ముఖపద్మంతో, విరాజిల్లే నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఇప్పుడు కనులారా, కరువుతీరా దర్శించగలిగాను.

3-308-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మర తిర్యఙ్మనుష్యాది చేతన యోను-
లందు నాత్మేచ్ఛచేఁ జెందినట్టి
మనీయ శుభమూర్తి లవాడ వై ధర్మ-
సేతు వనంగఁ బ్రఖ్యాతి నొంది
విషయసుఖంబుల విడిచి సంతత నిజా-
నందానుభవ సమున్నతిఁ దనర్తు
దిగాన పురుషోత్తమాఖ్యఁ జెన్నొందుదు-
ట్టి నిన్నెప్పుడు భినుతింతు

3-308.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్థి భవదీయపాదంబులాశ్రయింతు
హితభక్తిని నీకు నస్కరింతు
క్తజనపోష! పరితోష! రమపురుష!
ప్రవిమలాకార! సంసారయవిదూర!

టీకా:

అమర = దేవతలు; తిర్యక్ = జంతువులు; మనుష = మానవులు; ఆది = మొదలగు; చేతన = సచేతనములు ఐన; యోనులు = గర్భములు; అందున్ = అందు; ఆత్మ = స్వంత; ఇచ్చన్ = ఇష్టానుసారము; చేన్ = చేత; చెందిన = కలిగన; అట్టి = అటువంటి; కమనీయ = మనోహరమైన; శుభ = శుభకరమైన; మూర్తిన్ = స్వరూపము; కలవాడవు = కలవాడవు; ఐ = అయ్యి; ధర్మ = ధర్మమువలన; సేతువు = తరింపచేయు వంతెన; అనంగ = అని; ప్రఖ్యాతిన్ = పేరుపొందిన; ఒంది = పొంది; విషయ = ఇంద్రియార్థములందు {విషయములు - ఇంద్రియములకు గోచరము అగునవి, ఇంద్రియార్థములు}; సుఖంబులన్ = సుఖములను; విడిచి = విడిచిపెట్టి; సంతత = ఎడతెగని; నిజ = సత్యమైన, ఆత్మ యందలి; ఆనంద = ఆనందము యొక్క; అనుభవమున్ = అనుభవమును; ఉన్నతిన్ = గొప్పగా; తనర్తువు = అతిశయింప చేయుదువు; అదిగాన = అందుచేత; పురుషోత్తమ = పురుషోత్తముడు అను; ఆఖ్యన్ = పేరుతో; చెన్ను = ప్రశస్తి; ఒందుదువు = పొందుతావు; అట్టి = అటువంటి; నిన్నున్ = నిన్ను; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; అభినుతింతు = బాగాకీర్తింతును; అర్థిన్ = కోరి; భవదీయ = నీయొక్క; పాదంబులున్ = పాదములను; ఆశ్రయింతున్ = ఆశ్రయించెదను; మహిత = గొప్ప; భక్తిన్ = భక్తితో; నీకున్ = నీకు; నమస్కరింతున్ = నమస్కారము చేయుదును; భక్తజనపోషపరితోష = విష్ణుమూర్తీ {భక్తజనపోషపరితోషుడు - భక్తులు అయిన జనులను పోషించుట యందు సంతోషము కలవాడు, విష్ణువు}; పరమపురుష = విష్ణుమూర్తీ {పరమపురుషుడు - అత్యున్నతమైన ఫురుషుడు, విష్ణువు}; ప్రవిమలాకారా = విష్ణుమూర్తీ {ప్రవిమలాకారుడు - విశిష్టముగా నిర్మలమైన ఆకారము కలవాడు, విష్ణువు}; సంసారభయవిదూర = విష్ణుమూర్తీ {సంసారభయవిదూరుడు - సంసారము (భవ) వలని భయములను మిక్కిలి దూరము చేయువాడు, విష్ణువు}.

భావము:

పురుషోత్తమా! శ్రీహరీ! నిర్మలమైన స్వరూపం కల వాడా! సంసారభయాన్ని దూరంచేసే పురుషోత్తముడా! నీవు భక్తజనులను సంతోషంగా పోషించే వాడివి. నీవు దేవతలు, జంతువులు, మనుష్యులు మున్నగు సచేతన రూపాలు ధరించి నీ సంకల్పానుసారంగా అవతరిస్తావు. మనోహరమైన మంగళ స్వరూపంతో ధర్మానికి సేతువుగా నిలుస్తావు. పేరు ప్రఖ్యాతులు గడిస్తావు. లౌకిక సుఖాలను విడిచిపెట్టి ఎల్లప్పుడూ అపారమైన ఆత్మానందాన్ని అనుభవిస్తావు. అందుకనే నీవు పురుషోత్తము డని ప్రశస్తి కాంచావు. అటువంటి నిన్ను నిత్యమూ స్తుతిస్తాను. ప్రీతితో నీ పాదాలను ఆశ్రయిస్తాను. మిక్కిలి భక్తితో నీకు నమస్కరిస్తాను.

3-309-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లకొని పంచభూప్రవర్తకమైన-
భూరిమాయాగుణస్ఫురణఁ జిక్కు
డక లోకంబులు వదీయ జఠరంబు-
లో నిల్పి ఘనసమాలోల చటుల
ర్వంకషోర్మి భీణ వార్థి నడుమను-
ణిరాజభోగతల్పంబు నందు
యోగనిద్రారతి నుండగ నొకకొంత-
కాలంబు సనఁగ మేల్కనిన వేళ

3-309.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లఘు భవదీయనాభితోజమువలనఁ
లిగి ముల్లోకములు సోపరణములుగఁ
బుట్టఁ జేసితి వతుల విభూతి మెఱసి
పుండరీకాక్ష! సంతతభువనరక్ష!

