పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మ జన్మ ప్రకారము

  •  
  •  
  •  

3-275-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుట్టించెఁ దద్గుణంబునఁ బరమేశ్వరు-
నాభిదేశము నందు ళిననాళ
ముదయించె మఱి య ప్పయోరుహముకుళంబు-
ర్మబోధితమైన కాల మందుఁ
న తేజమునఁ బ్రవృద్ధంబైన జలముచే-
లజాప్తుగతిఁ బ్రకాశంబు నొందఁ
జేసి లోకాశ్రయస్థితి సర్వగుణవిభా-
సితగతి నొప్పు రాజీవ మందు

3-275.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిజ కళాకలితాంశంబు నిలిపి దాని
లన నామ్నాయమయుఁడును రగుణుండు
నాత్మయోనియు నైన తోజభవుండు
రవిఁ జతురాననుండునా నన మయ్యె.

టీకా:

పుట్టించెన్ = పుట్టించెను; తత్ = ఆ; గుణంబునన్ = గుణమునందు; పరమేశ్వరుని = విష్ణుని; నాభి = బొడ్డు; దేశమున్ = ప్రదేశము; అందున్ = అందు; నళిన = పద్మముయొక్క; నాళము = కాడ; ఉదయించెన్ = పుట్టినది; మఱి = మరి; ఆ = ఆ; పయోరుహ = తామర {పయోరుహము - పయస్ (నీట) పుట్టినది, పద్మము}; ముకుళంబు = మొగ్గ; కర్మ = కర్మముచే; బోధితము = చెప్పబడినది; ఐన = అయిన; కాలము = సమయము; అందున్ = అందు; తన = తనయొక్క; తేజమునన్ = తేజస్సుచే; ప్రవృద్ధంబు = బాగుగా పెరిగినది; ఐన = అయిన; జలము = నీరు; చేన్ = చేత; జలజాప్తున్ = సూర్యుని {జలజాప్తుడు - జలజ (పద్మము) నకు ఆప్తుడు, సూర్యుడు}; గతిన్ = వలె; ప్రకాశమున్ = ప్రకాశమును; ఒందన్ = పొందునట్లు; చేసి = చేసి; లోక = లోకములకు; ఆశ్రయ = నివాసమగుటకు; స్థితి = స్థితికలిగినదియు; సర్వ = సమస్తమైన; గుణ = గుణములతోను; విభాసిత = వెలుగొందు; గతిన్ = విధముగ; ఒప్పు = ఒప్పుచున్న; రాజీవము = పద్మము; అందున్ = అందు;
నిజ = తనయొక్క; కళా = కళతో; కలిత = కూడిన; అంశంబు = బాగము; నిలిపి = ఉంచి; దాని = దాని; వలన = వలన; ఆమ్నాయ = వేదముల; మయుండును = నిండినవాడును; వర = శ్రేష్ఠమైన; గుణుండు = గుణములుకలవాడును; ఆత్మ = స్వయం, తనకుతానే; యోనియున్ = భూతుడు, పుట్టినవాడు; ఐన = అయిన; తోయజసంభవుండు = బ్రహ్మదేవుడు {తోయజసంభవుడు - తోయజము (నీటపుట్టినది, పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; సరవిన్ = క్రమముగ; చతురాననుండు = చతురాననుడు {చతురాననుడు - వ్యు. చత్వారి ఆననాని అస్య, బ.వ్రీ. నాలుగు ముఖములు కలవాడు, చతుర్ముఖబ్రహ్మ}; నా = అనగా; జననము = పుట్టుట; అయ్యెన్ = జరిగెను.

భావము:

ఆ విధంగా పుట్టించిన రజోగుణంవల్ల నారాయణుని నాభిలో నుండి మొగ్గతో కూడీన ఒక తామరతూడు జన్మించింది. సృష్టికార్యప్రభావితమైన కాలాన్ని అనుసరించి భగవంతుడు తన తేజస్సుచేత వృద్ధిపొందిన నీటినడుమ ఆ తామరమొగ్గను సూర్యునిలాగా వికసింపజేశాడు. లోకాలకు ఆశ్రయం ఇచ్చే స్థితినీ, సకలగూణాలతో ప్రకాశించే ప్రకృతినీ కలిగిఉన్న ఆ కమలంలో పరాత్పరుడు తన కళతోకూడిన అంశాన్ని ప్రసరింప జేశాడు. అప్పుడు ఆ పద్మంలో నుంచి సంపన్నుడూ, స్వయంభువుడూ, చతుర్ముఖుడూ అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు.