పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మ జన్మ ప్రకారము

  •  
  •  
  •  

3-277-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘు యుగాంతకాలపవనాహత సంచల దూర్మిజాల సం
లిత జలప్రభూత మగు కంజముఁ దద్వనజాత కర్ణికా
మున నున్న తన్ను విశక్రియఁ గల్గిన లోకతత్త్వమున్
లిఁ దెలియంగనోపక మనంబునఁ జాల విచార మొందుచున్.

టీకా:

అలఘు = గొప్ప; యుగ = యుగము; అంత = అంతమగు; కాల = సమయ మందలి; పవన = వాయువులచే; ఆహత = కొట్టబడుట వలన; సంచలత్ = మిక్కిలి కదిలిపోతున్న; ఊర్మి = అలల; జాల = సమూహములను; సంకలిత = బాగా కలిగి ఉన్న; జల = నీటి యందు; ప్రభూతము = పుట్టినది; అగు = అయిన; కంజమున్ = పద్మమును {కంజము - కం నందు(నీట) పుట్టినది}; తత్ = ఆ; వనజాత = పద్మము యొక్క {వనజాతము - వనమున (నీట) పుట్టినది, పద్మము}; కర్ణిక = బొడ్డు; తలమునన్ = ప్రదేశమున; ఉన్న = అన్నట్టి; తన్నున్ = తనను; విశద = స్పష్టమైన; క్రియన్ = విధముగ; కలిగిన = ఉన్న; లోక = భువన; తత్త్వమున్ = తత్త్వమును; నలిన్ = స్వల్పముగనైన; తెలియంగ = తెలిసికొన; ఓపక = లేక; మనంబునన్ = మనసులో; చాలన్ = చాలా; విచారమున్ = విచారమును; ఒందుచున్ = పొందుతూ.

భావము:

అంతులేని ప్రళయకాలం. చుట్టూ మహాజలం. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. అలలు లేచిపడుతున్నాయి ఆ జలమధ్యంలో ఒక పద్మం ఆ పద్మంమధ్య దుద్దుపై తాను స్పష్టమవుతూ ఉన్న లోకాల స్వరూపం ఇదంతా ఏమిటో అర్థంకాక. తెలుసుకోలేక చతుర్ముఖుడు తన మనస్సులో చాలా విచారాన్ని పొంది ఇలా వితర్కించాడు.