టీకా:

తలకొని = శిరసావహించి {తలకొని - తల (ముందు) భాగమును తీసుకొని, నాయకత్వము వహించి}; పంచభూత = పంచభూతముల యందును {పంచభూతములు - భూమి నీరు గాలి ఆకాశము తేజస్సు అను 5 భూతములు}; ప్రవర్తకము = మిక్కిలి వర్తించుచుండునది; ఐన = అయిన; భూరి = బహుగొప్ప; మాయా = మాయ యొక్క; గుణ = గుణములు వలన; స్పురణన్ = స్పురించుట అనే బంధాలలో; చిక్కు = తగులము; పడక = పొందక; లోకంబులున్ = భువనములను; భవదీయ = నీయొక్క; జఠరంబున్ = కడుపు; లోన్ = లోపల; నిల్పి = నిలుపుకొని; ఘన = మేఘములవలె; సమ = బాగా; ఆలోల = కదులుతూ; చటుల = భయంకరమైన; సర్వంకష = సర్వమును ఒరుసుకొని పోవుచున్న; ఊర్మి = అలలతో; భీషణ = భయంకరమైన; వార్థిన్ = మహాసముద్రము; నడుమనున్ = మధ్యలో; ఫణిరాజు = ఆదిశేషుని {ఫణిరాజు - సర్పములకు రాజు, ఆదిశేషువు}; భోగ = శరీరము అను; తల్పంబున్ = పాన్పు; అందున్ = అందు; యోగనిద్ర = యోగనిద్ర యందలి; రతిన్ = ఆసక్తిని; ఉండగన్ = ఉండగా; ఒకకొంత = కొంత; కాలమున = కాలమున; కున్ = కు; మేల్కొనిన = లేచిన; వేళన్ = సమయమందు; అలఘు = గొప్పదైన; భవదీయ = నీయొక్క; నాభి = నాభి యొక్క; తోయజము = పద్మము {తోయజము - తోయము (జలము) లందు జము (పుట్టినది), పద్మము}; వలనన్ = నుండి; కలిగి = పుట్టి; ముల్లోకములున్ = మూడులోకములును {ముల్లోకములు - భూ భువర్ సువర్ లోకములు మూడు}; స = కూడిన; ఉపకరణములుగ = సాధనములుకలవిగా; పుట్టన్ = పుట్టునట్లు; చేసితివి = చేసితివి; అతుల = సాటిలేని; విభూతిన్ = వైభవముతో; మెఱసి = అతిశయించి; పుండరీకాక్ష = విష్ణుమూర్తీ {పుండరీకాక్ష - పుండరీకములు (పద్మములు) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; సంతతభువనరక్ష = విష్ణుమూర్తీ {సంతతభువనరక్ష - ఎల్లప్పుడును లోకములును రక్షించువాడు, విష్ణువు}.

భావము:

తెల్లతామర రేకులవంటి కన్నులుగలవాడా! పద్మాక్షా! ఎల్లవేళలా ముల్లోకాలను చల్లగా రక్షించే శ్రీమన్నారాయణ! పంచభూతాలను ప్రవర్తింప చేసి. వాటి మహామాయాబంధాలలో చిక్కుపడకుండా లోకాలను నీ కడుపులో నిలుపుకుంటావు. ఉవ్వెత్తుగా లేచిపడుతున్న ఉత్తుంగ తరంగాలతో పొంగిపొరలే భయంకరమైన సముద్రం నడుమ శేషతల్పంమీద యోగనిద్రలో శయనించి ఉంటావు. కొంతకాలం గడిచాక మేల్కొంటావు. అప్పుడు నీసాటిలేని మేటి వైభవాన్ని వ్యక్తం చేస్తూ, నీ నాభికమలం నుంచి మూడు లోకాలను పుట్టింపచేస్తావు.

3-310-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిమస్తుత! లక్ష్మీపతి!
దంతర్యామి వగుచు ర్గము నెల్లం
గు భవదైశ్వర్యంబున
ణిత సౌఖ్యానుభవము నందింతు గదే.

టీకా:

నిగమస్థుత = విష్ణుమూర్తీ {నిగమస్తుత - వేదములచే స్తుతింపబడు వాడు, విష్ణువు}; లక్ష్మీపతి = విష్ణుమూర్తీ {లక్ష్మీపతి - లక్ష్మీదేవి భర్త, విష్ణువు}; జగత్ = విశ్వమునకు; అంతర్యామివి = లోప లంతా వ్యాపించి ఉండువాడవు; అగుచు = అవుతూ; సర్గమున్ = సృష్టిని; ఎల్లన్ = అంతనూ; తగు = తగిన; భవత్ = నీ యొక్క; ఐశ్వర్యంబునన్ = ఐశ్వర్యమువలన; అగణిత = గణించుటకురాని; సౌఖ్య = సుఖముల; అనుభవమున్ = అనుభవమును; అందింతు = అందించెదవు; కదే = కదా;

భావము:

వేదాలచే వినుతించబడువాడా! శ్రీవల్లభ! విష్ణుమూర్తీ! నీవు లోకాలు అన్నిటికి అంతర్యామివి అయి ఉంటూ, ఈ సృష్టి యావత్తుకి భవ్యమైన నీ దివ్యవిభూతిచే లెక్కలేనన్ని ఆనందానుభూతులను అందిస్తావు కదా.

3-311-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లజాక్ష! యెట్టి విజ్ఞానబలంబునఁ-
ల్పింతు వఖిలలోకంబు లోలి
తజనప్రియుఁడవు నా కట్టి సుజ్ఞాన-
ర్థిమైఁ గృపసేయు య్య వరద!
సృష్టినిర్మాణేచ్ఛఁ జెంది నా చిత్తంబుఁ-
త్కర్మకౌశలిఁ గిలి యుండి
యునుఁ గర్మవైషమ్యమునుఁ బొందు కతమున-
దురితంబుఁ బొరయక తొలగు నట్టి

3-311.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెఱవు నా కెట్లు కలుగు నవ్విధముఁ దలచి
ర్మవర్తను నను భవత్కరుణ మెఱసి
గఁ గృతార్థునిఁ జేయవే నిమవినుత!
త్కృపామూర్తి! యో దేవక్రవర్తి!

టీకా:

జలజాక్ష = విష్ణుమూర్తీ {జలజాక్షుడు - జలజ (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; ఎట్టి = ఎటువంటి; విజ్ఞాన = విజ్ఞానము యొక్క; బలంబునన్ = బలమువలన; కల్పింతువు = సృష్టింతువు; అఖిల = సమస్తమైన; లోకంబుల్ = లోకములను; ఓలిన్ = క్రమముగా; నత = స్తుతించు; జన = జనుల ఎడ; ప్రియుడవు = ప్రేమ కలవాడవు; నాకున్ = నాకు; అట్టి = అటువంటి; సు = మంచి; జ్ఞానము = జ్ఞానము; అర్థిమైన్ = వాత్సల్యముతో; కృపన్ = దయ; చేయుము = చేయుము (ఇమ్ము); అయ్య = తండ్రి; వరద = విష్ణుమూర్తీ {వరదుడు - వరములను ప్రసాదించువాడు, విష్ణువు}; సృష్టిన్ = సృష్టిని; నిర్మాణ = నిర్మించవలెనను; ఇచ్చన్ = కోరికను; చెంది = పొంది; నా = నా; చిత్తంబున్ = మనసు; తత్ = ఆ; కర్మ = పనియందలి; కౌశలిన్ = నేర్పరితనమున; తగిలి = ములిగిపోయి; ఉండియునున్ = ఉండినను; కర్మ = ఆపనులలోని; వైషమ్యమునున్ = ఒడిదుడుకులను; పొందు = కలుగుటకు; కతమున = కారణము చేత; దురితంబున్ = పాపమును; పొలయక = పొందకుండ; తొలగునట్టి = తొలగిపోవునటువంటి; వెఱపున్ = ఔచిత్యము; నాకు = నాకు; ఎట్లు = ఏవిధముగ; కలుగు = కలుగును; ఆ = ఆ; విధమున్ = విధమును; తలచి = ఆలోచించి చూసి; కర్మ = కర్మను; వర్తను = చేయువాడను; నను = నన్ను; భవత్ = నీయొక్క; కరుణ = దయ; మెఱసి = అతిశయించగా; తగన్ = తగిన విధముగా; కృతార్థునిన్ = సార్థకము చెందినవానిగ; చేయవే = చేయుము; నిగమవినుత = విష్ణుమూర్తీ {నిగమవినుత - వేదములచే స్తుతింపబడు వాడు, విష్ణువు}; సత్కృపామూర్తి = విష్ణుమూర్తీ {సత్కృపామూర్తి - మంచి దయకు స్వరూపము ఐనవాడు, విష్ణువు}; ఓ = ఓ; దేవచక్రవర్తీ = విష్ణుమూర్తీ {దేవచక్రవర్తి - దేవతలకి చక్రవర్తి, విష్ణువు}.

భావము:

శ్రీమహావిష్ణువూ! పద్మాలవంటి కన్నులు కలవాడా! కోరిన వరాలను వర్షించేవాడా! పరమ కరుణార్ద్రమూర్తీ! వేదాలచే పొగడబడేవాడా! దేవతా చక్రవర్తీ! నీవు ఎలాంటి విజ్ఞానబలంతో ఈ సమస్త లోకాలను, సృష్టిస్తున్నావో నాకు అటువంటి ఉత్తమ జ్ఞానాన్ని ప్రసాదించు. నీకు నమస్కరించే జనులకు, నీవు ప్రియుడవు కదా, నా మనస్సులో, సృష్టించాలనే కోరిక మిక్కుటంగా ఉన్నది. అది చేయటానికి తగిన నైపుణ్యం కూడా నాకు అనుగ్రహించి కర్మలందలి ఒడిదుడుకులు వల్ల పాపం పొందకుండా ఉండే ఉపాయం ఏమిటో నాకు తెలుపు. కర్మజీవి నైన నన్ను కనికరించి కృతార్థుణ్ణి కావించు.

3-312-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుదరప్రభూత మగు ద్మము నందు వసించి యున్న నే
విరళ తావకీన కలితాంశమునం దనరారు విశ్వముం
విలి రచించుచున్ బహువిధంబులఁ బల్కెడి వేదజాలముల్
శితరమై ఫలింపఁ గృపసేయుము భక్తఫలప్రదాయకా!"

టీకా:

భవత్ = నీ యొక్క; ఉదర = ఉదరమున; ప్రభూతము = చక్కగా పుట్టినది; అగు = అయిన; పద్మము = పద్మము; అందున్ = లో; వసించి = నివసిస్తూ; ఉన్న = ఉన్నట్టి; నేన్ = నేను; అవిరళ = అపారమైన; తావకీన = నీ యొక్క; కలిత = కూడిన; అంశమునన్ = అంశతో; తనరారు = అతిశయించు; విశ్వమున్ = భువనములను; తవిలి = పూనుకొని; రచించుచున్ = రచించుతూ; బహు = అనేక; విధములన్ = విధములుగా; పల్కెడి = చెప్పెడి; వేద = వేదముల; జాలముల్ = సమూహములు; శివతరము = మిక్కిలి శుభకరము {శివము - శివతరము - శివతమము}; ఐ = అయి; ఫలింపన్ = ఫలితమిచ్చునట్లు; కృపన్ = దయ; చేయుము = చేయుము; భక్తఫలప్రదాయకా = విష్ణుమూర్తీ {భక్తఫలప్రదాయకుడు - భక్తులకు తగిన ఫలితము ఇచ్చువాడు, విష్ణువు}.

భావము:

హరీ! భక్తుల భక్తికి చక్కటి ఫలాలను ప్రసాదించేవాడా! నీ కడుపున పుట్టిన కమలంలోనుంచి జన్మించిన నేను అపారమైన నీ అంశతో ప్రకాశించే ఈ విశ్వాన్ని సృష్టించడానికి పూనుకున్నాను. ఈ సందర్భంలో నేను పలురీతులుగా పలికే పలుకులు వేదరాశి అయి మంగళప్రదాలై ఫలించేటట్లు అనుగ్రహించు.”

3-313-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యనుకంపదోఁప వినయంబునఁ జాఁగిలి మ్రొక్కి చారులో
సరసీరుహుం డగుచు ర్వజగత్పరికల్పనా రతిం
రిన నన్నుఁ బ్రోచుటకుఁ దా నిటు సన్నిధి యైన యీశ్వరుం
యము నాదు దుఃఖము దయామతిఁ బాపెడు నంచు నమ్రుడై

టీకా:

అని = అని; అనుకంప = జాలి; తోపన్ = కలుగునట్లు; వినయంబునన్ = వినయముగా; చాగిలి = సాష్టాంగపడి; మ్రొక్కి = నమస్కరించి; చారు = అందమైన; లోచన = కనులు అను; సరసీరుహుడు = పద్మములు కలవాడు; అగుచున్ = అవుతూ; సర్వ = సమస్త; జగత్ = భువనములను; పరికల్పనా = చక్కగా సృష్టించు; రతిన్ = ఆసక్తిలో; తనరిన = అతిశయించిన; నన్నున్ = నన్ను; ప్రోచుటకున్ = కాపాడుటకు; తాన్ = తను; ఇటు = ఈ విధముగా; సన్నిధి = ప్రత్యక్షము; ఐన = అయిన; ఈశ్వరుండు = విష్ణుమూర్తీ {ఈశ్వరుడు - ఈశత్వము (ప్రభావము) కలవాడు, ప్రభువు, విష్ణువు}; అనయమున్ = ఎల్లప్పుడు; నా = నా యొక్క; దుఃఖమున్ = దుఃఖమును; దయా = దయతో కూడిన; మతిన్ = మనసుతో; బాపెడున్ = పోగొట్టునుగాక; అంచున్ = అనుచూ; నమ్రుడు = నమ్రతతో కూడినవాడు; ఐ = అయి.

భావము:

ఇలా పలికిన కమలసంభవుడు, బ్రహ్మదేవుడు కనికరం ఉట్టిపడేలా విష్ణుదేవునకు విన్నవించుకొని వినయంతో దండప్రణామాలు చేసాడు. “సర్వప్రపంచాన్ని, సృష్టించడానికి పూనుకున్న నన్ను అందాలు చిందే కమలాలవంటి కన్నులతో వీక్షించి రక్షించడానికై, ఈ విధంగా సాక్షాత్కరించిన పరాత్పరుడు నా దుఃఖాన్ని దూరంచేయు గాక” అని తలవంచి నమస్కరించాడు.

3-314-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుహసంజాతుఁడు నె
మ్మమున హర్షించె ననుచు" మైత్రేయమహా
ముని ఘనుఁడగు విదురునకున్
వియంబున నెఱుఁగజెప్పి వెండియుఁ బలికెన్.

టీకా:

వనరుహసంజాతుడు = బ్రహ్మదేవుడు {వనరుహసంజాతుడు- వనరుహము (నీట పుట్టిన, పద్మము) నందు చక్కగా పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; నెఱ = నిండు; మనమ్మునన్ = మనసుతో; హర్షించెన్ = సంతోషించెను; అనుచున్ = అనుచూ; మైత్రేయ = మైత్రేయుడు అను; మహా = గొప్ప; ముని = ముని; ఘనుడు = గొప్పవాడు; అగు = అయిన; విదురున = విదురుని; కున్ = కి; వినయంబునన్ = వినమ్రతగా; ఎఱుగన్ = తెలియునట్లు; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; పలికెన్ = పలికెను.

భావము:

ఇలా మ్రొక్కిన బ్రహ్మదేవుని నిండుమనసు ఆనందంతో పొంగిపోయింది.” అని మైత్రేయ మహర్షి విజ్ఞానధనుడైన విదురునకు వివరంగా తెలియ చెప్పి, మళ్ళీ ఇలా అన్నాడు.

3-315-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"జాతప్రభవుండు కేవలతపోవ్యాసంగుఁ డై పద్మలో
ను గోవిందు ననంతు నాఢ్యుఁ దన వాక్ఛక్తిన్ నుతింపన్ సుధా
వంద్యుండు ప్రసన్నుఁ డై నిఖిల విశ్వస్థాపనాలోకనం
బునఁ జూచెన్ విలయప్రభూత బహువాఃపూరంబులన్ వ్రేల్మిడిన్.

టీకా:

వనజాతప్రభవుండు = బ్రహ్మదేవుడు {వనజాతప్రభవుడు - వనజాతము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; కేవల = స్వచ్ఛమైన; తపస్ = తపస్సు అను; వ్యాసంగుడు = మిక్కిలి శ్రద్ధ కలవాడు; ఐ = అయి; పద్మలోచను = విష్ణుమూర్తి {పద్మలోచనుడు - పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; గోవిందు = విష్ణుమూర్తి {గోవిందుడు - గోవుల (నీళ్ళు)కి ఒడయుడు, నారాయణుడు, విష్ణువు}; అనంతు = విష్ణుమూర్తి {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; ఆఢ్యున్ = విష్ణుమూర్తిని {ఆఢ్యుడు - శ్రేష్ఠుడు, విష్ణువు}; తన = తన యొక్క; వాక్ = వాక్కులకు గల; శక్తిన్ = శక్తికొద్దీ; నుతింపన్ = కీర్తింపగా; సుధాశనవంద్యుండు = విష్ణుమూర్తీ {సుధాశనవంద్యుడు - సుధాశన (సుధను సేవించువారు, దేవతలు)కు వంద్యుడు (వందనము చేయతగ్గవాడు), విష్ణువు}; ప్రసన్నుడు = ప్రసన్నముగఉన్నవాడు; ఐ = అయి; నిఖిల = సమస్తమైన; విశ్వ = భువనములను; స్థాపన = సృష్టించవలెనని; ఆలోకనంబునన్ = ఆలోచనతో; చూచెన్ = చూసెను; విలయ = ప్రళయమున; ప్రభూత = పుట్టిన; బహు = మిక్కిలి; వాః = జల; పూరంబులన్ = రాశులందు; వ్రేల్మిడిన్ = చిటికలో.

భావము:

"పద్మంలో పుట్టినవాడు అయిన బ్రహ్మదేవుడు కేవలం తపస్సు పై ఆసక్తి కలవాడై పద్మాక్షుడూ, గోవిందుడూ, అనంతుడూ, పురుషోత్తముడూ అయిన పరమేశ్వరుణ్ణి ఎంతో ప్రస్తుతించాడు. అమృతం తాగే దేవతలకే దేవదేవుడైన హరి అనుగ్రహించాడు. సమస్త విశ్వాన్ని సంస్థాపించాలనే దృష్టితో ప్రళయాన్ని సృష్టించిన ఆ మహా జలప్రవాహం వైపు అలా అలవోకగా ఒక మాటు అవలోకించాడు.

3-316-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్లు వొడగని యార్తుఁ డైట్టి పద్మ
వుని వాంఛిత మాత్మఁ దీర్పగఁ దలంచి
తని మోహనివారక మైన యట్టి
మృతరసతుల్య మధురవాక్యముల ననియె.

టీకా:

అట్లు = ఆ విధముగ; పొడగని = చూసి; ఆర్తుడు = ఆర్తి చెందినవాడు; ఐనట్టి = అయినట్టి; పద్మభవుని = బ్రహ్మదేవుని {పద్మభవుడు - పద్మమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; వాంఛితము = కోరినది; ఆత్మన్ = స్వయముగా; తీర్పన్ = తీర్చవలెనని; తలచి = అనుకొని; అతని = అతని; మోహ = మోహమును; నివారకము = నివారించునది; ఐన = అయిన; అట్టి = అటువంటి; అమృత = అమృతము అను; రస = రసమునకు; తుల్య = సరితూగు; మధుర = మధురమైన; వాక్యములన్ = మాటలతో; అనియెన్ = పలికెను.

భావము:

అలా చూసి ఆర్తితో అడుగుతున్న బ్రహ్మదేవుని కోర్కె తీర్చాలని మదిలో భావించాడు. అతనిలోని వ్యామోహాన్ని తొలగించగలిగిన అమృతముతో సమానమైన తీయని మాటలతో ఇలా అన్నాడు.

3-317-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కొని నీ యొనర్చు పనిప్పి మదిం దలపోయు దుఃఖముం
లఁగుము నాదు లీలకుఁ బ్రధానగుణం బగు సృష్టికల్పనం
వడఁ జేయు బుద్ధి హృదయంబునఁ జొన్పి తపస్సమాధి ని
ష్ఠ నతిభక్తులన్ ననుఁ బ్రన్నునిఁ జేయుము చెందు కోరికల్.

టీకా:

తలకొని = శిరసావహించి; నీ = నీవు; ఒనర్చు = చేయు; పని = పనిని; తప్పి = వదలి; మదిన్ = మనసున; తలపోయు = అనుకొనుచున్న; దుఃఖమున్ = దుఃఖమునుండి; తలగుము = తొలగుము; నాదు = నా యొక్క; లీలన్ = లీలల; కున్ = కి; ప్రధాన = ముఖ్యమైన; గుణంబున్ = గుణము; అగు = అయిన; సృష్టిన్ = సృష్టిని; కల్పనంబున్ = చేయుటను; అలవడన్ = జరుగునట్లు; చేయు = చేసే; బుద్ధిన్ = బుద్ధిని; హృదయంబునన్ = హృదయములో; చొన్పి = ప్రవేశింపజేసి; తపస్ = తపస్సు; సమాధి = యోగసమాధి; నిష్ఠలన్ = నిష్ఠలతోను; అతి = మిక్కిలి; భక్తులన్ = భక్తితో (నవవిధ భక్తిమార్గాలలో ఏ భక్తితో అయినా సరే); ననున్ = నన్ను; ప్రసన్నునిన్ = ప్రసన్నమైన వానిగా; చేయుము = చేయుము; చెందున్ = నెరవేరును; కోరికల్ = కోరికలు.

భావము:

“నీవు పూనుకొని చేస్తున్న పని వదలవద్దు. అనవసరంగా మనస్సుకు తెచ్చి పెట్టుకున్న దుఃఖాన్నిమాను. సృష్టి నిర్మాణం నా లీలలలో, ప్రధానమైనది. ఈ సృష్టి నిర్మాణ కార్యం చేయాలనే బుద్ధి హృదయంలో ప్రతిష్ఠించుకొని, సమాధినిష్ఠుడవై భక్తితో తపస్సు చేసి నన్ను ప్రసన్నుని చేసుకో. నీ కోరికలు నెరవేరుతాయి.

3-318-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ వొనరించు తపోవి
ద్యావిభవ విలోకనీయ గు నీ సృష్టిం
గావింపుము లోకంబుల
లో వెఁలిగెడి నన్నుఁ గందు లోకస్తుత్యా!

టీకా:

నీవు = నీవు; ఒనరించు = చేయు; తపస్ = తపస్సు అనెడి; విద్య = విద్య యొక్క; విభవ = వైభవముచేత; విలోకనీయము = చూడచక్కనిది; అగున్ = అయిన; నీ = నీ యొక్క; సృష్టిన్ = సృష్టిని; కావింపుము = చేయుము; లోకంబులున్ = లోకములు; లోన్ = అందు; వెలిగెడి = ప్రకాశించు; నన్నున్ = నన్ను; కందు = చూచెదవు; లోక = లోకములుచే; స్తుత్యా = స్తుతింపబడువాడ.

భావము:

నీ తపస్సంపద వైభవం వెల్లడయ్యే ఈ సృష్టి నిర్మాణ కార్యాన్ని మొదలెట్టు. అప్పుడు, లోకం అంతా స్తుతించే బ్రహ్మా! సమస్తమైన లోకాలు అన్నిటిలోనూ ప్రకాశించే నన్ను కనుగొనగలవు.

3-319-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాలోని జీవకోటులు
వాలాయము నీకుఁ గానచ్చు నిపుడు నీ
వాలోకింపుము దారువి
లో హుతాశనునికరణి లోకస్తుత్యా!

టీకా:

నా = నా; లోని = లోపలి; జీవ = జీవములు; కోటులు = సమస్తమును; వాలాయమున్ = అవశ్యము; నీకున్ = నీకు; కానవచ్చు = కనిపించును; ఇపుడు = ఇప్పుడు; నీవు = నీవు; ఆలోకింపుము = చూడుము; దారు = కట్టెల యందు; విలోల = చక్కగాచరిస్తున్న; హుతాశనుని = అగ్నిహోత్రుని; కరణి = వలె; లోక = లోకములచే; స్తుత్యా = స్తుతింపబడువాడ.

భావము:

ఓ విశ్వం అంతా వినుతించే బ్రహ్మా! కఱ్ఱల లోపల దాగి ఉన్న నిప్పులా, నాలో దాగి ఉన్న ప్రాణి సమూహాలన్నీ నీకు తప్పకుండా కనిపిస్తాయి. ఏదీ నువ్వు ఇప్పుడు చూడు.

3-320-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లువొంద నఖిలజీవు యందుఁ గల నన్నుఁ-
దెలిసి సేవింపుము లినగర్భ!
వదీయ దోషముల్ వాయును భూతేంద్రి-
యాశ్రయ విరహిత మై విశుద్ధ
మైన జీవుని విమలాంతరాత్ముఁడ నైన-
ను నేకముగఁ జూచు రుఁడు మోక్ష
దమార్గవర్తి యై భాసిల్లు బ్రహ్మాండ-
మందును వివిధకర్మానురూప

3-320.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్ధతులఁ జేసి పెక్కురూముల నొందు
జీవతతి రచియించు నీ చిత్త మెపుడు
త్పదాంబుజయుగళంబు రగి యున్న
తన రాజసగుణమునఁ లుగ దఘము.

టీకా:

నలువొందన్ = చక్కగా ఒప్పునట్లు; అఖిల = సమస్త; జీవులు = ప్రాణులు; అందున్ = అందు; కల = ఉన్నట్టి; నన్నున్ = నన్ను; తెలసి = తెలుసుకొని; సేవింపుము = సేవింపుము; నలినగర్భ = బ్రహ్మదేవుడా {నలినగర్భుడు - నలినము (పద్మము)న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; భవదీయ = నీయొక్క; దోషముల్ = దోషములు; పాయును = తొలగును; భూత = పంచభూతముల; ఇంద్రియ = దశేంద్రియముల; ఆశ్రయ = ఆశ్రయించుటలు; విరహితము = పూర్తిగా లేనిది; ఐ = అయ్యి; విశుద్ధము = పరిశుద్ధము; ఐన = అయిన; జీవుని = జీవుని; విమల = నిర్మలమైన; అంతరాత్ముడను = అంతరాత్మ ఐనవాడను; ఐన = అయిన; ననున్ = నన్ను; ఏకముగన్ = నేను తప్పనితరము లేదని; చూచు = చూచెడి; నరుడు = మానవుడు; మోక్షపద = పరమపదము యొక్క; మార్గ = మార్గమును; వర్తి = అనుసరించువాడు; ఐ = అయ్యి; భాసిల్లు = ప్రకాశించును; బ్రహ్మాండము = బ్రహ్మాండము; అందునున్ = లో; వివిధ = వివిధరకముల; కర్మ = కర్మములకు; అనురూప = అనుకూలమైన; పద్ధతులన్ = మార్గములను; చేసి = వలన; పెక్కు = అనేక; రూపంబులన్ = స్వరూపములను; ఒందు = పొందెడి; జీవ = జీవముల; తతిన్ = సముహములను; రచియించు = సృష్టించు; నీ = నీయొక్క; చిత్తము = మనసు; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; మత్ = నాయొక్క; పద = పాదములు అను; అంబుజ = పద్మముల {అంబుజ - అప్పు (నీటి)లో పుట్టునది, పద్మము}; యుగళంబున్ = జంటను; మరగి = మోహించి, అలవాటుపడి; ఉన్న = ఉన్నట్టి; కతన = కారణము చేత; రాజస = రాజస; గుణమునన్ = గుణము; కలుగదు = కలుగదు; అఘము = పాపము.

భావము:

సరోజసంభవా! బ్రహ్మా! సకల జీవులలోనూ అంతర్యామినై ఉండే నన్ను చక్కగా తెలుసుకొని సేవించు; నీదోషాలన్నీ తొలగిపోతాయి. (1. పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము ఇవి పంచ భూతాలు; 1. కళ్ళు, 2. ముక్కూ, 3. చెవులు, 4. నోరు, 5. చర్మము, 6. నాలుక, 7. చేతులు, 8. కాళ్ళు, 9. మలద్వారము, 10. జననేంద్రియం ఇవి దశేంద్రియాలు). పంచభూతాలకూ, దశేంద్రియాలకూ అతీతుడైన జీవుడే ఆత్మ. పరిశుద్ధుడైన ఆత్మనూ, పరమాత్ముడనైన నన్నూ అభేదంగా దర్శించే మానవుడు మోక్షమార్గంలో పయనించేవాడు అయి ప్రకాశిస్తాడు. బ్రహ్మాండం అనే ఈ గోళంలో అనేక రకాల కర్మలకూ సానుకూలమై ప్రవర్తించే ఆయా అనేక రూపాలు గల జీవులను నీవు సృష్టించుకున్నప్పటికీ నీమనస్సు నిత్యం నాపాదపద్మాల మీదనే లగ్నమై ఉన్నందువలన నీలోని రాజసగుణం నీకు పాపాన్ని కలిగించదు.

3-321-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను మదియుఁ గాక ప్రాణుల
యము నెఱుఁగంగరాని నఘుఁడఁ దేజో
నుఁడఁ బరేశుఁడ నీచే
ను గానంబడితి నిదె పితామహ! కంటే.

టీకా:

వినుము = వినుము; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ప్రాణుల = జీవుల; కున్ = కు; అనయమున్ = అవశ్యమున్; ఎఱుగన్ = తెలియుటకు; రాని = రాని; అనఘుడన్ = పాపము అంటనివాడను; తేజోధనుడన్ = తేజస్సు అను ధనము కలవాడను; పరేశుడన్ = పరమమైన ప్రభువును; నీ = నీ; చేతనున్ = చేతను; కానంబడితిన్ = చూడబడితిని; ఇదె = ఇదిగో; సరోజజ = బ్రహ్మదేవుడా {సరోజజుడు - సరోజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; కంటె = చూసితివా.

భావము:

ఓ పితామహా! బ్రహ్మా! అంతేకాదు, నేను ఏ జీవులు ఏనాడూ తెలియలేని పుణ్యమూర్తిని, తేజోనిధిని, పరమేశ్వరుడను, అటువంటి నేనే ఇప్పుడు నీముందు సాక్షాత్కరించాను. చూసావు కదా.

3-322-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు, భూతేంద్రియగుణాత్ముం డనియు జగన్మయుం డనియు నన్ను నీ చిత్తంబు నందుఁ దలంపుము; తామరసనాళవివర పథంబు వెంటం జని జలంబులలోనం జూడం గోరి నట్టి మదీయ స్వరూపంబు.

టీకా:

మఱియున్ = ఇంకనూ; భూత = పంచభూతములు; ఇంద్రియ = దశేంద్రియములు; గుణ = త్రిగుణములు; ఆత్ముండన్ = తానే ఐన వాడను; అనియున్ = అనియూ; జగత్ = భువనములను; మయుండను = అంతయూ నిండినవాడను; అనియున్ = అనియూ; నన్నున్ = నన్ను; నీ = నీ యొక్క; చిత్తంబున్ = మనసు; అందున్ = లో; తలంపుము = స్మరింపుము; తామరస = పద్మము యొక్క; నాళ = తూడు, కాడ; వివర = కన్నము యొక్క; పథంబున్ = మార్గము; వెంటన్ = వెంట; చని = వెళ్లి; జలంబుల = నీటి; లోనన్ = లోపల; చూడన్ = చూడవలెనని; కోరిన = కోరిన; అట్టి = అటువంటి; మదీయ = నా యొక్క; స్వరూపంబున్ = స్వరూపము;

భావము:

1. పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము ఇవి పంచ భూతాలు; 1. కళ్ళు, 2. ముక్కూ, 3. చెవులు, 4. నోరు, 5. చర్మము, 6. నాలుక, 7. చేతులు, 8. కాళ్ళు, 9. మలద్వారము, 10. జననేంద్రియం ఇవి దశేంద్రియాలు; 1, సత్వగుణము, 2. రజోగుణము, 3. తమోగుణము ఇవి త్రిగుణాలు. నేనే ఈ పంచభూతాలకూ, పది ఇంద్రియాలకూ, త్రిగుణాలకూ, అంతరాత్మను అనీ, జగత్తు అంతటా వ్యాపించినవాడననీ, నన్ను నీ మనస్సులో భావించు. అప్పుడు పద్మంకింద కాడ లో ఉన్న కన్నం వెంట వెళ్లి నీటిలో ఉన్న నన్ను చూడాలనుకున్న నా స్వరూపం ఇప్పుడు నీకు దర్శనం అయింది.

3-323-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ కిప్పుఁడు గానంబడె
నాకులకును నురగపతి పినాకులకైనన్
వాకొనఁగం దలపోయను
రాకుండు మదీయ రూపమ్యత్వంబుల్.

టీకా:

నీకున్ = నీకు; ఇపుడు = ఇప్పుడు; కానబడెన్ = కనబడినది; నాకుల = దేవతల {నాకులు - నాక (స్వర్గ) లోకమున ఉండు వారు, దేవతలు}; కున్ = కు; ఉరగపతి = ఆదిశేషుడు {ఉరగపతి - ఉరగము (పాముల)కు పతి, ఆదిశేషుడు}; పినాకులన్ = శివులకును {పినాకుడు - పినాకము అను విల్లు ధరించువాడు, శివుడు}; ఐనను = అయినను; వాకొనగన్ = పలుకుటకును; తలపోయన్ = ఊహించుటకును; రాకుండు = వీలుకానివి; మదీయ = నా యొక్క; రూప = రూపములు; రమ్యత్వంబుల్ = మనోహరత్వములు.

భావము:

ఇప్పుడు నీకు దర్శనం అయిన నా స్వరూపంలోని సౌందర్య విశేషాలన్నీ దేవతలూ, ఆదిశేషుడూ, చివరకు ఆ పరమశివుడు కూడా మాటలలో వర్ణించలేరు. మనస్సులో ఊహించను కూడా ఊహించలేరు.

3-324-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున మచ్చారిత్ర క
థా విలసిత మైన సుమహిస్తవము జగ
త్పానము విగతసంశయ
భావుఁడ వై బుద్ధినిలుపు పంకజజన్మా!

టీకా:

కావున = కావున; మత్ = నాయొక్క; చరిత్ర = వర్తనలు; కథా = కథలుతో; విలసితము = విలసిల్లునది; ఐన = అయిన; సు = గొప్ప; మహిత = మహిమ కల; స్తవము = స్తోత్రము; జగత్ = భువనములను; పావనము = పవిత్రము చేయునది; విగత = విడిచిపెట్టిన; సంశయ = సంశయములు కల; భావుండవు = భావములు కలవాడవు; ఐ = అయి; బుద్ధిన్ = మనసున; నిలుపు = నిలుపుము; పంకజజన్మా = బ్రహ్మదేవుడా {పంకజజన్ముడు - పంకజ (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}.

భావము:

పద్మసంభవా! బ్రహ్మా! నా చరిత్ర, లీలా విలాసాలు కలిగిన కథలతో ప్రకాశించే ఈ పరమ పవిత్ర స్తోత్రం లోకాన్ని పవిత్రం చేస్తుంది. అందుచేత ఏమాత్రం సంశయం లేకుండా దీనిని నీ మనసులో స్థిరంగా నిలిపి ఉంచుకో.

3-325-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుణుఁడ నై లీలార్థము
ములఁ గల్పింపఁ దలచు తురుని నన్నున్
గుణునిఁగా నుతియించితి
సంతస మయ్యె నాకుఁ దామరసభవా!

టీకా:

అగుణుడను = నిర్గుణుడను; ఐ = అయి; లీల = లీలల; అర్థము = కోసము; జగములన్ = లోకములను; కల్పింపన్ = సృష్టింపను; తలచు = సంకల్పించు; చతురున్ = నేర్పరుని; నన్నున్ = నన్ను; సగుణునిగా = గుణములతో కూడినవానిగా; నుతియించితి = స్తుతించితివి; తగన్ = చక్కగా; సంతసము = సంతోషము; అయ్యెన్ = ఆయెను; నాకున్ = నాకు; తామరసభవా = బ్రహ్మదేవుడా {తామరసభవుడు - పద్మములో పుట్టిన వాడు, విష్ణువు}.

భావము:

కమలభవా! బ్రహ్మా! నిర్గుణుడనై, వినోదంకోసం జగత్తులను సృష్టించాలనుకున్న నన్ను సగుణ పరబ్రహ్మగా ప్రస్తుతించావు. నాకు ఎంతో సంతోషమైంది.

3-326-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంజుస్తవరాజము
నీ నమునఁ జింతఁ దక్కి నిలుపుము భక్తిన్
ధీహిత! నీ మనంబునఁ
గామించిన కోర్కు లెల్లఁ లుగుం జుమ్మీ.

టీకా:

ఈ = ఈ; మంజు = మనోహరమైన; స్తవ = స్తోత్రములలో; రాజమున్ = శ్రేష్ఠమైనది; నీ = నీ యొక్క; మనమునన్ = మనసులో; చింతన్ = దుఃఖమును; తక్కి = విడిచిపెట్టి; నిలుపుము = ధరించుము; భక్తిన్ = భక్తితో; ధీ = బుద్ధి యందు; మహిత = మహిమ కల వాడా; నీ = నీ యొక్క; మనంబునన్ = మనసులో; కామించిన = కోరిన; కోర్కులు = కోరికలు; ఎల్లన్ = సర్వమునూ; కలుగున్ = సిద్ధించును; సుమీ = సుమా.

భావము:

మహా బుద్ధిమంతుడా! బ్రహ్మా! నిశ్చింతగా నిశ్చలభక్తితో ఈ మనోహరమైన మహా స్తోత్రాన్ని నీ మనస్సు లో నిలుపుకో. నీ కోరికలన్నీ నిశ్చయంగా నెరవేరుతాయి.

3-327-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుదినమునుఁ ద్రిజగత్పా
మగు నీ మంగళస్తవంబుఁ బఠింపన్
వినినను జనులకు నేఁ బొడ
నఁబడుదు నవాప్తసకలకాముఁడ నగుచున్.

టీకా:

అనుదినమునున్ = ప్రతిరోజూ; త్రిజగత్ = మూడు లోకములను {త్రిజగత్తులు - భూ ఊర్థ్వ అథో లోకములు - ఇంకోవిధముగ భూ భువర్ సువర్ లోకములు}; పావనము = పవిత్రము చేయునది; అగున్ = అయిన; ఈ = ఈ; మంగళ = శుభకరమైన; స్తవంబున్ = స్తోత్రమును; పఠింపన్ = చదివినను; వినినను = వినిననూ; జనుల = మానవుల; కున్ = కు; నేన్ = నేను; పొడగనబడుదును = దర్శింపబడుదును; అవాప్త = పొందబడిన; సకల = సమస్త; కాముడను = కామములు కలవాడను; అగుచున్ = అవుతూ;

భావము:

ప్రతిరోజూ, ముల్లోకాలను పవిత్రంచేసే శుభప్రదమైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వింటారో, వారికి కోరికలన్నింటినీ తీర్చు వాడనై నేను దర్శనమిస్తాను.

3-328-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న తటా కోపనయన వివాహ దేవ
న నిర్మాణ భూమ్యాదివివిధదాన
ప తపోవ్రత యోగ యజ్ఞముల ఫలము
మామక స్తవఫలంబు సమంబు గాదు.

టీకా:

వన = వనములు; తటాక = చెరువులు; ఉపనయన = ఉపనయనములు; వివాహ = వివాహములు; దేవభవన = దేవాలయములు; నిర్మాణ = నిర్మించుటలు; భూమి = భూమి; ఆది = మొదలగు; వివిధ = వివిధ రకముల; దాన = దానములు; జప = జపములు; తపస్ = తపస్సులు; యోగ = యోగములు; యజ్ఞముల = యజ్ఞముల యొక్క; ఫలము = ఫలితము; మామక = మా యొక్క; స్తవ = స్తవము యొక్క; ఫలము = ఫలితము; సమంబున్ = సమానము; కాదు = కాదు.

భావము:

ఉద్యానవనాలు నెలకొల్పడం, చెరువులు తవ్వించడం, వివాహాలు ఉపనయనాలు చేయడం, దేవాలయాలు నిర్మించడం, భూదానాలు, మొదలైనవి చేయడం, జపతపాలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు, చేయడంవల్ల, ప్రాప్తించే ఫలాలు ఈ నా స్తోత్ర ఫలానికి ఏమాత్రం సమానం కాలేవు.

3-329-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జీవావలిఁ గల్పించుచుఁ
జీవావలిలోనఁ దగ వసించుచుఁ బ్రియవ
స్త్వాలిలోపలఁ బ్రియవ
స్త్వాలి యై యుండు నన్ను నిశముఁ బ్రీతిన్.

టీకా:

జీవ = జీవముల; ఆవలిన్ = సమస్త సమూహమును; కల్పించుచున్ = సృష్టించుచూ; జీవ = జీవముల; ఆవలిన్ = సమస్త సమూహము; లోనన్ = లోపలను; తగన్ = అవశ్యము; వసించుచున్ = నివసిస్తూ; ప్రియ = ప్రియమైన; వస్తు = వస్తువుల; ఆవలిన్ = సమూహము; లోపలన్ = లోపల; ప్రియ = ప్రియమైన; వస్తు = వస్తువుల; ఆవలిన్ = సమూహము; ఐ = అయి; ఉండున్ = ఉండెడు; నన్నున్ = నన్ను; అనిశమున్ = ఎల్లప్పుడును; ప్రీతిన్ = ప్రీతితో.

భావము:

ఓ బ్రహ్మదేవా! సకల ప్రాణులను సృష్టిస్తూ, ఆ జీవాలు అన్నిటి అందు అంతర్యామినై వర్తిస్తూ, ప్రియ వస్తువులలో, అత్యధికమైన ప్రియ వస్తువునై ఉండే నన్ను నిత్యమూ ప్రీతితో స్మరింపుము.

3-330-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లఁపుము మత్ప్రీతికి నై
లిగించితి నిన్ను భువనకారణ! నాలో
నడగి యేకమై ని
శ్చగతి వసియించి యున్న గముల నెల్లన్.

టీకా:

తలపుము = స్మరింపుము; మత్ = నా యొక్క; ప్రీతిన్ = ప్రీతి; కిన్ = కొరకు; ఐ = అయి; కలిగించితిన్ = సృష్టించితిని; నిన్నున్ = నిన్ను; భువనకారణ = బ్రహ్మదేవుడా {భువనకారణుడు - భువనముల సృష్టికి కారణము ఐనవాడు, బ్రహ్మదేవుడు}; నా = నా; లోపలన్ = లోపలనే; అడగి = అణగి; ఏకము = లీనము; ఐ = అయి; నిశ్చల = చలనము లేని; గతిన్ = విధముగ; వసించి = నివసించి; ఉన్న = ఉన్నట్టి; జగములన్ = భువనములను; ఎల్లన్ = సమస్తమును.

భావము:

బ్రహ్మా! నా సంతోషం కోసమే నిన్ను సృష్టికర్తగా సృష్టించాను. నాలో లీనమై దాగి చలనం లేకుండా ఉండే లోకాలను అన్నింటి నీవు చక్కగా సృజించు.

3-331-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ నహంకారమూలతత్త్వంబు నొంది
నీవు పుట్టింపు" మనుచు రాజీవభవుఁడు
వినఁగ నానతి యిచ్చి యవ్వజనాభుఁ
డంత నంతర్హితుం డయ్యె నఘచరిత!"

టీకా:

తగన్ = అవశ్యమున్; అహంకార = అహంకారము; మూల = ముఖ్యమైన; తత్త్వంబున్ = తత్త్వమును; ఒంది = పొంది; నీవున్ = నీవు; పుట్టింపుము = సృష్టింపుము; అనుచున్ = అని; రాజీవభవుడు = బ్రహ్మదేవుడు {రాజీవభవుడు - రాజీవము (పద్మము)నందు పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; వినగన్ = వింటూవుండగా; ఆనతిన్ = ఆజ్ఞ; ఇచ్చి = ఇచ్చి; ఆ = ఆ; వనజనాభుడు = విష్ణుమూర్తి {వనజనాభుడు - పద్మము బొడ్డున కలవాడు, విష్ణువు}; అంతన్ = అంతట; అంతర్హితుండు = అదృశ్యుడు; అయ్యెన్ = ఆయెను; అనఘచరిత = పుణ్యవర్తనా;

భావము:

ఓ పుణ్యచరితుడా! బ్రహ్మా! అహంకారమే, మూలతత్వంగా గ్రహించి నువ్వు సృష్టి చెయ్యి” అని బ్రహ్మను ఆజ్ఞాపించి, అనంతరం భగవంతుడైన విష్ణువు అంతర్హితుడైనాడు.”